S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

01/03/2018 - 20:31

కాఫీ కప్పులతో అన్నపూర్ణమ్మగారు హాల్లోకి వచ్చేసరికి ఆ నవ్వులు ఆగిపోయాయి.
***
లోహిత వాళ్ళింటినుంచి తిరిగి వస్తున్నాడు స్కంద.
వనస్థలిపురం నుంచి కారు హైవే మీదకు వచ్చింది.
‘‘నాన్న పర్సనాలిటీ నాకు వచ్చిందా?’’ అడిగాడు స్కంద.
‘‘ఇప్పుడా విషయాలు ఎందుకు’’ అసహనంగా కదులుతూ అంది మానస.

01/02/2018 - 19:22

‘‘నా రూపం ఆయనకు నచ్చదు. ఆయన ప్రవర్తనా నాకు నచ్చలేదు. మనస్ఫర్థలు వచ్చాయి.. విడిపోయాం! నా లైఫ్‌బుక్‌లో వివాహానికి సంబంధించిన పేజీలన్నీ చించేశాను. విడాకులు తీసుకున్న సమయంలో మూడు నెలల గర్భవతిని.. అబార్షన్ చేయించుకుందామనుకున్నాను.. మనస్సు ఒప్పుకోలేదు. నిన్ను కన్నాక నిన్ను పెంచే భారం మీ అమ్మమ్మ, తాతయ్యలకు వదిలేసి అమెరికా వెళ్లిపోయాను.. అమ్మా నాన్నలు పెద్దవాళ్ళయ్యారు.. వాళ్ళను చూసుకోవాలి.

12/31/2017 - 20:41

అర్జెంటుగా డాక్టర్స్ కాన్పరెన్స్ హాల్‌కు రమ్మని డాక్టర్ లోహితకు ఫోన్ చేశాడు కాశి.
కాన్ఫరెన్స్‌హాల్‌కు వెళ్లింది.
అప్పటికే అందరూ డాక్టర్లు వచ్చి కూర్చున్నారు.
టేబుల్‌మీద డాక్టర్ వౌర్య ఫొటో పెట్టివుంది. ఆ ఫోటోకు డాక్టర్ అరవింద్ గులాబీ పూల మాల వేశాడు. లోహితకు సైగ చెయ్యడం ఆమె వెళ్లి కుందులలోని వొత్తులు సరిచేసి దీపారాధన చేసి వౌర్యకు నమస్కరించింది.

12/30/2017 - 19:37

అన్యోన్యంగా వుండే మమ్మల్ని విడదీయాలని దుర్బుద్ధి పుట్టింది అరవింద్‌కు. ‘తన వైవాహిక జీవితం అతలాకుతలం అయ్యింది కాబట్టి మిత్రుడికి అదే గతి పట్టాలి’- అదీ అతని ఆలోచన.. అతని ప్రవర్తన పసిగట్టలేకపోయాను.. మా ఇంటికి వచ్చినపుడల్లా కాస్ట్లీ ప్రెజెంటేషన్స్ తెచ్చి ఇచ్చేవాడు. నేను ఎరుగా వున్నప్పుడు ‘‘మీ ఆయన ఏడు జన్మలు ఎత్తినా ఇటువంటి ఆర్టికల్స్ కొనలేడు’’ అనేవాడు మా ఆవిడతో.

12/28/2017 - 18:41

రూములో వున్న కొన్ని సీడీలు చూపించాడు.
‘‘క్రిటికల్ ఆపరేషన్స్ వీడియో తీస్తారు. మీకు అవగాహన కోసం చూపించమన్నారు డాక్టర్ అరవింద్‌గారు.. హాస్పిటల్ పరిసరాలన్నీ మా సర్వేలెన్స్‌లో వుంటాయి. ఎక్కడ ఏం జరుగుతున్నా మాకు తెలిసిపోతుంది. అన్నిచోట్లా సిసిటివి కెమెరాలు వున్నాయి’’ హాస్పిటల్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు ఆమెకు పూసగుచ్చినట్లు చెప్పాడు.

12/27/2017 - 18:33

అతని మాటలకు అడ్డొస్తూ ‘‘హాస్పిటల్ పరిసరాల్లో ఎక్కువ మంది నిరుపేదలు, గిరిజనులు కన్పించారు.. అక్కడ పనిచేసేవాళ్ళు రోగులకు సేవ చేయాలనే దృడ సంకల్పంతోనే పనిచేస్తున్నారు. మీ జర్నలిస్టులు ఏదో గాలి పోగుచేసి వార్తలు సృష్టిస్తూ వుంటారు’’ అంది లోహిత.

12/26/2017 - 18:36

అన్నీ ఆర్గానిక్ కూరగాయలే! సంవత్సరం గడిచేక మీకు కొత్త కారు కొనిస్తాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ మా హాస్పిటల్ విడిచిపెట్టి మరో హాస్పిటల్లో చేరకూడదు!’’ షరతులు వివరంగా చెప్పాడు అరవింద్.
పక్షి రెక్కలు విదులుకున్నట్లు ఆమె మెదడులో ఆలోచనలు కదలాడాయి.

12/24/2017 - 23:36

భద్రాచలం వెళ్ళే బస్సు ఎక్కి కూర్చుంది లోహిత.
మొదటి వరుసలో టికిటీ ప్రక్కనే సీటు. తన ప్రక్క సీటు రిజర్వు చేయించుకున్నది ఆడపిల్ల అయితే బాగుండును.. భద్రాచలం వరకు కబుర్లు చెప్పకుంటూ వెళ్ళొచ్చు! అనుకుంది.
‘ఎవరైతే తనకేం?’ అనుకుంది మరుక్షణం.

12/23/2017 - 18:39

ఆ యువకుడు దొంగను ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిలబడ్డ పోలీసు కానిస్టేబుల్‌కు అప్పగించి లోహిత దగ్గరకు వచ్చాడు.
‘‘మెళ్ళో గొలుసులు, చేతుల్లోని బ్యాగ్‌లు లాక్కుని వెళ్ళే చెయిన్ స్నాచర్స్, బ్యాగ్ లిప్టర్స్ సిటీలో ఎక్కువగా వున్నారు.. జాగ్రత్తగా ఉండాలి!’’ అని లోహిత సమాధానం కోసం ఎదురుచూడకుండా వెళ్లిపోయాడు ఆ యువకుడు.
***

12/22/2017 - 18:55

ప్రయాణానికి అవసరమైన వస్తువులన్నీ కొనుక్కుని షాపింగ్ మాల్ మెయిన్ గేట్‌లోనుంచి బయటకు వచ్చింది లోహిత.
డాక్టర్‌గా జీవిత ప్రయాణం మొదలుపెట్టబోతోంది. ఎంతో ఉత్సాహభరితంగా వుంది ఆమె మనస్సు. ఇంటర్ పూర్తయ్యక దాదాపుగా ఎనిమిదేళ్ళు మెడికల్ కోర్సులు చదివింది. యంబిబియస్ తరువాత యంఎస్, గైనకాలజీలో ప్రత్యేకంగా మరో డిగ్రీ సంపాదించింది.

Pages