S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

01/14/2018 - 18:21

తన పంట పండింది.
తిలక్ నిద్ర మత్తులో వుంటాడు కాబట్టి తను దర్జాగా బీరువాలో దొరికిన డబ్బు తీసుకుని ఉడాయించవచ్చు. నెల రోజులు దిగుల్లేదు.. ఆ డబ్బు ఖర్చుపెట్టుకుని సరదాగా తిరగొచ్చు...
శబ్దం రాకుండా బీరువా తలుపులు తీశాడు. పైఅరలో నోట్ల కట్టలు దొరికేయి. ఆ నోట్ల కట్టలు తీసుకుని ప్యాంటు జేబుల్లో కుక్కుకున్నాడు.

01/13/2018 - 18:38

శేషగిరి పక్కింటి వాళ్ళకు నాలుగు లారీలు వున్నాయి. ముంబై, హైదరాబాద్ మధ్య సరుకులు రవాణా జరుగుతూ వుండేది. ఒక లారీ పూర్తిగా శేషగిరి కంట్రోల్‌లో వుండేది. అతనే డ్రైవర్. మరో డ్రైవర్ ఆ బండి అంటుకోవడానికి వీల్లేదు. శేషగిరి కుటుంబం మీద వున్న అభిమానంతో ఆ లారీని పూర్తిగా శేషగిరి ఆధీనంలో వుంచేశాడు లారీ ఓనరు. సరుకు రవాణా మీద వచ్చే బాడుగలు క్రమం తప్పకుండా లారీ ఓనర్‌కు ఇచ్చేసేవాడు.

01/12/2018 - 18:52

పదిహేనేళ్ళ తరువాత కన్నకూతుర్ని చూశానన్న సంతోషం ఓవైపు, కుటుంబ సభ్యులకు దూరమయ్యానన్న బాధ మరో ప్రక్క అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది.
‘‘నువ్వు డాక్టరయ్యావా తల్లీ?’’ నోరు పెగల్చుకుని అన్నాడతను.
‘‘ఈ హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు?’’
‘‘పదిరోజులయ్యిందమ్మా’’ సమాధానమిచ్చాడు శేషగిరి.
‘‘రోజూ నేను నార్త్ బ్లాక్‌కు వస్తూనే వున్నాను కదా! నాకు ఎప్పుడూ మీరు కన్పించలేదేం?’’

01/11/2018 - 19:28

‘‘అవును.. మా అమ్మ గర్భంలో వన్నపుడే మా నాన్న పాట్నా వెళ్లిపోయాడు, అమ్మనుంచి విడాకులు తీసుకుని.. ఇపుడు ఎక్కడ వున్నాడో కూడా తెలియదు.. ఎలా వున్నాడో? ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రం వుంది’’
‘‘మా హాస్పిటల్లో సీనియర్ డాక్టర్ అరవింద్‌గారే మీ నాన్నగారు’’ అందామె.
‘‘అరవింద్ అని పేరున్న డాక్టర్లంతా నాకు నాన్నలవుతారా?’’
తన బ్యాగ్‌లో వున్న ఫోటో తీసి స్కందకు చూపించింది.

01/10/2018 - 18:56

‘‘హాస్పిటల్లోని సీనియర్ డాక్టర్లు, వాళ్ళని తోలుబొమ్మలా ఆడించే పైవాళ్ళు అంతా డర్టీ రోగ్స్.. వాళ్ళకు నీ మీద అనుమానం కలగడం నేను సహించలేను. మీ జోలికి వస్తే సహించను. వాళ్ళ పని పడతా! నా సంగతి వాళ్ళకు తెలియదు..’’ అన్నాడు ఆవేశంతో ఊగిపోతూ.
‘‘నువ్వు ఎవరితో కుర్రాడితో రహస్యంగా మాట్లాడుతున్నావని వాళ్ళకు అనుమానం వచ్చింది?’’

01/09/2018 - 18:52

సిటీ బస్సులు పట్టుకుని సిటీ అంతా తిరగడం మాకు అలవాటే’’ అంది సావేరి.
‘‘నేను మిమ్మల్ని కారులో మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను’’ అన్నాడు నిశాంత్.
‘‘వొద్దులెండి, మీకు అనవసరమైన శ్రమ.. బస్సులో వెళ్తాం’’ అంది లోహిత.
సావేరి మాత్రం అతను తమతోపాటే వస్తే బాగుండుననుకుంది.
గ్యారేజ్‌లోనుంచి కారు తీశాడతను.. కార్లో కూర్చున్నారిద్దరూ.

01/07/2018 - 21:05

‘‘మా హాస్పిటల్లోనా.. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషనా? అదేమన్నా చిన్న ఆపరేషన్ అనుకున్నావా? ఎంత ఎక్విప్‌మెంట్ కావాలి? బాగా అనుభవం వున్న డాక్టర్లుగాని ఆపరేషన్ చేయలేరు’’ అంది లోహిత.

01/06/2018 - 18:50

‘‘ఇపుడెందుకే టీవీ చానల్స్ చూడటం.. ఇదేమన్నా మన ఇల్లా?’’ చెల్లెలు వైపు చురచురా చూస్తూ’’ అంది లోహిత.
‘‘ఆ పనివెధవ నున్న మింగేసేటట్లు చూస్తున్నాడు. వాడి దృష్టి మరల్చుదామని టీవీ ఆన్ చేయమని చెప్పానే్ల!’’ అంది అక్కతో కొంచెం గొంతు తగ్గించి.
ఆ అబ్బాయి టీవీ ఆన్ చేసి మళ్లీ సావేరివైపే చూస్తున్నాడు.

01/05/2018 - 20:13

ఆ ఆపరేషన్ డాక్టర్ వౌర్య చేసింది కాదు.. అతనికి ఎలాట్ చేసిన బ్లాకులో ఆ ఆపరేషన్ జరగలేదు.
పోస్టుమార్టమ్ రిపోర్టులో నా ఫైండింగ్స్ అన్నీ రికార్డు చేశాను. ఆ రిపోర్టు పోలీసులు సెషన్స్ కోర్టు ముందు ఉంచారు. కేసు విచారణలో వుంది. ఆ కేసు వివరాలు డాక్టర్ వౌర్యగారింటికి వెళ్లినపుడు ఆయనకు చెప్పాను.. ఆయన తల పట్టుకుని బాధపడ్డాడు..

01/04/2018 - 19:19

సంపాదించినదంతా ఊళ్ళో పేదవాళ్ళకు ఉదారంగా ఇస్తూ వుండేవాడు.
‘‘మీవాడికి శత్రువులు ఎవరన్నా ఉన్నారా?’’

Pages