S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

01/26/2018 - 20:45

ఆ రోడ్డుమీదే వెళ్ళే పోలీస్ పెట్రోలింగ్ వెహికల్‌లో కూర్చున్న సర్కిల్ ఇన్స్‌పెక్టర్ అలాగే అనుకుని ముందుకు వెళ్లిపోయాడు.
అర్థరాత్రి పెట్రోలింగ్ వెహికల్ అదే దారిలో తిరిగివస్తుంటే కారు అక్కడే అగి వుండడం, డ్రైవర్ సీటులో వున్న వ్యక్తి చలనం లేకుండా స్టీరింగ్ మీద పడి వుండటం చూసి అనుమానం వచ్చి డాక్టర్ ఫణి కారు ముందు పోలీసు వెహికల్ ఆపి హెడ్‌లైట్స్ ఫోకస్ చేశాడు.

01/25/2018 - 20:16

శారీరక వాంఛలు తీరిపోతున్నాయి. ఇక పెళ్లి అవసరం ఏముంది? తన లక్ష్యం ఒక్కటే! శస్త్ర చికిత్సలో పేరు పొందిన డాక్టరు కావాలి! కోట్లకు అధిపతి కావాలి!
యం.ఎస్ చదవాలన్నాడు తను తండ్రితో.
‘‘నీ చదువుకు ఇప్పటికే బోలెడు ఖర్చు అయ్యింది. అందినచోటల్లా అప్పులు చేశాను.. నువ్వు గట్టిగా పట్టుబడితే మనకు వున్న ఆ రెండెకరాలు అమ్మేయాల్సి వస్తుంది’’ అన్నాడాయన.
‘‘అమ్మేసేయ్యండి’’ అన్నాడు తను.

01/24/2018 - 19:55

మనస్సు గతంలోకి జారుకుంది.
.. రెండెకరాల రైతు తండ్రి.. వ్యవసాయం మీద వచ్చే ఆదాయంతో ఇల్లు గడవడం కష్టంగానే వుండేది.. నాన్నకు ఎద్దుల బండి వుండేది. వరహాపురం నుండి వేమూరుకు, కొల్లూరుకు ధాన్యం బస్తాలు, మినుములు, ఎండుగడ్డి ఎడ్లబండి మీద తరలిస్తూ వుండేవాడు. ఆ బాడుగ డబ్బులు ఇంట్లో ఖర్చులకు వాడేవాడు.. అమ్మ కూడా పొలం పనులకు వెళ్ళేది.

01/23/2018 - 19:52

తనను ఫూల్ చెయ్యడానికి ఏవేవో నెంబర్లు కాగితంమీద రాసిచ్చాడా? ఒకసారి హైదరాబాద్ వెళ్లి నిజంగానే అతనికి స్విస్ ఎకౌంట్ వుందో లేదో చెక్ చేసుకోవాలి.
అరవింద్ ఇచ్చిన పేపర్లు, బ్యాంక్ అకౌంట్ డాక్యుమెంట్లు భద్రంగా తన షెల్ఫ్‌లో పెట్టుకున్నాడు కాశి.
****
హాస్పిటల్ దగ్గర వున్న హెలిపాడ్ దగ్గర హడావుడి మొదలంది. ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు ఆ ప్రాంతమంతా చుట్టుముట్టేశారు.

01/21/2018 - 20:43

మా డాక్టరు చెప్పేక నీకు ఉద్యోగం ఇవ్వకపోతే ఏమన్నా వుందా?’’ ఈ రోజే జాయిన్ అవ్వు.. జీతం, వర్కింగ్ కండిషన్స్ గూర్చి రేపు మాట్లాడుకుందాం!’’ అన్నాడు కాశి.
కాశీకి నమస్కారం పెట్టి రూము బయటకు వెళ్లి నిలబడ్డాడు లెనిన్.
‘‘కుటుంబం అంటూ అయినవాళ్ళు లేకపోవడం, ఒంటరిగా వుండటంతో ఒత్తిడి ఎక్కువగా వుంటుంది మేడమ్.. ఏం చెయ్యమంటారు?’’ అడిగాడు కాశి.
‘‘వెంటనే పెళ్లిచేసుకోండి’’’ అందామె.

01/20/2018 - 19:31

డాక్టర్ లోహిత ఫణికి నమస్కరించినా పట్టించుకోలేదు. ఆమె వైపు చూడను కూడా చూడలేదు.
డాక్టర్ ఫణి వెళ్లిపోయాడు.
‘‘వీడు మ్యాడ్ ఫెలో.. ఏది అనుకుంటే అది జరిగిపోవాలి!’’ మనస్సులో అనుకుంటున్న మాటలు పైకి అనేశాడు డాక్టర్ అరవింద్.
ఏ విషయం గూర్చి డాక్టర్ ఫణి అడిగాడో చెబుతాడేమోనని ఎదురుచూసింది లోహిత.

01/19/2018 - 19:38

చెట్లమధ్య సాయంత్రం పూట వాకింగ్ చేస్తూ వుంటారు డాక్టర్లు. ఒకళ్ళ్దిదరు సిమెంటు బెంచీమీద కూర్చుని మెడికల్ జర్నల్స్ తిరగేస్తూ ఉంటారు. నాలుగు మూలలా ఐరన్ పోల్స్ వున్నాయి. వాటికి స్పీకర్లు అమర్చి వున్నాయి. వాటిల్లోంచి మంద్ర స్థాయిలో ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్ వినిపిస్తూ వుంటుంది.

01/18/2018 - 21:00

మాఫియా గ్యాంగుకు సొంతంగా గూఢచారి బృందం వుంది. వాళ్ళు హాస్పిటల్ పరిసరాల్లో తిరుగుతూ ఎన్నో వివరాలు సేకరిస్తూ వుంటారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గమనించి ఆ ఇన్‌ఫర్‌మేషన్ డాక్టర్ అరవింద్‌కు అందిస్తూ వుంటారు. వాళ్ళ బాస్ ముంబాయిలో వుంటాడు ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో అరిఫ్‌కు ఆ వివరాలు అందుతాయి.
డాక్టర్ అరవింద్ దగ్గరకు వచ్చారు వాళ్ళు.
‘‘ఏమిటి విశేషాలు?’’ అడిగాడు అరవింద్.

01/17/2018 - 20:50

ఆసక్తిగా అతని వైపు చూసింది చెప్పమన్నట్లుగా.
ఐదేళ్ళ క్రిందట జరిగిన సంఘటన చెప్పుకుపోయాడు కాశి.
‘‘ఐదేళ్ళ క్రిందట ఓ రోజు అరవింద్‌గారి ఛాంబర్‌లోకి వెళ్ళాను. అక్కడ స్మగుల్డ్ గూడ్స్ అమ్మే జాన్ కన్పించేడు. అతన్ని అంతకుముందు చాలాసార్లు అరవింద్‌గారితోపాటు చూశాను.
అరవింద్‌గారు, ఓ పిస్టల్ నా చేతిలో వుంచి ‘‘కాల్చు.. జాన్‌కు గురిపెట్టి కాల్చు.. పిస్టల్‌లో డమీ బుల్లెట్స్ వున్నాయిలే!

01/16/2018 - 21:13

తిరువూరు వెళ్ళాడు. అక్కడ అతని అమ్మమ్మ ఉంది. ఆమెకు ఎనభైయ్యేళ్ళు. కళ్ళు సరిగ్గా కన్పించవ్.. వినబడదు కూడా.. కొడుకులు ముగ్గురూ ఎక్కడో దూరంగా వుంటున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ. ఒకటే కూతురు. ఆమె చనిపోయి ఐదేళ్ళు అవుతూ వుంది. ఆమె కొడుకే శేషగిరి.
మనవడిని గుర్తుపట్టింది చూపు సరిగ్గా ఆనకపోయినా.
‘‘మీ అమ్మ చనిపోయినప్పుడు రాలేదేం?’’ అడిగిందామె.
ఎక్కడొస్తాడు? జైల్లో వుంటే..

Pages