S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/28/2016 - 20:59

వరుణ్‌తేజ్ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు రూపొందిస్తున్న చిత్రం ‘మిస్టర్’. లావణ్య త్రిపాఠి, హెబాపటేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో వెంకటేష్ క్లాప్‌నిచ్చారు.

04/28/2016 - 20:56

మహేష్‌బాబు కథానాయకుడిగా పివిపి సినిమా పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పరం వి.పొట్లూరి, పెరల్ వి.పొట్లూరి, కవిన్ అనె్న రూపొందిస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

04/28/2016 - 20:54

హనీష్, చిరాశ్రీ జంటగా శ్రీ కనకదుర్గ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె.సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం.మారుతి ప్రసాద్, ఎన్.రాధాకృష్ణ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆమె అతడైతే’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

04/28/2016 - 20:53

అల్లు శిరీష్ హీరోగా ఎమ్.వి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ నెంబర్ 2 సినిమా గురువారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. ఎస్.శైలేంద్ర బాబు, కె.వి.శ్రీ్ధర్‌రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి బోయపాటి శ్రీను క్లాప్‌కొట్టగా.. శ్రీనువైట్ల కెమెరా స్విచ్‌ఆన్ చేశారు. మారుతి గౌరవ దర్శకత్వం వహించారు.

04/28/2016 - 20:51

రష్మిగౌతమ్, చరణ్‌దీప్ ప్రధాన తారాగణంగా జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అంతం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. కథానాయిక రష్మి పుట్టిన రోజు సందర్భంగా అంతం చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

04/28/2016 - 20:49

ఇటీవలే తెలుగులో చిన్న సినిమాగా విడుదలై మంచి హిట్ అందుకున్న ‘క్షణం’ సినిమా ఇపుడు బాలీవుడ్‌కి వెళ్లనుంది. ఆ సినిమాలో అనసూయ చేసిన ఐపిఎస్ పాత్రని టబుతో రీప్లేస్ చేయబోతున్నారట. సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటిస్తాడని ప్రచారం సాగుతోంది. ఒరిజినల్ వెర్షన్‌లో హీరోయిన్‌గా నటించిన ఆదాశర్మని హిందీలో కూడా కంటిన్యూ చేయబోతున్నారట.

04/28/2016 - 17:56

దిల్లీ: దేశవ్యాప్తంగా ఎంబిబిఎస్, మెడికల్ పీజీ, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు అన్ని రాష్ట్రాల్లోనూ ‘నీట్’ (నేషనల్ ఎలిజిబిలటీ ఎంట్రన్స్ టెస్ట్) నిర్వహించాలని సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. 2016-17 సంవత్సరానికి సంబంధించి ‘నీట్’ నిర్వహించి తీరాలని. తమ ఆదేశాల్ని అన్ని రాష్ట్రాలూ అమలు చెయ్యాల్సిందేనని స్పష్టం చేసింది.

04/28/2016 - 17:53

విజయవాడ: ఎపి ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ తేదీ విషయంలో ఎలాంటి మార్పు లేదని, ముందు నిర్ణయించినట్లు ఈనెల 29నే ఎంట్రన్స్ నిర్వహిస్తామని ఎంసెట్ కన్వీనర్ సాయిబాబా గురువారం తెలిపారు. దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలను ‘నీట్’ (నేషనల్ ఎలిజిబిలటీ ఎంట్రన్స్ టెస్ట్) ద్వారానే జరపాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఎంసెట్‌కు వర్తించదని ఆయన స్పష్టం చేశారు.

04/28/2016 - 17:52

హైదరాబాద్: పాలేరు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికలో పోటీ చేయరాదని బిజెపి తెలంగాణ విభాగం నిర్ణయించింది. ఏ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం గానీ, ప్రచారం చేయడం గానీ ఉండదని టి.బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ గురువారం ప్రకటించారు.

04/28/2016 - 17:52

దిల్లీ: అగస్టా-వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో ఎవరెవరికి ముడుపులు అందాయన్న విషయమై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇకనైనా నోరు విప్పాలని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా డిమాండ్ చేశారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, కుంభకోణానికి సంబంధించి ఇటలీ జైలులో ఎవరెవరున్నారు? ఎంత మేరకు అవినీతి జరిగింది? ఎవరెవరికి ఎంతెంత ముడుపులు అందాయో సోనియా చెప్పాలన్నారు.

Pages