S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/28/2016 - 23:37

అవినీతి, బంధుప్రీతి, పక్షపాతం,ఆశ్రీత పక్షపాతం-ఘనత వహించిన కాం గ్రెస్ పార్టీ ఇలాంటి దుర్వ్యవస్థలకు మా త్రమే కారణమని ఇంతకాలం అనుకుంటూ వచ్చాం. కానీ వాస్తవాలు మరింత వ్యాకులత కలిగించేవిగా ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం- తన పదవీకాలాన్నంతా న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయడం, దర్యాప్తు సంస్థల్ని కాపలా కుక్కలుగా వాడుకోవడంతోనే సరిపోయింది.

04/28/2016 - 23:34

నీతి, నిజాయతీలకు మారుపేరు ఆయన. తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన మహానుభావుడు. రాజకీయాల విలువలకు పెద్దపీట వేసి, ప్రజాపోరాటాల్లో పాల్గొన్న చైతన్యశాలిగా గుర్తింపు పొందారు. స్వాతంత్య్ర సమరయోధునిగా, ఉత్తమ శాసనసభ్యునిగా, గ్రంథాలయోద్యమ సారథిగా, రాష్ట్ర తొలి అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఎనలేని కీర్తిని పొందిన వావిలాల గోపాల కృష్ణయ్య ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు.

04/28/2016 - 23:32

విద్యార్థులకు విద్యనందించడానికి, విద్యావ్యాప్తికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యేటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితం లభించడం లేదు. అన్నిరకాల సౌకర్యాలతో పాఠశాలలు నిర్వహిస్తున్నా, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విద్యార్థులకు అందిస్తున్నా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోతున్నది.

04/28/2016 - 23:29

దేశములెన్నయినను- ధరణి వొక్కటే
జీవులెన్నయినను- జీవంబునొక్కడే
వేదములెన్నయినను- వేదసారంబునొక్కటే
భాషలెన్నయినను- భావంబువొక్కటే
కులములెన్నయినను- కూడునొక్కటే
జన్మలెన్నయినను- జీవన గమనము లొక్కటే
మతములెన్నయినను- మార్గంబునొక్కటే
జనని లేనిది- జన్మ లేదు
ధరణి లేనిది- ధాన్యము లేదు
సంపద శాశ్వతము కాదు- సంతానము శాశ్వతము కాదు

04/28/2016 - 23:20

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 28: గ్రామీణ ప్రాంత కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బిజెపి జిల్లా కార్యదర్శి బుసిరెడ్డి సుబ్బారెడ్డి ప్రకటనలో డిమాండ్ చేశారు. వలసపోయే వారిలో ఎక్కువగా దళితులు, గిరిజనులు ఉన్నారని, వారికి సరైన ఉపాధి అవకాశాలులేనందున ప్రతి సంవత్సరం వలసపోవడం జరుగుతుందని తెలిపారు.

04/28/2016 - 23:20

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 28: గత పుష్కర కాలం నుంచి ఈ ప్రాంత ప్రజలకు ఊరిస్తున్న మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే జూలై నాటికి రెండు మోటర్లద్వారా కొంత ఆయకట్టుకు నీరు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

04/28/2016 - 23:19

ధన్వాడ, ఏప్రిల్ 28: ధన్వాడ మండలంలోని మధ్వార్ గ్రామానికి కోయిల్ సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని గ్రామరైతులు గురువారం ధర్నా కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ఎంపిటిసి రాము, గ్రామ నాయకులు బాలస్వామి, రంజిత్‌కుమార్‌లు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న పెద్దచెరువు,దోబ్బోని కుంట కు కోయిల్ సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.

04/28/2016 - 23:18

ఆమనగల్లు, ఏప్రిల్ 28: రాష్ట్రంలో ఏర్పడ్డ కరవు దృష్ట్యా సహాయక చర్యలను యుద్ద్ధ ప్రతిపాదికన చేపట్టి రైతులు, ప్రజలను ఆదుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండురంగారెడ్డి కోరారు. గురువారం ఆమనగల్లు ఎంపిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి, జడ్పీటిసి కండే హరిప్రసాద్ పాల్గొన్నారు.

04/28/2016 - 23:18

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 28: జిల్లాలో తాగునీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ శ్రీదేవి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో తాగునీటి పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా తగు చర్యలు తీసుకోవాలని అవసరమైన చోట మంచినీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని తెలిపారు.

04/28/2016 - 23:17

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసఋ౎టత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం పథకం పనులు అందరికి ఆదర్శంగా ఉండాలని నిష్పక్షపాతంగా నిజమైన లబ్దిదారులకు చేకూరేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి అన్నారు. గురువారం మహబూబ్‌నగర్ పట్టణ శివారులో గల ఆదర్శకాలనీ పక్కన గల డబుల్ బెడ్‌రూం పథకం సైట్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు.

Pages