S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/28/2016 - 12:51

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని, వడగాలుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు నీడపట్టునే ఉండాలని సూచించింది. ఒక్క బుధవారం నాడే ఆంధ్రాలో వడదెబ్బకు 41 మంది మరణించారు.

04/28/2016 - 12:51

విజయవాడ: అధికార తెలుగుదేశంలోకి విపక్ష ఎమ్మెల్యేల వలసల జోరు కొనసాగుతోంది. వైకాపాకు చెందిన విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి గురువారం ఉదయం ఇక్కడ సిఎం క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి టిడిపిలో చేరారు. ఉదయం 9-05 గంటలకు మంచి ముహూర్తంగా భావించి బుడ్డా టిడిపి అధినేతను కలిసి కండువా వేయించుకున్నారు.

04/28/2016 - 05:00

హైదరాబాద్, ఏప్రిల్ 27: వేగంగా పట్టణీకరణ పెరుగుతున్న జిహెచ్‌ఎంసి పరిధిలో ఏ అభివృద్ధి చేపట్టిన స్థల సేకరణ అనేది అధికారులకు పెద్ద సమస్యగానే మారుతోంది. కొన్ని అభివృద్ధి పనులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలే స్థలాలిచ్చేందుకు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనల విషయంలో నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

04/28/2016 - 05:00

హైదరాబాద్, ఏప్రిల్ 27: పోలీస్ శాఖ తరహాలో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. అన్ని రకాల ఫిర్యాదులు, అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ, సమాచారం వేగంగా అందేందుకు దోహదపడే విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేసింది. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా సమక్షంలో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి బుధవారం ఈ సెంటర్‌ను ప్రారంభించారు.

04/28/2016 - 05:00

హైదరాబాద్, ఏప్రిల్ 27: మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న రద్ధీకి తగ్గట్టు ప్రజల అవసరాలను తీర్చలేని ప్రజారవాణా వ్యవస్థకు ప్రత్యామ్నాయమైన ఆటోవాలాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ప్రయాణించిన దూరాన్ని బట్టి రాష్ట్ర రవాణా శాఖ కనిష్ఠ మీటరు చార్జీలను, ఆ తర్వాత ఒక్కో కిలోమీటరుకు వసూలు చేయాల్సిన చార్జీలను నిర్ణయించినా, వాటిని ఏ మాత్రం అమల్లో పెట్టకుండా ఆటోవాలాలు ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారు.

04/28/2016 - 04:59

హైదరాబాద్, ఏప్రిల్ 27: మహానగరాన్ని స్వచ్ఛ హైదరాబాద్ నగరంగా, చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు జిహెచ్‌ఎంసి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది.

04/28/2016 - 04:58

హైదరాబాద్, ఏప్రిల్ 26: రోజురోజుకు ఎండలు ముదురుతుండటంతో జలాశయాల్లోని నీరు ఆవిరి అవడంతో పాటు క్రమంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. గత కొంతకాలం నుంచి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృష్ణా, గోదావరి జలాల తరలింపు పథకం కింద నీటిని సరఫరా చేస్తున్నారు.

04/28/2016 - 04:56

మచిలీపట్నం, ఏప్రిల్ 27: భూగర్భ జలాల పెంపునకు నీటికుంటల తవ్వకాన్ని జిల్లాలో ఉద్యమంలా చేపట్టాలని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. రాష్టవ్య్రాప్తంగా 10లక్షల నీటి కుంటలను తవ్వించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. స్థానిక 26వ వార్డు చింతగుంటపాలెంలో రూ.20.25 లక్షలతో నిర్మించిన పిఎసిఎస్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం జరిగింది.

04/28/2016 - 04:56

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 27: బందరు మండలం ఉల్లిపాలెం గ్రామంలో వేంచేసి వున్న శ్రీ హేమకోదండ రామాలయం ట్రస్ట్‌బోర్డు వివాదంపై బుధవారం గ్రామస్తులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పిఆర్ రాజీవ్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పోతేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు.

04/28/2016 - 04:55

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 27: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న సిబ్బంది కొరతను భర్తీచేయాలని కోరుతూ బందరు మార్కెట్ యార్డు ఛైర్మన్ గోపు సత్యనారాయణ రాష్ట్ర వైద్యవిద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు.

Pages