S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/18/2016 - 16:43

ఢిల్లీ : పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటుచేసిన తెలుగుదేశం వ్వవస్థాపకుడు ఎన్టీయార్ విగ్రహానికి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ఢిల్లీలో ఏపీ అధికార ప్రతినిధి కంభంపాటి, ఎంపీలు నివాళులర్పించారు.

01/18/2016 - 16:42

ఢిల్లీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ మృతిపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖ ఇద్దరు సభ్యులతో ద్విసభ్యకమిటీని నియమించింది.
షకీలాశంఘూ, సూరత్ సింగ్‌లతో కూడిన ఈ కమిటీ రోహిత్ ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించనున్నది.

01/18/2016 - 16:41

ఢిల్లీ : కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి.

01/18/2016 - 16:40

ముంబయి : ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన రాజస్థాన్ రాయల్స్ మాజీ క్రికెటర్ అజిత్ చండీలాపై బీసీసీఐ జీవితకాలం పాటు నిషేధం విధించింది. 2013 ఐపీఎల్ సీజన్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని రాజస్థాన్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్‌లతో పాటు అజిత్ చండీలాలను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీశాంత్, చవాన్‌లపై జీవితకాలం నిషేధం విధించగా, తాజగా చండీలాపై వేటు పడింది.

01/18/2016 - 16:39

హైదరాబాద్ : రాయదుర్గం స్మశానవాటికలో సిక్కీం మాజీ గవర్నర్ రామారావు అంత్యక్రియలు ముగిశాయి. తమిళనాడు గవర్నర్ రోశయ్య, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు,బండారు దత్తాత్రేయ, బాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, బాజపా జాతీయ నాయకుడు మురళీధర్‌రావు, కలెక్టర్ రాహుల్ బొజ్జ తదితరులు హాజరయ్యారు.

01/18/2016 - 16:38

అస్సాం : అస్సాం ముఖ్యమంత్రి తరుణ్‌గొగోయ్ గువహటి సోమవారంనాడు పరువు నష్టం కేసులో విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. బాజపా నేత హిమంత బిస్వా శర్మ సీఎంపై వంద కోట్ల రూపాయల పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. హిమంత శర్మ బాజపాలో చేరకముందు తరుణ్‌గొగోయ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. సీఎం తనపై రెండు అవినీతి ఆరోపణలు చేసి చర్యలు తీసుకున్నారని హిమంత శర్మ పిటిషన్ దాఖలు చేశారు.

01/18/2016 - 16:37

విశాఖపట్నం : విశాఖ నగరంలోని రామచందర్‌రావునగర్‌లో కమల (48), రవికుమార్ (30)అనే తల్లీకుమారుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి మానసిక స్థితి సరిగా లేనందునే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

01/18/2016 - 14:04

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయపై కేసు నమోదు అయింది. దత్తాత్రేయ ఇచ్చిన లేఖ వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు సోమవారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే వైస్ ఛాన్సులర్ అప్పారావుపై కూడా కేసు నమోదు అయింది.

01/18/2016 - 13:55

ఢిల్లీ : ఢిల్లీలో సోమవారం ఉదయం పొగమంచు మంచుకురియడంతో రైళ్లతోపాటు పలు విమాన సర్వీసులకు కూడా ఆటంకం ఏర్పడింది. 21 రైళ్లు రద్దయ్యాయి.వాతావరణంలో తేమ 97 శాతం నమోదయ్యింది.

01/18/2016 - 13:48

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ హయాం నుంచే వెనుకబడిన వర్గాలు, మహిళలకు రాజకీయ ప్రాధాన్యం పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన ఎన్టీఆర్‌ వర్థంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Pages