S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/19/2016 - 04:50

సూళ్లూరుపేట, జనవరి 18: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత ఐదో క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 9.31 గంటలకు పిఎస్‌ఎల్‌వి సి-31 రాకెట్ నింగిలోకి పంపనున్నారు.

01/19/2016 - 04:02

వెల్దుర్తి, జనవరి 18: కర్నూలు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లి బస్‌స్టేషన్ సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. దీంతో డ్రైవర్ సహా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.

01/19/2016 - 04:00

విజయవాడ, జనవరి 18: తెలుగుదేశం పార్టీ కుటుంబం వంటిదని, కార్యకర్తలందరినీ కుటుంబ సభ్యుల్లానే తాను మొదటి నుంచి భావిస్తున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగువారి ఆత్మాభిమానం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించిన దివంగత ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం తాను నిరంతరం పాటుపడతానని చెప్పారు.

01/19/2016 - 03:42

రాజమహేంద్రవరం, జనవరి 18: గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 29మంది మృతి చెందిన సంఘటనపై జస్టిస్ సివై సోమయాజులు ఏక సభ్య కమిషన్ సోమవారం ఇక్కడ న్యాయ విచారణ మొదలెట్టింది.

01/19/2016 - 03:35

హైదరాబాద్, జనవరి 18: విశాఖపట్టణంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు విజయవంతం కావడంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ మరింత ఉత్సాహంతో ఈసారి అంతర్జాతీయ వేదికపై కీర్తిపతాక ఎగరేసేందుకు సంసిద్ధమైంది. సిఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వ అత్యున్నత ప్రతినిధి బృందం దావోస్ బయలుదేరివెళ్తోంది.

01/19/2016 - 03:33

న్యూఢిల్లీ, జనవరి 18: కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాను. పార్టీ హైకమాండ్ నిర్ణయించిన వెంటనే అధ్యక్ష పదవి చేపడతానని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. రాహుల్ సోమవారం దక్షిణాది రాష్ట్రాలకు చెందిన విలేఖరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని, అధినాయకత్వం ఈమేరకు నిర్ణయం తీసుకోవటమే ఆలస్యమని ప్రకటించారు.

01/19/2016 - 03:29

న్యూఢిల్లీ, జనవరి 18: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి ప్రధాన కుట్రదారుగా భావిస్తున్న పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధినేత వౌలానా మసూద్ అజర్‌ను పాక్ ప్రభుత్వం అరెస్టు చేయడం కానీ, గృహ నిర్బంధంలో ఉంచడం కానీ చేయలేదని ఈ దాడితో సంబంధం ఉన్న కేసులకు సంబంధించి అతని జూనియర్ అనుచరులు ముగ్గుర్ని మాత్రం అరెస్టు చేసారని అధికారులు చెప్పారు.

01/19/2016 - 00:21

గోవిందాపురంలో గోచిగూడాలో ‘‘డింగ్ డాంగ్’’ ఆశ్రమం ఉన్నట్టుండి రాత్రికి రాత్రే వెలిసింది. తెల్లారేసరికి ఆ ఆశ్రమం చుట్టూ జనసమూహం. ‘ఈయన నిజమైన స్వామిజీయేనా?’ పిన్ని అనుమానంగా అడిగింది అనసూయ ఆశ్రమంలోకి అడుగుపెడుతూ.

01/18/2016 - 23:59

పృథ్వీరాజ్ 16 సార్లు మహమ్మద్ ఘోరీని ఓడించి, క్షమించి వదిలేశాడు. 17వ సారి ఘోరీ మహమ్మద్, ఫృథ్వీరాజ్ చౌహాన్ని తరైన్ యుద్ధంలో ఓడించి, కళ్లు పీకించి, గుర్రానికి కట్టి లాక్కెళ్లాడు. భారత్ నుంచి బంగారాన్ని గుర్రాల మీద, స్ర్తిలను బానిసలుగా తీసుకెళ్లాడు.

01/18/2016 - 23:56

బిహార్ అంటే అది ఒకప్పుడు లలూప్రసాద్ యాదవ్ గారి ఇష్టారాజ్యం- తానొక సమోసాలాంటివాణ్ని అనేవాడు శ్రీమాన్ లలూ ప్రసాద్ యాదవ్‌గారు. సమోసాను మించిన సామాన్యుడి తిండి మరొక్కటి లేదు. అందుకనే లాలూజీ ఎప్పుడూ బిహారులో సమోసాలు, ఆలు వున్నంతకాలం లాలూ వుంటాడు అంటూ గర్వంగా మాట్లాడుతూ వుండేవాడు. కాని యివాళ లాలూప్రసాద్‌గారి పార్టీ సమ ఉజ్జీ అయిన బలం వున్నా ఆయనకి గద్దెమీద కూర్చునే ఛాన్స్ లేదు.

Pages