S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/18/2016 - 07:07

రమల్లా, జనవరి 17: పాలస్తీనా పట్ల దీర్ఘకాలికంగా తాము అనుసరిస్తున్న విధానంలో ఎలాంటి మార్పులేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆ దేశానికి స్పష్టం చేశారు. పశ్చిమాసియా పర్యటనలో ఉన్న సుష్మా స్వరాజ్ ఆదివారం ఇక్కడ పాలస్తీనా విదేశీ వ్యవహారాల మంత్రితో చర్చలు జరిపారు.

01/18/2016 - 07:05

వాషింగ్టన్/వియన్నా, జనవరి 17: అమెరికా, ఐరోపా సమాజాలు ఇరాన్‌పై విధించిన ఆంక్షలను ఆదివారం ఎత్తివేసాయి. ఇరాన్ అణ్వస్త్రాలను అభివృద్ది చేయకుండా నిరోధించడానికి రూపొందించిన చరిత్రాత్మక ఒప్పందం కింద అన్ని హామీలను ఆ దేశం నెరవేర్చిందని ఐక్యరాజ్య సమితి అణు నిఘా సంస్థ (ఐఎఇఏ) ధ్రువీకరించిన తర్వాత అమెరికా, ఇయు దానిపై విధించిన ఆంక్షలన్నిటినీ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించాయి.

01/18/2016 - 07:06

న్యూఢిల్లీ, జనవరి 17: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన అంకుర పరిశ్రమల విధానం (స్టార్టప్)లో పలు లోపాలున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ విమర్శించారు. ఈ విధానాన్ని యుపిఏ ప్రభుత్వ హయాంలోనే అమలుచేయటం జరిగిందని, గతంలో అమలైన విధానాన్ని నరేంద్ర మోదీ కొత్తగా కనుగొన్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.

01/18/2016 - 07:02

వాషింగ్టన్, జనవరి 17: అమెరికాలో భారతీయ సంతతికి చెందిన ఒక సైకియాట్రిస్టును పోలీసులు అరెస్టు చేసారు. అతని వద్దకు వచ్చిన పేషెంట్లలో 36 మంది చనిపోవడంతో పోలీసులు అతడ్ని అరెస్టు చేసారు. వీరిలో 12 మంది మోతాదుకు మించి ఎక్కువ మందులు ప్రిస్క్రైబ్ చేయడం వల్ల చనిపోయారు.

01/18/2016 - 07:01

న్యూఢిల్లీ, జనవరి 17: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై ఒక యువతి సిరా దాడికి పాల్పడింది. ఢిల్లీ రోడ్లపైకి ఒకరోజు సరి సంఖ్య గల వాహనాలను, మరో రోజు బేసి సంఖ్య గల వాహనాలను అనుమతిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం విజయవంతం కావడంతో ప్రజలకు కృతజ్ఞతలు తెలియడానికి ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన సభలో ఈ సంఘటన జరిగింది.

01/18/2016 - 06:57

న్యూఢిల్లీ, జనవరి 17: భారత్-పాకిస్తాన్ సరిహద్దు వెంబడి కంచెలేని చొరబాట్లకు అవకాశాలున్న ప్రాంతాల్లో త్వరలోనే లేజర్ గోడలను ఏర్పాటు చేయనున్నారు. పఠాన్‌కోట్ దాడి నేపథ్యంలో పాకిస్తాన్ వైపునుంచి టెర్రరిస్టు చొరబాట్లను పూర్తిగా అరికట్టడానికి ఇలాంటి గోడలను నిర్మించాలని హోం మంత్రిత్వ శాఖ భావిస్తోంది.

01/18/2016 - 06:49

న్యూఢిల్లీ, జనవరి 17: భారతీయులది ప్రకృతితో మమేకమైన సమాజం, ప్రపంచంలో మరెక్కడ ఇలాంటి సమాజం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సంక్రాం తి సందర్భంగా తమ నివాసంలో ఏర్పాటు చేసిన సంబరాలకు హాజరైన మోదీ తెలుగు వారిని ఉద్దేశించి ప్రసంగించారు. భారతీయులు తన జీవితాలను క్యాలెండర్‌తో ముడిపెట్టుకోకుండా ప్రకృతితో పెనవేసుకున్నారని మోదీ తెలిపారు.

01/18/2016 - 06:44

రాజమహేంద్రవరం, జనవరి 17: గోదావరి పుష్కరాల ప్రారంభం రోజు జూలై 14న రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 29మంది మృతి చెందిన సంఘటనపై సోమవారం నుండి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఏకసభ్య కమిషన్ న్యాయ విచారణ ప్రా రంభం కానుంది. తొక్కిసలాటలో అక్కడికక్కడే 27మంది మృతి చెందగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందిన సంగతి విదితమే.

01/18/2016 - 06:41

చౌటుప్పల్, జనవరి 17: సంక్రాంతి పండగ ముగిసింది. పల్లెలకు వెళ్లిన హైదరాబాద్ వాసులు తిరుగుముఖం పట్టడంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి కిక్కిరిసిపోయిం ది. ఇసుకేస్తే రాలనంతగా రహదారిని వాహనాలు పూర్తిగా ఆక్రమించడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లతో ప్రయాణికులు అవస్థ పడ్డారు. టోల్‌గేట్ల వద్ద పరిస్థితి సరేసరి.

01/18/2016 - 06:39

వాషింగ్టన్, జనవరి 17: అంతరిక్షంలో మొట్టమొదటిసారిగా ఒక పువ్వును విజయవంతంగా పూయించి అమెరికా వ్యోమగామి స్కాట్ కెల్లీ చరిత్ర సృష్టించాడు. అమెరికా దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే ఆరంజ్ జినియా పువ్వును కెల్లీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో విజయవంతంగా పెంచడమే కాదు, పూర్తిస్థాయిలో వికసించేలా చేసాడు.

Pages