S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/18/2016 - 08:11

పూర్వం భృగు వంశములో జన్మించిన చ్యవన మహర్షి గొప్ప నియమంతో గర్వం, క్రోధం, హర్షం, శోకం పరిత్యజించి పనె్నండేళ్ళపాటు నీటిలో ఉండిపోయాడు. కర్రలాగ, నీటిపై తేలి ఉండే అతనివద్దకు తెలియక వచ్చిన బెస్తవారు విసిరిన పెద్ద వలలో చ్యవన మహర్షి చిక్కుకొన్నాడు. మహర్షిని గమనించిన ఆ మత్స్యకారులు భయపడుతూ తమ అపరాధాన్ని మన్నించమని అడిగారు. చ్యవనుడు ‘ఈ చేపలు నా సహజీవనమయ్యాయి.

01/18/2016 - 08:06

వనస్థలిపురం, జనవరి 17: ఎల్బీనగర్ నియోజకవర్గంలో టిడిపి, బిజెపి అభ్యర్థులు విజయం సాధించి తమ సత్తాను చాటడం ఖాయమని మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం నాడు మన్సురాబాద్ డివిజన్ టిడిపి అభ్యర్థి కొప్పుల నర్సింహ్మారెడ్డిని గెలిపించాలని డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ప్రచారం నిర్వహించారు.

01/18/2016 - 08:05

రాజేంద్రనగర్, జనవరి 17: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఉదయం నుంచే చిన్నారులకు పోలియో చుక్కలను వేయించేందుకు చిన్నారుల తల్లిదండ్రులు ఆయా కేంద్రాల వద్ద బారులు తీరారు. సర్కిల్ పరిధిలోని రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్‌దేవ్‌పల్లి, శాస్ర్తిపురం, సులేమాన్‌నగర్ డివిజన్లలోని పలు బస్తీల్లో పోలియో చుక్కల పంపిణీ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

01/18/2016 - 07:57

మెల్బోర్న్, జనవరి 17: టీమిండియాతో జరుగుతున్న ఐదు వనే్డల అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా ‘హ్యాట్రిక్’ విజయాలతో సత్తా చాటుకుంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసిజి)లో ఆదివారం జరిగిన మూడో వనే్డలో ఆ జట్టు 3 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించి వరుసగా మూడో విజయాన్ని నమోదు చేయడంతో పాటు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

01/18/2016 - 07:51

న్యూఢిల్లీ, జనవరి 17: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయంగా చోటుచేసుకునే పరిణామాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

01/18/2016 - 07:34

నేడు ఇంగ్లీషు మీడియం స్కూళ్లు చాలా ఉన్నాయి. అయితే వాటిల్లో పిల్లల్ని చేర్పించాలంటే చాలా కష్టం. చేతినిండా డబ్బులుండాలి. ఫీజులు, డొనేషన్లు, యూనిఫార్మ్‌లు, అవీ ఇవీ అంటూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. కొందరు తల్లిదండ్రులు పేదవారైనా అప్పులు చేసి మరీ ఈ బడుల్లో చేర్చి తమ ఇంటిని గుల్ల చేసుకుంటున్నారు. ప్రభుత్వాల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. వారు ఇంగ్లీషు మీడియం స్కూళ్లు తెరవడం లేదు.

01/18/2016 - 07:31

బతుకు భారమై పొట్ట చేత పట్టుకొని ఒడిషా నుండి తెలంగాణకు తరలి వస్తున్న కార్మికుల దైనందిన జీవితం దుర్భరంగా ఉంది. ఒడిషా కార్మికులపై ఇటుక బట్టీ యజమానుల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయ. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే ఇటుక బట్టీల్లో దాదాపు 11వేల మంది ఒడిషా వలస కార్మికులు పనిచేస్తున్నారు. అక్కడ వీరికి కనీస వసతులు లేవు. పలువురు పనిభారం ఎక్కువై అనారోగ్యం బారిన పడుతున్నారు.

01/18/2016 - 07:29

సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి గవర్నరు స్థాయికి ఎదిగినా నిరాడంబరతకు నిదర్శనంగా అంకిత భావానికి నమూనాగా నిల్చిన కర్మశీలి, జాతీయ ఉద్యమాన్ని ఆజీవన వ్రతంగా కొనసాగించి వెంట్రప్రగడ రామారావు తరతరాలకు ఆదర్శమూర్తి. జాతీయ ఉద్యమకారులకు స్ఫూర్తి.

01/18/2016 - 07:26

తెలుగు తల్లి, తెలంగాణ తల్లి ఒకరినొకరు చూసుకుని చిరునవ్వులు నవ్వ టం ఎట్టకేలకు మొదలైనట్లేనా? ఇరు రాష్ట్రాల ప్రజలకు కూడా వారిద్దరి ఉమ్మడి దీవెనలు లభించనున్నట్లేనా? అది జరగాలే గాని మొత్తం తెలుగు ప్రజలంతా సంతోషిస్తారంటే విభేదించేవారు బహుశా ఎవరూ ఉండకపోవచ్చు. ఈ రెండు గడ్డల నుంచి మొదలుకొని దేశ విదేశాల్లోని తెలుగువారందరికీ అది ఆనందించదగ్గ పరిణామమే అవుతుంది.

01/18/2016 - 07:23

పౌష్టికాహార లోపం వల్ల ఎదురౌతున్న సమస్యలు సామాజిక హిత నిష్ఠ కలవారికి ఆందోళన కలిగించడం సహజం! ప్రత్యేకించి బాల బాలికలకు శిశువులకు పౌష్టికాహారం లభించకపోవడం ప్రధాన సమస్య! అందువల్ల శిశు సంరక్షణ సమాచారాన్ని సేకరించి ప్రచారం చేయాలన్న కేంద్ర ప్రభుత్వం వారి ఆకాంక్ష అభినందనీయం. అయితే చిన్న పిల్లల ఆరోగ్యానికి హానికరమైన పోషకాహార విధానాన్ని అనుసరించాలని కేంద్రం నిర్ణయించడం సమాంతర విపరిణామం.

Pages