కడప

జన్మభూమి ప్రతిష్టాత్మకంగా చేపట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 26: జనవరి 2వ తేదీ నుంచి చేపడుతున్న జన్మభూమి కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జలవనరులను పెంపొందించేందుకు రైతుల్లో అవగాహన తీసుకుని వచ్చి ప్రతి రైతు విధిగా తమ పొలాల్లో పారంఫాండు, కోనేటి గుంతలు ఏర్పాటుకు అధిక ప్రాముఖ్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శనివారం ఆయన విజయవాడ నుంచి కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో ఏర్పాటుచేసిన వీడియోకాన్ఫరెన్స్‌లో అనేక అంశాలను ప్రస్తావించారు. మండల వారీగా, నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జ్ అధికారులతోపాటు అన్ని శాఖల అధికారులు విధిగా పాల్గొని జన్మభూమి ద్వారా ఓ పక్క ప్రజాసమస్యలు పరిష్కరిస్తూ మరోపక్క ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయోలేదోనని పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే వర్షాకాలంలో వచ్చే ప్రతి నీటి బొట్టు బయటకు పోకుండా పొదుపుచేసేందుకు పల్లపు ప్రాంతాల్లో గోతులు తవ్వి ఆ నీరును చెక్‌డ్యామ్‌లు, వంకలు, వాగులు ద్వారా చెరువులకు చేర్చాలని , చెరువుల నీటిని ప్రాజెక్టులకు తరలించాలని ఎక్కడి నీరు అక్కడే ఆ ప్రాంతీయులే వినియోగించుకుని భూగర్భజలాలు పెరిగే వరకు రైతులను భాగస్వామ్యం చేసి కరువును ప్రారదోలాలని ఆయన సూచించారు. అలాగే రైతులు సాగుచేసుకుంటున్న పంటలపై మెళుకువలు, అధికదిగుబడిపై అధికారులు రైతుల్లో చైతన్యం తెచ్చి ఆహారంలో కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే రేషన్‌కార్డులు, పెన్షన్లు , ఇళ్లస్థలాలు,గృహనిర్మాణాలు ఉపాధి నిమిత్తం ఇచ్చే ప్రజల దరఖాస్తులు స్వీకరించి ఎప్పటికప్పుడు వాటిని ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా స్వచ్చ్భారత్ ,నవ్యాంధ్ర నిమిత్తం ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి ఒక్కరికీ పరిశుభ్రత ఆరోగ్యంపై సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. ఇటీవలే గ్రామాలను, మున్సిపాల్టీలను, డివిజన్లను పలువురు దాతలు దత్తత తీసుకున్న వాటిపై అధికారులు దృష్టిపెట్టి ఆ గ్రామాభివృద్ధికి ప్రజలను భాగస్వామ్యులు చేయాలని ప్రతి ఒక్కటీ ప్రభుత్వంపై ఆధారపడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ కలెక్టర్ శే్వత టియోటియ, చీఫ్ ప్లానింగ్ అధికారి తిప్పేస్వామి, డిఆర్‌డిఏ, డ్వామా, హౌసింగ్, మెప్మా పిడిలు అనిల్‌కుమార్‌రెడ్డి, బాలసుబ్రమణ్యం, సాయినాథ్, వెంకటసుబ్బయ్య, డిఆర్వో సులోచన, డిఎంహెచ్‌ఓ డాక్టర్ సూర్యనారాయణరాజు, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.

పదవికి వనె్న తెస్తా..

ప్రొద్దుటూరు, డిసెంబర్ 26: ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై నమ్మకంతో అప్పగించిన రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ పదవికే వనె్న తెస్తానని, పేదలకు సేవ చేసే విషయంలో రాజీ పడనని, ప్రతి నిరుపేదకు నిత్యావసర సరుకులు అందేలా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన శనివారం తొలిసారిగా ప్రొద్దుటూరుకు విచ్చేశారు. ఈ సందర్భంగా మైదుకూరు రోడ్డులోని సినీహబ్ థియేటర్ల వద్ద నుంచి పాత బస్టాండులోని పిఎన్‌ఆర్ కాంప్లెక్స్ వరకు కార్యకర్తలు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అడుగడుగునా లింగారెడ్డికి కార్యకర్తలు పూలతో స్వాగతం పలికారు. చెక్క్భజనలు, డప్పు వాయిద్యాలు, బాణాసంచాల నడుమ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. లింగారెడ్డి అభిమానులు, టిడిపి కార్యకర్తలు, నాయకులు ర్యాలీలో స్వయంగా చిందులేస్తూ తమ సంతోషాన్ని ప్రకటించారు. పుట్టపర్తి సర్కిల్‌లో లింగారెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు తమ రక్తాన్ని, ఆస్తులను ధారపోసి పార్టీ కోసం కృషి చేసి మూడవసారి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేశారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అని, పేద, బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారాల్లో వాటా ఇచ్చిన పార్టీ ఒక్క తెలుగుదేశమేనని ఆయన స్పష్టం చేశారు. వేలాదిమంది కార్యకర్తలు ర్యాలీలో పాల్గొనగా నాయకులు ర్యాలీ యావత్తు ఉత్సాహంగా చిందులేస్తూ కనిపించారు.
ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అర్బన్ సి ఐ సత్యనారాయణ నేతృత్వంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అహోబిళంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రొద్దుటూరు చేరుకున్న లింగారెడ్డి బైపాస్‌రోడ్డులోని ఎన్‌టి ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల బైపాస్‌రోడ్డులోని దండపాణి సంస్థల అధినేత కె.శ్రీనివాసకుమార్, సినీహబ్ అధినేత రాజేశ్వర్‌రెడ్డి నివాసాలకు వెళ్లారు. అనంతరం సినీహబ్ నుంచి భారీ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి సి ఎం.సురేష్‌నాయుడు, చెమికల పురుషోత్తమరెడ్డి, రాజుపాళెం
మండల నాయకులు రామచంద్రారెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు కుసుమకుమారి, లింగారెడ్డి సతీమణి శ్రీమతి లక్ష్మీప్రసన్న, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ కామిశెట్టి సుబ్రహ్మణ్యం, టిడిపి నాయకులు గాండ్ల నారాయణస్వామి, ఘంటశాల వెంకటేశ్వర్లు, పిట్టా శ్రీను, పిట్టా భధ్రమ్మ, రాజుపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, నందిపైపు భాస్కర్‌రెడ్డి, అన్నవరం సుధాకర్‌రెడ్డి, మాజీ మార్కెట్‌యార్డు ఛైర్మెన్లు బండి భాస్కర్‌రెడ్డి, నాగులపల్లె చంద్ర, చాపాడు మాజీ ఎంపిపి లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పసుపుమయమైన ప్రొద్దుటూరు...
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా బాధ్యత చేపట్టి తొలిసారిగా ప్రొద్దుటూరుకు వస్తున్న సందర్భంగా ప్రొద్దుటూరులోని అన్ని కూడళ్లు, ప్రధాన వీధుల్లో తెలుగుదేశం పార్టీ జెండాలు, తోరణాలు రెపరెపలాడాయి. అడుగడుగునా టిడిపి జెండాలు, ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఎన్నికల వాతావరణాన్ని తలపించే రీతిలో కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. శివాలయం సర్కిల్‌లో లింగారెడ్డికి స్వాగతం పలికేందుకు సాధారణ ప్రజలు కూడా వేచివుండడం కనిపించింది.