కడప

వలంటీర్ పోస్టులకు దరఖాస్తుల వెల్లువ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ): రాష్ట్రం లో రోజురోజుకూ నిరుద్యోగుల సం ఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో అప్పుడప్పుడూ వస్తున్న ప్రభుత్వ కొలువుల కోసం పోటీ తీవ్రమైంది. రాష్ట్రంలో కొ త్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్ర భుత్వ కొలువులకు పచ్చజెండా ఊపటంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వలంటీర్లను నియమించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి జిల్లా వ్యా ప్తంగా 14వేల కొలువులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజాసేవ చేసుకునేందుకు ఒక్క అవకాశం కల్పించాలని కోరుతూ రాష్టవ్య్రాప్తంగా నిరుద్యోగులు పోటీపడుతూ వలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. కొ లువు కోసం పాటు పడుతున్న నిరుద్యోగ యువత, మహిళల నుండి దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. తుది గడువు జూలై 5 సమీపిస్తుండటంతో ర ద్దీ పెరిగింది. వలంటీర్ల నియామకంలో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కేటాయించడంతో పెద్దసంఖ్యలో పోటీ పడుతున్నారు. జూన్ 24 నుండి వలంటీర్ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల స్వీకార ప్రక్రియ ఆన్‌లైన్‌లో ప్రా రంభమైంది. దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగులు పెద్దఎత్తున నెట్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలకు క్యూలు కడుతున్నారు. 2019 జూలై 5 నాటి గ ణాంకాల ఆధారంగా ప్రతీ 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను ప్రభుత్వం నియమించనుంది. జిల్లావ్యాప్తంగా 14 వేల మంది వలంటీర్లను ప్రభుత్వం ని యమించి వారిద్వారా ప్రభుత్వ సంక్షే మ పథకాలను డోర్ డెలివరీ చేయనుంది. వలంటీర్ పోస్టులకు సంబంధించి ఇప్పటివరకు 29,355 దరఖాస్తు లు రాగా వాటిలో 11858 దరఖాస్తుల ను పరిశీలించారు. వివిధ కారణాలతో 1088 దరఖాస్తులను తిరస్కరించగా, 10,770 ఆమోదించారు.
ఆన్‌లైన్ సమస్యలు
అందరూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తుండటంతో ఒక్కసారిగా సర్వర్లపై భారం పడింది. దీంతో తరచూ అన్‌లైన్ సమస్యలు ఉత్పన్నవౌతున్నాయి. వలంటీర్ పోస్టుకు సంబంధించి గ్రామీ ణ ప్రాంతాల్లో అభ్యర్థులకు ఇంటర్, గి రిజన ప్రాంతాల్లో వారికి పదో తరగతి, పట్టణాల్లోని వారికి డిగ్రీని అర్హతగా నిర్ణయించారు. దరఖాస్తు సమయంలోనే వారు విద్యర్హతను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈసందర్భంలో యువతు లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యువతుల్లో చాలామందికి వివాహాలు జరిగి వారి ఇంటిపేర్లు మారిపోయా యి. విద్యార్హత పత్రాల్లో ఒక పేరు, పెళ్లి తరువాత ఆధార్, రేషన్ కార్డుల్లో ఒక ఇంటిపేరు నమోదై ఉండటంతో ఇప్పు డు వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికిప్పుడు ఆధార్‌లో మా ర్పులు చేయాలంటే మీసేవలో దరఖా స్తు చేసిన తరువాత 15రోజులు పడుతుందని, అప్పటికి దరఖాస్తు గడువు మించిపోతుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏంచేయాలో తెలియక తలలు పట్టుకుంటున్న వారికి ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. దరఖాస్తు సమయంలో ఫోన్‌కు ఓటీపీ రావడం కూడా అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. ఆధార్ నమోదు సమయంలో ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వెళ్తుంటే, ఎంతోమంది నెంబర్లు మార్చడంతో వారికి ఇది పెద్ద సమస్యగా మారింది. మరికొందరు ఆధార్‌కు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోకపోవడంతో దరఖాస్తు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో దరఖాస్తు నమోదుకు సుమారు 45 నిముషాలు సమయం పడుతుండటం, లక్షల మంది ఒకేసారి నమోదు చేసుకోవడం లేదా, పరిశీలిస్తుండటంతో సర్వర్‌లో సమస్యలు తలెత్తుతున్నాయి. గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. నెట్ సెంటర్ల నిర్వాహకులు సేవా రుసుములు కూడా భారీగానే వసూలు చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థులు పోస్టు దక్కించుకునేందుకు పైరవీలు ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవ చేసే అవకాశం సొంత ఊరు, వాడలో లభిస్తుండటంతో నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రధానంగా దరఖాస్తు తరువాత ఇంటర్వ్యూ ప్రాతిపదికన ఎంపిక జరుగుతుండటంతో పైరవీలు జోరందుకున్నాయి. ఎన్నికల్లో వైసీపీ విజయానికి ఎంతో కృషి చేసినందున తమకే ఉద్యోగం వస్తుందనే ధీమా కొందరిలో కనిపిస్తోంది.