పర్యాటకం

దురాలోచనలు దూరం చేసే దుద్దెడ లింగేశ్వరస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మ విష్ణువుల మధ్య ఏర్పడ్డస్పర్థ ను దూరం చేయడానికి నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు అయిన పరమేశ్వరుడు లింగరూపం ధరించాడు. అగ్నితేజస్సుతో ప్రజర్విల్లే ఈ లింగం యొక్క ఆది అంతాలను కనుగొనడంలో అబద్ధమాడిన పంచముఖ బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు. అజ్ఞానాన్ని , అహంకారాన్ని తొలగించుకుని సర్వమూ నీవే నని నమ్మిన మహావిష్ణువు సర్వలోకారాధ్యుడయ్యాడు.
ఆ పరమేశ్వరుడే నేడు హైదరాబాదు , సిద్దిపేట మార్గంలో దుద్దెడ అన్న గ్రామంలో స్వయంభూలింగేశ్వరునిగా ఆవిర్భవించాడు.
దైవం నిరాకారమైనా భక్తుల కోరిక మేరకు ఆకారాన్ని ధరించడం పరమాత్ముని లీలావిలాసమే. ఒకసారి ఈదుద్దెడ గ్రామ ప్రజలు అనారోగ్యాలకు బలియ్యారు. ఊరు ఊరంతా సదా రోగాల బారిన పడి ఈశ్వరా అని నిత్యం తలవాల్సిన వీరు ఈసురోమని ఉండిపోయేవారు.
ఆ ఊరిపెద్దలంతా కలసి పరమేశ్వరుడే దిక్కని ఆ పరమేశ్వరుని కృపతోనే ఆరోగ్యం చేకూరుతుందని గట్టిగా నమ్మి భగవంతుడికి పూజలు చేశారు. నివేదనలు అర్పించారు. అట్లా తన్నువేడే భక్తుల కోసం పరమేశ్వరుడుగా లింగేశ్వరునిగా ఆవిర్భవించి వారందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని, పూర్ణాయుష్షును ప్రసాదించాడు. ఆనాటినుంచి ఎవరైనా సరే ఈ దుద్దెడ లింగేశ్వరుని దర్శించి మొక్కుకుంటే ఎంతటి మొండిజబ్బైనా దూరం అవుతుందని ఇక్కడి స్థానికులుచెప్తారు.
ఈ ఆలయం అతి ప్రాచీనకాలం నాటిదని ఇక్కడి శాసనాధారాలవల్ల తెలుస్తుంది. కాకతీయులు, చాళుక్యనాటి శిల్ప సంపద ను బట్టి ఈ ఆలయం సుమారు 10శతాబ్దికి చెందినట్లు చెప్తారు. ఈ గుడి గోపురం మట్టితో కట్టారు.
పార్వతీ పరమేశ్వరులు ఈ జగతికి తల్లిదండ్రులు. ఇక్కడి స్వయంభూ లింగేశ్వరునితో పాటుగా భవానీదేవి దర్శనం ఇస్తుంది. ఈ అమ్మవారు చతుర్భుజ. దక్షిణాభిముఖంతో ఉండడం ఈ అమ్మవారి ప్రత్యేకతగా చెప్తారు. మంచితో పాటుగా చెడు ఉండడం ఈ యుగధర్మం. అయినా దుష్టశిక్షణ శిష్టరక్షణ భగవంతుని కార్యం కనుక ఈ అమ్మవారు దక్షిణాభిముఖియై దుష్టశక్తులను అదుపు చేస్తుందని ఇక్కడి వారు చెప్తారు.
ఈ ఆలయంలో స్వయంభూలింగేశ్వరుడు, భవానీ మాతలతోపాటుగా ఉపాలయంలో భద్రకాళీ సమేత శ్రీవీరభద్రస్వామి, సంతాన ప్రదాతగా నాగేంద్రుడు కొలువై ఉన్నారు.
ఈ ఆలయంలోనే జైనుల ఆరాధ్యదైవం అయిన పార్శ్వనాథుని విగ్రహం కూడా దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న కోనేరు కూడా మంచి ప్రసిద్ధి చెంది ఉంది. ఈకోనేరులో మూడు సొరంగమార్గాలున్నాయని వాటిల్లో ఒకటి దేవాలయంలోకి, మరొకటి కాశీకి మార్గంగా ఉన్నాయని అంటారు. ఇక్కడి స్థానికులకు మూడో సొరంగమార్గం వుంది కాని దానివివరాలు తెలయవని చెప్తారు.
ఈ తెలంగాణా జిల్లాలోని ఈస్వయంభూ లింగేశ్వరాలయం గూర్చి అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉందని అంటారు. పుష్యబహుల దశిమినుంచి జాతర్లు జరుగుతాయి. స్వామి అమ్మవార్లకు జరిగే రథోత్సవం వర్ణించడానికి చర్మచక్షువులు చాలవంటారు. శరన్నవరాత్రులు, శ్రావణమాసం, మహాశివరాత్రి నాడు విశేషఅర్చనలుపూజాదికాలు జరుపుతారు. ఈ స్వయంభూలింగేశ్వర స్వామిని అర్చించడానికి రాత్రవేళ ఋషులు, దేవతలు వస్తారని అంటారు. రాత్రివేళ మువ్వల శబ్దాలుకూడా వినవస్తుంటాయని ఇక్కడ నివసించే పెద్దలు చెప్తారు. ఈ స్వయంభూ లింగేశ్వరుని దర్శించినవారికి రోగాలు దూరం కావడమే కాక లోభాది దుర్గుణాలు కూడా దూరం అవుతాయని ఇక్కడి వారు చెబుతారు.
పూర్వకాలంలో దుష్టబుద్ధి అనే ఒకరాజు ఇక్కడ ఉండే స్ర్తిలను చెరబట్టాలన్న కోరికతో ఈ గ్రామానికి వచ్చాడట. అనుకొన్నకార్యం అనుకొన్నట్టుగా జరగడానికి ఆ రాజు మారువేషంతో ఈ ఆలయంలో రాత్రి నిద్రించాడట. ఆయన కలలో భవాని మాత కనిపించి తనలో ఉన్న దురాలోచనను దునుమాడిందట. తెల్లారి లేచేసరికి స్ర్తిలను చెరబట్టాలనే కోరిక లేకపోగా ఈ భవానీ మాతను విశేషంగా అర్చించాడట. ఇక అప్పటి నుంచి ఆ రాజు తన పేరును సుబుద్ధిగా మార్చుకున్నాడట. స్ర్తిలందరినీ భవానీ రూపులుగా ఎంచి వారికి గౌరవం ఇచ్చేవాడట. అందుకే ఇప్పటికీ కూడా ఈదుద్దెడ గ్రామానికి వచ్చి ఈ స్వయంభూలింగేశ్వర స్వామిని భవాని మాతను దర్శించినవారికి దుష్ట ఆలోచనలు కలుగవని ఇక్కడి వారు చెప్తారు.

- జి. కల్యాణి