Others

యాజ్ఞసేని-33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ విల్లును ఎక్కుబెట్టి లాగటం ఒక బలహీనుడికి సాధ్యవౌతుందా? అస్తవ్రిద్య నేర్వనివాడికీ, కులహీనుడికీ, ఆ లక్ష్యాన్ని సులభంగా ఛేదించం సాధ్యమయ్యేపనేనా? మీ రాజు కోరిక సఫలమయింది. విచారించడం ఎందుకు?’’ అని ధర్మరాజు సమాధానమిచ్చాడు.
ధర్మరాజు మాటలను విన్న పురోహితుడు శెలవుగైకొని వెనుదిరిగి ద్రుపద మహారాజు వద్దకు వచ్చాడు. రాజును చూచి జరిగిన విషయాన్ని విన్నవించాడు.
అంత ద్రుపదుడు దృష్టద్యుమ్నుని చూచి ‘‘రథాలను తీసుకొని వెళ్లి వారిని వెంటనే ఇక్కడికి తోడ్కొని రమ్ము’’ అని ఆజ్ఞాపించాడు.
దృష్టద్యుమ్నుడు రాజు చెప్పినట్లుగానే పాండవులను దర్శించాడు.
ధర్మరాజును చూచి ‘‘మా తండ్రి ఆజ్ఞ ప్రకారం మిమ్ములను కొనిపోవ వచ్చాను. ఈ రథాలెక్కి రాజభవనానికి రండి’’ అని ప్రార్థించాడు.
ఒక రథంలో కుంతీదేవినీ ద్రౌపదినీ, తక్కిన రథాలలో పాండవులను ఎక్కించి రాజప్రాకారంలోనికి ప్రవేశించాడు దృష్టద్యుమ్నుడు.
రాజాంతఃపురంలో ప్రవేశించిన పాండవులను క్షత్రియులకు తగిన ఉన్నతాసనాలపై ఆసీనులను గావించి ద్రుపదుడు ధర్మరాజుతో-
‘‘అయ్యా! మీరు క్షత్రియులా? బ్రాహ్మణులా? లేక నా పుత్రిక ద్రౌపదిని చేబట్ట దేవలోకం నుండి దిగి వచ్చిన దేవతలా? దయతో తెలియజేసి నా సందేహాన్ని తీర్చండి. మీ నిజ స్థితి తెలిసికొనిగానీ నా ఈ కన్యకు వివాహం చేయలేను’’ అన్నాడు.
‘‘మేము క్షత్రియులం. పాండురాజు పుత్రులం. నేను పెద్దవాడనైన ‘యుధిష్ఠిరుడను’. లోకం కొనియాడే భీమార్జున నకుల సహదేవులు ఈ నలుగురు. ఎక్కడైనా శత్రువులను జయింపగలిగినవారు. ఈమె మా మాతృమూర్తి అయిన ‘కుంతీదేవి’ అని అన్నాడు ధర్మరాజు ద్రుపదుని సందేహాన్ని నివృత్తిగావిస్తూ.
‘‘నా పుణ్యంవలన మీరు లాక్ష గృహ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. నా కోరిక ఈనాటికి నెరవేరింది’’ అని ఆనంద బాష్పాలతో నిండిన కళ్ళను తుడుచుకుంటూ ‘‘విచిత్రవీర్యుని మనుమడూ, ధనుర్విద్యలో శ్రేష్ఠుడూ అయిన ఈ అర్జునుడు నా కుమార్తెకు భర్త అయ్యాడు. నా చిరకాల వాంఛ ఫలించింది. నేటికి యజ్ఞ్ఫలం కూడా లభించింది. అర్జునుడు ధర్మపద్ధతిలో ద్రౌపదిని వివాహం చేసుకుంటాడు’’ అని అన్నాడు ద్రుపద మహారాజు.
అందుకు స్పందించిన ధర్మరాజు ‘‘ఈ కన్యను మేమందరం వరుసగా వివాహం చేసుకొంటాము. ఇదే మా తల్లి ఆజ్ఞ. మేము మా తల్లి ఆజ్ఞను దాటలేము’’ అని అన్నాడు.
‘‘ఒక్క మగవాడికి పెక్కుమంది భార్యలు వుండవచ్చును. కానీ పెక్కుమంది మగవాళ్ళకు ఒక్క భార్య కావటం ఎక్కడా విని ఎరుగను. నీవు లోక సంబంధమైన, వేద సంబంధమైన స్వరూపం తెలిసినవాడవు. నీ మాట ధర్మవిరుద్ధమనలేము. కాని దీని గురించి మనమంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వద్దాము’’ అని అన్నాడు ద్రుపదుడు.
‘‘మహారాజా! మా నియమాన్ని భంగపరచటానికి మేము ఇష్టపడము. కావున మాకందరికినీ ద్రౌపది ధర్మబద్ధంగానే పట్టమహిషి అవుతుంది. అగ్నిసాక్షిగా ఆమె మా అందరితో పాణిగ్రహణం చేస్తుంది’’ అని తమ నిర్ణయాన్ని మరొకమారు తెలియపరచాడు ధర్మరాజు.
‘‘యుధిష్ఠిరా! నీవు ధర్మవేత్తవు. పదవిత్రుడవు. లోకవేద విరుద్ధమైన అధర్మాన్ని అంగీకరింపవు. నీ బుద్ధి ఈ విధంగా ఎందుకు మారుచున్నది?’’ అని అడిగాడు ద్రుపదుడు.
‘‘రాజా! ధర్మం మిక్కిలి సూక్ష్మమైనది. దాని మార్గాన్ని మనమెరుగలేము. పూర్వీకుల మార్గానే్న ఈ విషయంలో అనుసరిద్దాం. నా మాట ఎప్పుడూ పొల్లుబోదు. అధర్మంపై నా బుద్ధి ఎప్పుడూ నిలువదు. ఇంక ఆలోచించక అనుసరించుము’’ అని అన్నాడు ధర్మరాజు.
నీవూ, కుంతీదేవి, దృష్టద్యుమ్నుడు కలిసి ఆలోచించి కర్తవ్యాన్ని నిర్ణయించండి. ధర్మరాజా! రేపు సరైన సమయంలో దీని గురించి ఆలోచిద్దాము’’ అని ద్రుపదుడు నిష్క్రమించాడు.
ఆటు పాండవులూ, ఇటు ద్రౌపదీ దృష్టదుమ్యులూ ఈ సంక్లిష్ట సమస్యను గురించి ఆలోచించసాగారు.
ద్రౌపది మనస్సు మరలా పరి పరి విధాలా ఆలోచించసాగింది. మత్స్యయంత్రాన్ని ఒక బ్రాహ్మణుడు పడగొట్టాడు. అతడి మెడలో దండవేశాను. కుమ్మరి యింట్లో ప్రవేశించాను. అక్కడ అయిదుగురను చూచాను. వాసుదేవుడు వచ్చాడు. పాండవులను అభినందించాడు. అప్పుడు తెలిసింది వీరు పాండవులేనని. మత్స్యయంత్రాన్ని ఛేదించినవాడు అర్జునుడని. మనసులో ఆనందించాను మా తండ్రి కోరిక నెరవేరిందని. నేను ఇన్నినాళ్ళు కోరుకున్నది కూడా అదే. ఇప్పుడు ఒక క్రొత్త సమస్య వచ్చింది. నన్నందరూ వివాహం చేసుకుంటారట. ఇది ధర్మబద్ధమేనట. ఇదెక్కడి ధర్మం? ఒక స్ర్తికి ఇంతమంది భర్తలా? దీనికి పరిష్కారమేమిటి? విధాత కల్పించే విచిత్ర ఘటనలు అర్థం చేసుకొనటం అంత సులభం కాదు. దీనిని ఆ కృష్ణవాసుదేవుడు పరిష్కరించాలి.

- ఇంకా వుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము