Others

సద్వినియోగానికి దారిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

3‘‘ఓరుూ మానవుడా! బలవంతునివి కమ్ము.’’ , 3‘‘ఓ మానవులారా! మీ పాదాలపై మీరు నిలబడి స్వతంత్రులు కండు2’’ అని మన వేదాలు, ఉపనిషత్తులు పలుకుతున్నాయి. ప్రతి మనిషిలోను బలం, బలహీనత రెండూ ఉంటాయి. కానీ బలహీనత వల్ల దుర్బలుగా ఉండడం తగదని మన ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తున్నాయి. ఈసురోమని మనుషులుంటే దేశమేగతిన బాగుపడునోయ్ అన్న సంఘ సంస్కర్త గురజాడ వారి మాటను కూడా ఒక్కసారి ఈ గడ్డుసమయంలో గుర్తుకు తెచ్చుకుందాం. మన దేశానే్న కాదు మొత్తం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న వ్యాధులు మనలను నేడు అతలాకుతులం చేస్తున్నాయి. కానీ మనిషిలోని చైతన్యం, బలం ఇవన్నీ తిరిగి మనిషి స్వస్థత చేకూర్చుకోమని చెబుతున్నాయి.
ఎందుకిలా చెబుతున్నాయ అంటే మనిషి లోని మంచి ఆలోచనలు మునిగిపోతున్న మనిషిని నిలబెట్టగలవు. మనిషి మనసుకు అంత శక్తి ఉంది. అట్లాంటి మనసును గట్టిచేసుకొని సుహృద్భావ ఆలోచనలను ఆహ్వానించమని మన ఉపనిషత్తులు చెబుతున్నాయి. మనిషిని మనిషిలోని నిగూఢమైన శక్తిని వెలికి తెచ్చుకుని ఆ శక్తితో నీవే కాదు నీ పక్కన నున్నవారిని కూడా నిలబెట్టగలవు అనేది మన ఉపనిషత్తు.
ఉపనిషత్తులలో స్పష్టంగా ఋజువు చేయబడిన ఋజువు గాగల పారమార్థిక పరిజ్ఞాన సముదాయం ఉంది. లోకాసమస్తాసుఖినోభవన్తు అంటుంది మన వేదం. కేవలం ఏ ఒక్కరో బాగుండడం కాదు సర్వజనులు సుఖంగా ఉండాలి. దానికి మార్గాలను ఈ ఉపనిషత్తులు చూపుతున్నాయి. ఉపనిషత్తులల్లోని పారమార్థిక జ్ఞానం కాలగతి దౌర్జన్యానికి బలి కాలేదు. కాలంతోపాటు వచ్చే మార్పులను కూడగట్టుకుంటూ సాధించబడిన వైజ్ఞానిక ప్రగతి ఉపనిషత్తుల రూఢిని, విలువలకు మరింత బలాన్ని చేకూర్చింది. సహేతుక దృష్టిని అలవర్చుకునేటట్టు చేసింది. ఎందుకంటే ఈ ఉపనిషత్తుల్లోని జ్ఞానం కూడా ఒకరకమైన పరిశోధనల ఫలితమే. మనకు దాదాపుగా 108 ఉపనిషత్తులున్నాయ. వాటిలో ప్రధాన మైనవి 12 ఉపనిషత్తులు వాటిల్లో దేనికదే గొప్ప జ్ఞానానిని అందిస్తాయ. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, తైత్తరీయ, ఐతరేయ, చాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులను ఒకసారి పరిశీలిస్తే మనకు నిత్యం తారసపడే విషయాలనే మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది అని చెబుతున్నాయి అనిపిస్తుంది.
ఏనాటికైనా సత్యం నిలుస్తుంది. అసత్యం మరుగైపోతుంది. సత్యానికున్న బలం అందరికీ తెలిసింది. కాలం మారినా సత్యం మాత్రం మారదు. అందుకే ఛాందోగ్యఉపనిషత్తు మనకు సత్యం విలువలను తెలిపే సత్యకాముడు, శే్వతకేతు, నారదాది ముగ్ధ మోహన స్వభావులైన సత్యానే్వషకులను, అరుణి , సనత్తుమారుడు, ప్రజాపతి వంటి ప్రఖ్యాత గురువరేణ్యుల జీవితాలను మనకు చూపెడుతుంది.
సత్యం ఒక్కటే అయినా పలువురు పండితుల వలన బహుముఖాల్లో కనిపించినట్లుగానే ఉన్నది ఒక్కటే ఆత్మ అయినా వేర్వేరు మనుషులను, మనసత్త్వాలను చూపెడుతుంది. ఏ ఒక్కరి మనస్తత్వాన్ని కచ్చితంగా చెప్పలేం కానీ మనుషులందరూ వేర్వేరుగా కనిపించినా అందరిలో ఉన్నది ఒక్కటే ఆత్మ. ఆత్మ ఒక్కటే నిత్యమైనది. సత్యమైనది. ఆ ఆత్మ గురించి తెలుసుకోవాలంటుంది ఉపనిషత్తు. రమణ మహర్షి వంటి మహానుభావులు నీవు ఎవరో తెలసుకో అంటారు. నిన్ను నీవు తెలుసుకుంటే అంతా తెలుస్తుంది అంటారు. ఇందులోని మర్మాన్ని విపులంగా ‘బహ్మవిదవాప్నోతి పరం’ బ్రహ్మం నెరిగిన వాడు పరతత్త్వాన్ని తెలుసుకుంటాడు అని చెప్పేది తైత్తరీయ ఉపనిషత్తు.
సమయం మించిపోతే దొరకదు. ఏ అరక్షణం కూడా చేతి నుంచి జారిపోతే మళ్లీ దొరకదు. కనుక ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఇట్లాంటి ఉపనిషత్తులను ఒక్కసారి మననం చేసుకోవాలి. ఈ ఉపనిషత్తులు మనకు మంచి భవిషత్తుకు దారి చూపుతాయి..

- డా.ఆర్. లక్ష్మి