Others
కొలత వేయలేనిది!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
యద్ ద్యావ ఇంద్ర తే శతం శతం భూమీరుత స్యుః
న త్వా వజ్రిన్ త్సహస్రం సూర్య అను న జాతమష్ట రోదసీ
భావం: ఓ పరమాత్మా! నీవు సంకల్పించి సృష్టించిన ఎన్నో ఊర్థ్వలోకాలు పృథివీలోకాలు అంతరిక్షంలోగల అనేక లోకాలు, అనేక సూర్యమండలాలు నిన్ను సమీపింపజాలకున్నాయి.
వివరణ: సృష్టిలోని కొన్ని స్వయం ప్రకాశకాలు మరికొన్ని పరః ప్రకాశకాలు. సూర్యుడు, నక్షత్రాలు స్వయంప్రకాశకాలు. భూమి, చంద్రుడు పరతః ప్రకాశకాలు. అన్నీ సూర్యుని కాంతిచేతనే ప్రకాశిస్తాయి. వేదంలో ఈ రెండు విధాలయిన లోకాలను ద్యావాపృథివీ, భూమ్యాకాశాలు, ద్యావా భూమి, సూర్యచంద్రులు ఇలా వివిధ నామాలతో వ్యవహరింపబడతాయి. ఈ లోకాల మహత్వం మహోన్నతం. ఎందుకంటె- భూమిపై కోట్లకొలది ఏండ్లుగా మనుషులు, పశువులు, పక్షులు, కీటకాలు, పురుగులు, మృగాలు, పాములు మొదలైన జీవకోటి తమ ఆహారాన్ని పొందుతూ జీవిస్తున్నాయి. భూమికి మరో పేరు ‘రసా’. ఎందువలన అంటే భూమిలో మధురం, చేదు, పులుపు, వగరు, కారం, కషాయం అనే షడ్రుచులు ఉన్నాయి. బంగారం, వెండి, లోహాది ధాతు, ఉపధాతువుల గనిగా కూడ భూమి ఘనత వహించింది. అంతేకాదు. ధగధగ నిగనిగ మెరిసే రాళ్లు. మెత్తని మట్టి, ఇసుక మైదానాలతో ఈ నేలంతా నిండియుంది. కొన్నిచోట్ల మైళ్లకొలది ఎత్తున్న పర్వతాలతో వ్యాపించియుంది. మరికొన్ని చోట్ల లోతైన మహాసాగరాలతో గంభీరంగా కనబడుతుంది. చాలా చోట్ల నదీ నదాల గలగలతో రమణీయంగా ఉత్తుంగ సముద్ర తరంగాలతో ఆకర్షణీయంగా ఉంది. ఒకప్రక్క సస్యశ్యామల వర్ణంతో సుందరంగా కనువిందు చేస్తుంటే మరొకప్రక్క జల శూన్యమై ఇసుక ఎడారిగా భీతి కలిగిస్తూ ఉంది.