Others

మనుచరిత్ర ప్రబంధ దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పటికే ‘‘ఇష్టదేవతా వందన, సుకవి స్తుతులగు కవితతినికృతులజేసి, నవీన కావ్యరచనకు ననుకూల కదల్’’ దలంచుచున్న పెద్దనతో, ‘అతుల పురాణాగమేతిహాసకథార్థ స్మృతియుతుడవు ఆంధ్ర కవితాపితామహుడవు, చతురవచోనిధివి, శిరీష కుసుమ పేశల సుధా మయోక్తుల పేర్కొన నీకు ఎవ్వరు’ ఈడనుచు ‘కృతి రచింపుము మాకు’ అని ప్రార్థించాడు. అంతటితో ఊరుకుంటే బాగానే ఉండేది. కానీ ‘్భవచ్చతుర రచనకను కూలంబున్’ అంటూ మనువులలో ‘స్వారోచిష మనుసంభవ మరయ రససమంచిత కదలన్ విననింపు కలిధ్వంసకము కావున మార్కండేయ పురాణోక్త ప్రకారంబునం జెప్పు’’మని వస్తు నిర్దేశం చేసి మరీ తాంబూలం చేతబెట్టాడు. మహాప్రసాదమని పెద్దన ఆ తాంబూలం అందుకుని ‘మోదంబున అమ్మహాప్రబంధ నిబంధనంబునకు’ శ్రీకారం చుట్టాడు. ఆ ముహూర్తం ఎలాంటిదో గాని ఆంధ్ర సాహిత్య రసపిపాసులకో ప్రబంధగాంధర్వ లోకం వెల్లివిరిసింది. శుభమస్తు.
పై అడగటాలూ, అంగీకరించటమూ చూస్తే ‘పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ సంకటం’ అనిపిస్తుంది. పెద్దన గనక గడిచి గట్టెక్కాడు గాని మరో సామాన్యకవి ఎవరైనా అయుంటే దేశంవిడిచి పారిపోయి ఉండేవాడు. ఒకసారి రాయలవారి మాటలని పరిశీలించండి.
ముందుగా ‘కృతి రచింపుము మాకు’ అన్నారు. వెంటనే ‘శిరీష కుసుమ పేశల సుధామయోక్తుల బెద్దనార్య!’ అన్నారు. ఊరికే పొగడటానికి అన్నారనుకుంటే అది పొరపాటే. ఆ విలువ నిలబెట్టాలని బాధ్యత నెత్తిన పెట్టటమే అది. ఒక సంస్కృత కవి (‘సుధాకరుడ’నే ఆయన) ఆంధ్రభాషని మెచ్చుకుంటూ ‘‘యోవేత్త్వాం ధశురుూం వాణీం, శిరీషకుసుమపేశలామ్‌ కిం తస్య సుధయా కార్యం, మాధుర్య రస నిర్ణయే॥ అన్న పేరు నిలుపుకోమని శాసించినట్లే రాయలవారి సంభావన. పోనీ ఏదో తిప్పలు పడవచ్చులే అనుకుంటుండగానే ‘హితు*డవు చతుర వచోనిధివి’ అన్నారు. తనపై శాసన సంభావనని అపార్థం చేసుకునేవాడు కాక, తనకు మంచికోరేవాడనే నమ్మికను వెల్లడించటం. ఇంకా ఆ నమ్మకం చతుర వచోనిధిత్వం లోనూ ప్రకటించి ‘‘అందుకనే ఆ సంభావన’’ అన్నట్లు పలికాడు.
తరువాత మళ్లీ మరో శాసన సంభావన ‘‘అతుల పురాణాగతిమేతిహాస కథార్థ స్మృతియుతుడవు’’ అని చేశారు రాయలవారు. అలనాడు రాజరాజ నరేంద్రుడు నన్నయ భట్టారకులవారిని ‘‘బ్రహ్మాండాది నానాపురాణ విజ్ఞానిరతుడు’’ అన్న మాటనే ఈనాడు రాయలు కుదించి పెద్దనార్యుని సమాసంలో అతికి ‘పురాణ’ అన్నాడు. అంటే పురాణ యుతులైన పండితులలో సాటిలేని యోగ్యత కలవాడని అర్థం. పెద్దన అది నిలుపుకోవాలి. సరిగ్గా రాజరాజు ‘‘అవిరళ జపహుమ తత్పరుడు’’ అనటానే్న ‘ఆగమ’ అని సమాసంలో అల్లటం. అంటే ఆగమ విహిత కర్మానుష్ఠాన యుతులైన వారిలోనూ సాటిలేని అనుష్ఠానపరుడని అర్థం. ఇలా రెండు సంభావనలని కుదించి చెప్పి ఆ రాజరాజు ‘సంహితాభ్యాసుడు’ అని సంక్షేపంగా చెప్పినదాన్ని పెంచి రాయలవారు ‘ఇతిహాస కథార్థ యుతుడు’ అని రూపం మార్చి చెప్పారు. శ్రీమహాభారతాన్ని సంహిత అనటమూ ఉంది. ఇతిహాసమనటమూ ఉంది. అందులో ఉపాఖ్యాన కదలెన్నో ఉన్నాయి. అవన్నీ కష్టాల్లో ఉన్నవాళ్లు నిరుత్సాహ పడిపోకుండా, ‘‘అలా కష్టాలనుభవించిన వాళ్లెందరో ఉన్నారు. వాళ్లాఖరికి ధర్మవిజయం పొంది సుఖంగా ఉన్నారు’’ అని ఉదాహరణలుగా చెప్పిన ప్రోత్సాహకాలనిపిస్తాయి. అయినా ఆ కదల్లో ‘లోనారసి’ మేలనిపించే అర్థాలేవో ఉంటూంటాయి. ఆ అర్థాలు వివరించే తెలివిగల వాళ్లల్లో కూడా సాటిలేని సామర్థ్యం కలవాడివని రాయలు, పెద్దనని సంభావించాడు. రాజరాజు నన్నయని తెలివైనవాడు అనటానికి (మతి+అమరా ధిప+ఆచార్యుడు) ఖృహస్పతివి అన్నాడు. సమాసం చివర రాయలవారు స్మృతిచేర్చి, స్మృతి యుతులలోనూ నీకెవ్వరూ సాటి లేరన్నారు. స్మృతులు ధర్మశాస్త్ర గ్రంధాలు. మనుస్మృతి అందులో ముఖ్యమైంది. ఇతిహాస కథార్థాలు వివరించటంలో శాస్త్ర పద్ధతిని అనుసరించగలవాడని అర్థం. అదే నన్నయభట్టారకుల పట్ల రాజరాజ నరేంద్రుడు ‘సత్ప్రతిభాభియోగ్యు’డని వాడాడు. కొద్దిగా వివరాల్లోకి వెడదాం. ముందు ముందు ఉపయోగపడుతుంది.
ఇంకాఉంది

జొన్నవిత్తుల రామకృష్ణ శర్మ 9440037258