Others

సంక్రాంతి లక్ష్మికి స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి లక్ష్మికి స్వాగతం
సౌభాగ్యలక్ష్మికి స్వాగతం
రంగవల్లులతో స్వాగతం
గొబ్బెమ్మలతో స్వాగతం

హరినామస్మరణతో స్వాగతం
కాడెద్దులతో స్వాగతం
పాడిపంటలతో స్వాగతం
పాలూ పొంగళ్ళతో స్వాగతం

ధాన్యపు రాశుల బండ్లతో స్వాగతం
గణగణ మ్రోగే గంటలతో స్వాగతం
పరుగులు తీసే బుజ్జి తువ్వాయిలతో స్వాగతం

ఉదయభానుని కిరణాలతో స్వాగతం
ఎర్రకలువ అందాలతో స్వాగతం
ఝుమ్మనే భ్రమర నాదాలతో స్వాగతం

రంగురంగుల పట్టుపావడాలతో స్వాగతం
కనె్నపిల్లల జడకుప్పెలతో స్వాగతం
కళ్లాపి జల్లులతో స్వాగతం

కోవెల గంటల గణగణలతో స్వాగతం
సుప్రభాత సేవలతో స్వాగతం
తిరుప్పావై గీతికలతో స్వాగతం
పూల సౌరభాలతో స్వాగతం

ప్రకృతే పరవశించి
కమ్మని గొంతుతో
గానాలాపన చేసి
ఆహ్వానిద్దాం సంక్రాంతి లక్ష్మిని

సకల సౌభాగ్యాలతో
పల్లెసీమల అందాలతో
భోగభాగ్యాలతో అలరించాలని
దేశాన్ని సుభిక్షం చేయమని
శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని
వేడుకుందాం సంక్రాంతి లక్ష్మిని
స్వాగతిద్దాం సంక్రాంతి లక్ష్మిని

-పోడూరి శ్రీనివాసరావు (హైదరాబాద్)