చిత్తూరు

వాహనం సహా ఎర్రచందనం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీలేరు, మార్చి 21: పీలేరు పోలీస్ సర్కిల్ పరిధిలోని ఎర్రవారిపాళెం మండలం ఉస్తికాయలపెంట గ్రామం తూర్పుపల్లిగుట్ట సమీపంలో పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం సహా ఒక ఆయిల్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు మదనపల్లి డిఎస్పీ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. సోమవారం పీలేరు సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో జమునాముత్తూరు, ధర్మపురి, విల్లుపురం ప్రాంతాలకు చెందిన స్మగ్లర్ గోపాల్‌శంకర్ అతని అనుచరులతో రాజంపేట, తలకోన అడవుల్లో అక్రమంగా నరికిన 665 కిలోల ఎర్రచందనాన్ని పోలీసు, అటవీ సిబ్బంది గుర్తుపట్టకుండా ఉండేందుకు వీలుగా ఆయిల్ ట్యాంకర్ ద్వారా తరలిస్తుండగా, తూర్పుపల్లిగుట్ట సమీపంలో ఎర్రచందనాన్ని సోమవారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో పీలేరు రూరల్ సిఐ మహేశ్వర్ ఆధ్వర్యంలో కెవి పల్లి, రొంపిచెర్ల, భాకరాపేట, ఎర్రావారిపాళెం ఎస్‌ఐలు, సిబ్బంది పట్టుకున్నారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 665 కిలోల ఎర్రచందనం, ఒక ఆయిల్ ట్యాంకర్, 9 మంది ఎర్రచందనం కూలీలను, 5 గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎర్రచందనం కూలీలను అరెస్ట్‌చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఆయన చెప్పారు. జాతీయ సంపద అయిన ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడివారిపై కఠినచర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ మహేశ్వర్, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రూ.6 లక్షలు ఎర్రచందనం స్వాధీనం
* కారు డ్రైవర్ అరెస్ట్
శ్రీకాళహస్తి: టుటౌన్ పోలీసులు సోమవారం అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న కారును స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్ట్‌చేశారు. సిఐ వేణుగోపాల్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి నుంచి చెన్నైకు కారులో ఎర్రచందనం అక్రమ రవాణా అవుతుందని సమాచారం అందడంతో బైపాస్ రోడ్డులోని ఎంజిఎం పెట్రోల్ బంక్ వద్ద తనిఖీ చేయగా, 7 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. డ్రైవర్ గిరిబాబును అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని విజయపురం మండలం, చెంగమనాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన గిరిబాబు చెన్నైకు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్లు తేలింది. ఎర్రచందనం దుంగలతో పాటు కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.