చిత్తూరు

జనవరి 11న ఓటరు జాబితాలో ఒక్క ఓటు కూడా తొలగించలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 26: ఎన్నికల కమిషన్ జనవరి 11న ప్రకటించిన జాబితా ప్రకటన తరువాత జిల్లాలో ఒక్క ఓటు కూడా తొలగించలేదని, దీనిపై ఎలాంటి అపోహలు అవసరం లేదని చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న స్పష్టం చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 2019 ఎన్నికల ఏర్పాట్లపై విలేఖరుల సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫారం 7 ద్వారా ఓట్ల తొలగింపునకు 35,027 క్లైమ్‌లు అందాయని వివరించారు. ఎన్నికల సిబ్బంది, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారని, నోటీసులు అందుకున్నవారు ఈసీ నిబంధనల మేరకు తమ ధ్రువపత్రం అందిస్తే తొలగింపు ఉండదన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఓటర్ల తొలగింపు చేసిన లిస్ట్ ప్రతి తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నిర్ణీత ఆధారాలు లేకుండా ఓటరును తొలగించడం జరగదన్నారు. జనాభాతో పోలిస్తే 70శాతం ఓటర్లు ఉండాదలన్నారు. అయితే తాము ప్రజల్లో అవగాహన కల్పించడం వద్ద 68శాతానికి చేయగలిగామన్నారు. జిల్లాలో 3800 పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు పూర్తి చేస్తున్నామని, ఈసారి వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. 90శాతం ఓటింగ్ లక్ష్యంగా ప్రజలకు ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో దాదాపు వెయ్యి వాహనాలను వినియోగించనున్నామని, వాటికి జీపీఎస్ అనుసంధానం చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈవీఎంలపై సైతం అపోహలు వద్దని, ఏ పోలింగ్ కేంద్రానికి ఏ ఏ సీరియల్ నెంబర్ వెళ్లాలన్నది కంప్యూటర్ నిర్దేశిస్తుందన్నారు. ఇంటర్ నెట్ అనుసంధానం టాంపర్ ప్రూఫ్ అని, హ్యాకింగ్ చేయలేరని నిర్దారణ అయిందన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ రాకున్నా అధికారులు మాత్రం ఎన్నికల కోడ్‌లో ఉన్నట్లే భావించి ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. తప్పుడు క్లైములు ఎక్కువ మొత్తంలో వచ్చిన మొబైల్ నెంబర్, ఐపీ అడ్రస్ కోసం ఈసీకి ఫిర్యాదు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. దీనిపై సైబర్ క్రైమ్ పరిశీలనలో ఉందని ఇందుకు కారకులైన వారిని అరెస్టు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో చంద్రగిరి నియోజక వర్గ ఆర్వోలు విజయరామ రాజు, డాక్టర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం తిరుపతి నియోజక వర్గ పరిధిలో క్లైమ్‌ల అప్‌లోడ్ చేస్తున్న తిరుపతి అర్బన్ తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు.