చిత్తూరు

ఎన్నికల రంగంలోకి వారసుల అరంగ్రేటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్): ప్రతిష్టాత్మకమైన నగర పాలక సంస్థ ఎన్నికలకు తండ్రుల రాజకీయ వారసత్వాన్ని అందుకున్న ఇద్దరు నేతలు మొదటిసారిగా రంగంలోకి దిగుతున్నారు. పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని కుమార్తె కేశినేని శే్వత చౌదరి కాగా, సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో వైసీపీ రాష్ట్ర నేత పూనూరు గౌతంరెడ్డి కుమార్తె లిఖిత వేర్వేరు డివిజన్లలో కార్పొరేటర్లుగా పోటీకి సిద్ధమవుతున్నారు. వీరిలో టీడీపీ 11వ డివిజన్ అభ్యర్థిగా కేశినేని శే్వతా చౌదరి గురువారం నామినేషన్ వేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ సందర్భంగా పటమట ఎన్‌టీఆర్ సర్కిల్ నుంచి భారీగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా మూడు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన పూనూరు గౌతంరెడ్డి కుమార్తె లిఖిత కూడా తొలిసారిగా ఎన్నిక బరిలోకి దిగుతున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్ వైసీపీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న లిఖిత కూడా నామినేషన్ దాఖలుకు సిద్ధమవుతున్నారు. మేయర్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేసిన విషయం అందరికీ విధితమే. దీంతో రాజకీయ ప్రముఖులకు చెందిన వారసులు అనేకమంది ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేస్తున్న తరుణంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. వీరితోపాటు మేయర్ అభ్యర్థులుగా ప్రచారం జరుగుతున్న టీడీపీ అభ్యర్థి దేవినేని అపర్ణ, వైసీపీ అభ్యర్థి బండి నాగేంద్ర పుణ్యశీలతోపాటు పలువురు మహిళా రిజర్వు స్థానాల్లో నేతలు తమ భార్యలను, కుమార్తెలను రంగంలోకి దింపుతున్నారు. పలువురు తాజా మాజీ కార్పొరేటర్లకు తమ డివిజన్లు రద్దవడంతో కొన్ని విపత్కర పరిస్థితుల మధ్య వారసత్వ రాజకీయాలను అందిపుచ్చుకుంటున్న వీరి రాజకీయ భవిష్యత్తుపై సర్వత్రా చర్చనీయాంశం కాగా, వీరు బీ ఫారం పొందాల్సిన అవసరం ఉంది.