చిత్తూరు

శ్రీసిటీలో పర్యటించిన బెల్జియం వాణిజ్య రాయబారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు, మార్చి17: బెల్జియం దేశానికి చెందిన వాణిజ్య రాయబారి డాక్టర్ బర్డ్. డి గ్రూస్ గురువారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ ఎం డి రవీంద్ర సన్నారెడ్డి అయనకు స్వాగతం పలికి శ్రీసిటిలో ఏర్పాటు చేసిన వివిధ పారిశ్రామిక వసతులు, సాధించిన ప్రగతిని గూర్చి వివరించారు. ప్రపంచ స్థాయి పారిశ్రామిక వస్తువులతో పాటు వ్యాపారానికి అత్యంత అనువైన వాతావరణాన్ని ఏర్పరచినందునే శ్రీసిటీ అంతర్జాతీయ ఖ్యాతి గడించిందన్నారు. ఇక్కడ శతాధిక పరిశ్రమలు తమ పెట్టుబడులకు గమ్యంగా ఏర్పరుచుకున్నాయని ఆయనకు వివరించారు. బెల్జియం దేశానికి చెందిన వెర్మీరన్ సంస్థ కూడా శ్రీసిటీలో పరిశ్రమను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బెల్జియం దేశ వాణిజ్య రాయబారి శ్రీసిటీకి రావడం తనకు మిక్కిలి అనందాన్ని కలిగిందని డాక్టర్ బర్డ్. డి. గ్రూస్ పర్యటన అనంతరం అదేశం నుండి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అశాభావం వ్యక్తం చేశారు. అనంతరం దూత గ్రూస్ మాట్లాడుతూ శ్రీసిటీ రూపకల్పన అనేక ప్రత్యేకతలను సంతరించుకున్నందున ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిందని, ఇక్కడ ఏర్పాటు చేసి వసతుల పట్ల అందిస్తున్న సహకారం పట్ల తమ దేశానికి చెందిన వెర్మిరన్ సంస్థ సంతృప్తిని వ్యక్తం చేసిందన్నారు. ఈ సంస్థ వికలాంగులు ఉపయోగించే చక్రాల కుర్చీలు, నడకకు ఉపయోగించే పరికరాలను అసుపత్రుల్లో రోగులకు వాడే ప్రత్యేక మంచాలను తయారు చేస్తుందన్నారు. ఈ పర్యటనలో శ్రీసిటీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.