చిత్తూరు

మే 20న తిరుపతిలో జాతీయ రెడ్డి సింహగర్జన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 23: ఆర్థికంగా వెనుకబడి ఉన్న రెడ్ల అభివృద్ధి, ఐక్యత సాధించే దిశగా మే నెల 20వ తేదీన తిరుపతి ఇందిరా మైదానంలో జాతీయ రెడ్డి గర్జన నిర్వహిస్తున్నట్లు ఆ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి.కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో 3కోట్ల మందికిపైగా రెడ్డి సామాజాకి వర్గానికి చెందిన వారు ఉన్నారని చెప్పారు. వీరిలో 80శాతం మంది నిరుపేదలేనన్నారు. నేడు ఆర్థికంగా చితికిపోయి ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని ఆదుకోవడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రూ. 1000 కోట్లతో కార్పొరేషన్, జాతీయ స్థాయిలో రూ.10వేల కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. విద్యార్థులకు ఓబీసీ స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని, మేజర్ జనరల్ సిన్హా నివేదిక ప్రకారం ఓబీసీ జాబితాలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. రెడ్డి సామాజిక వర్గాన్ని సినిమాల్లో అత్యంత భయానక వర్గంగా చూపడం సరికాదని, ఇలాంటి చిత్రాలను ఇకపై నిర్మిస్తే తాము సహించేది లేదని హెచ్చరించారు. రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ జెండాలను పక్కన పెట్టి అన్ని పార్టీల్లోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఒక్కతాటిపైకి రావాలని ఆయన కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో ఆహ్వానకమిటీ కన్వీనర్ సోమలపల్లి మునిరెడ్డి, జిల్లా కాపురెడ్డి సేవా సంఘం అధ్యక్షుడు డిఆర్‌పి రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎం.మునీశ్వర్‌రెడ్డి, కార్యదర్శి ఈశ్వరరెడ్డి, మురళీరెడ్డి, మనోహర్ రెడ్డి, దామోదర రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వెంకటరమణా రెడ్డి, ఆదికేశవులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వేధింపులకు గురైతే వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయండి
* ఎస్వీయూ వీసీ ఆచార్య దామోదరం వెల్లడి
తిరుపతి, ఏప్రిల్ 23: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులు, విద్యార్థినులు, మహిళలు లైంగిక వేధింపులకు గురైతే ఎస్‌హెచ్‌ఈబిఓటి.కాం వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఎస్వీయూ వీసీ ఆచార్య ఆవుల దామోదరం సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, గృహహింస ఇతర సమస్యలపై వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేసినా వెంటనే పోలీసులు స్పందించి చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఎస్వీయూనివర్శిటీ.ఈడీయూ.ఇన్ అనే వెబ్‌సైట్‌లో కూడా ఈ లింకులు పొందుపచినట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.