చిత్తూరు

కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, సెప్టెంబర్ 19 : జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి వడ్డిస్తున్న కార్మికులు ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజన తయారి పథకాన్ని ఇస్కాన్ థార్మిక సంస్థకు అప్పగించరాదంటూ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు పలుప్రాంతాల నుంచి పెద్దఎత్తున భోజన తయారీ కార్మికులు పాల్గొన్నారు. ఈ క్రమంలో కార్మికులు కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఫిర్యాదుల దినంలో పాల్గొనేందుకు వస్తున్న బాధితులు, కలెక్టరేట్‌లో పనిచేసే ఉద్యోగులను లోనికి పోకుండా అడ్డుకున్నారు. ఓ దశలో కలెక్టరేట్ మట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కార్మికులను అరెస్ట్ చేశారు. తొలుత సిఐటియు జిల్లా అధ్యక్షుడు చైతన్యను ఎస్సై ప్రసాద్ అరెస్ట్ చేయగా, మహిళా కానిస్టేబుళ్లు ధర్నాలో పాల్గొన్న మహిళలను అరెస్ట్‌చేసి స్టేషన్‌కు తరలించారు. అయితే అరెస్ట్ అయి వాహనం ఎక్కిన తరువాత కూడా భోజన తయారీ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ ఆందోళనను కొనసాగించారు. అయితే అరెస్ట్ అయిన భోజన కార్మికులను సొంత పూచికత్తుపై పోలీసులు విడుదల చేశారు. దీంతో కార్మికులు తమ ఆందోళనలను ముగించుకుని తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. కాగా ఈ కార్యక్రమంలో పలువురు సిఐటియు నాయకులు సురేంద్ర, గణపతి, ఆరోగ్యదాస్, సి ఐటియు కార్యకర్తలతో పాటు, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం నాయకురాళ్లు నాగరాణి, చైతన్య, అముద, సావిత్రమ్మ, రాజకుమారి, పార్వతి, రంగమ్మ, మంజుల, విమల, సుగుణ తదితరులు పాల్గొన్నారు.