చిత్తూరు

తిరుపతి సోషియల్ కల్చరల్ క్లబ్‌పై పోలీసుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 9: తిరుపతిలో కెటి రోడ్డులో ఉన్న తిరుపతి సోషియల్ కల్చరల్ క్లబ్‌పై ఆదివారం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా 1లక్షా 10వేల రూపాయలనగదు, 20 సెల్‌ఫోన్లు, 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. సి ఐ రామకిషోర్ నేతృత్వంలో అలిపిరి ఎస్ ఐ శ్రీనివాసులు, సిబ్బంది ఈదాడులు నిర్వహించారు. కాగా అక్కడ పేకాట ఆడుతున్న వారిని విచారిస్తున్నారు. ఈక్లబ్‌లో పెద్ద ఎత్తున డబ్బుపెట్టి పేకాట ఆడుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు ఈ దాడులు జరిపినట్లు సమాచారం. కాగా ఈ క్లబ్ నిర్వహిస్తున్న లడ్డ్భూస్కర్ గత ఎంతోకాలంగా ఈ క్లబ్‌ను నడుపుతున్నారు.