చిత్తూరు

శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, అక్టోబర్ 28: శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాగశ్రవణం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణ మండపంలోకి వేంచేపుచేశారు. ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు యాగశాల వైధిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు,తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు. రాత్రి 6 నుంచి 8.30 గంటల వరకు యాగశాలలో నిర్వహించే పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి వెంకటయ్య, సహాయ కార్యనిర్వహణాధికారి డి.్ధనంజయులు, సూపరింటెండెంట్లు దినకరరాజ్, కంకణభట్టార్ శేషాచలం, ఆలయ అర్చక బృందం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.