చిత్తూరు

జిల్లాలో ఊపందుకున్న ఉప ఎన్నికల పర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, నవంబర్ 20: జిల్లాలో పలు కారణాలతో వాయిదాపడ్డ స్థానిక సంస్థల ఉప ఎన్నికల పర్వం ఊపందుకుంది. త్వరలో ఈ ఎన్నికలకు నోటికేషన్ జారీ కానున్న నేపథ్యంలో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. జిల్లాలో పది ఎంపిటిసి స్థానాలతో పాటు 21 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో గ్రామాల్లో అప్పుడే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధానంగా ఎంపిటిసి స్థానాలకు రాజకీయ పార్టీలు మద్దతుతో అభ్యర్థులు ఎన్నికల తలపడనున్నారు. పంచాయతీల్లో మాత్రం రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతున్నా ప్రధాన పార్టీల మద్దతుతోనే అభ్యర్థులు బరిలో దిగనున్నారు. జిల్లాలో ఎన్నికలు జరిగే ఎంపిటిసిలతో పాటు గ్రామ పంచాయతీలకు ఓటర్ల జాబితా కూడా అధికారులు సిద్ధం చేసారు. పోలింగ్ కేంద్రాలను కూడా నిర్దారించారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో అప్పుడే రాజకీయ వేడి తారా స్థాయికి చేరుకుంది. వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో గ్రామాల్లో అభ్యర్థుల ఎంపికతో పాటు రాజకీయ చర్చలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రధానంగా పలు చోట్ల ఏకగ్రీవంగా అభ్యర్థులను ఎన్నుకోవాలని ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నా కొన్ని చోట్ల మాత్రం పోటీ అనివార్యమైంది. దీంతో గ్రామాల్లో ఈ ఎన్నికలు స్థానిక నేతలకు ప్రతిష్టాత్మకం కానున్నాయి. గతంలో జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల్లో కూడా పలు పంచాయతీల్లో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఈ ఎన్నికలు ఎలాంటి పరిణామాలు దారి తీస్తాయోనన్న ఆందోళన స్థానికుల్లో నెలకొంది. చిత్తూరు కార్పొరేషన్ 33, 38 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది నగర మేయర్‌గా ఉన్న కఠారి అనూరాధ, ఆమెభర్త కఠారి మోహన్‌లు కార్పొరేషన్ కార్యాలయంలోనే దారుణ హత్యకు గురయ్యారు. దీంతో అనూరాధ కార్పొరేటర్‌గా విజయం సాధించిన 33వ డివిజన్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. 38వ డివిజన్ నుంచి గెలుపొందిన వైకాపా అభ్యర్థి శివప్రసాద్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ డివిజన్‌కు ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహణపై ఇటీవల కార్పొరేషన్ అధికారులు వివిధ రాజకీయ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించడంతో పాటు పోలింగ్ కేంద్రాలను కూడా నిర్ధారించారు. నగరంలో ఈ ఎన్నికలు వచ్చే నెలలో జరిగే అవకాశాలు ఉన్న తరుణంలో ఇందుకు కార్పొరేషన్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందుకోసం రిటర్నింగ్ అధికారులతో పాటు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం కూడా పూర్తి అయింది. గత ఏడాది చిత్తూరు కార్పొరేషన్ మేయర్ అనూరాధ హత్యకు గురైన నేపధ్యంలో అప్పటి నుంచి డిప్యూటీ మేయర్‌గా ఉన్న సుబ్రహ్మణ్యం చిత్తూరు కార్పొరేషన్ ఇన్‌చార్జి మేయర్‌గా కొనసాగుతున్నారు. తాజాగా ఈ డివిజన్‌ల ఎన్నికల అనంతరం మేయర్ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ డివిజన్ ఎన్నికలతో పాటు మేయర్ ఎన్నిక కూడా జరగనున్న తరుణంలో చిత్తూరు నగరంలో ఈ వ్యవహారం ప్రధాన చర్చగా కొనసాగుతుంది. చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు పట్ట్భద్రులు, ఉపాధ్యాయ నియోజక వర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు పర్యం ముగిసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న శ్రీనివాసులరెడ్డి, విఠపు బాలసుబ్రహ్మణ్యంల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుండటంతో రాజకీయ చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే కొందరు ఈ ఎన్నికల ప్రచార పర్వాన్ని చేపట్టడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
రేపు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, నవంబర్ 20: ఈనెల 26 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు జరుగనున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 22వ తేదీ మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితోశుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతిస్తారు. బ్రహ్మోత్సవాల కారణంగా ఈనెల 22న, 25 నుంచి డిసెంబరు 4వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను టిటిడి రద్దుచేసింది. 26వ తేదీ శనివారం ధ్వజారోహణం, రాత్రి చిన్నశేష వాహనం, 27న ఆదివారం ఉదయం పెద్దశేష వాహనం, రాత్రి హంసవాహనం, 28న సోమవారం ఉదయం ముత్యపుపందరి వాహనం, రాత్రి సింహవాహనం, 29న మంగళవారం ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంతవాహనం, 30న బుధవారం ఉదయం పల్లకీ ఉత్సవం, వసంతోత్సవం, రాత్రి గజవాహనం, డిసెంబర్ 1న గురువారం ఉదయం సర్వభూపాల వాహనం, స్వర్ణరథం, గరుడవాహనం, 2న శుక్రవారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 3న శనివారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 4న ఉదయం పల్లకీ ఉత్సవం, పంచమీతీర్థం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

వాల్మీకిపురంలో టమోటా కిలో 2లే
కలకడ, నవంబర్ 20: వాల్మీకిపురం వ్యవసాయం మార్కెట్ యార్డులో ఆదివారం టమోటా ధరలు కిలో రూ.1.50లు పలికాయి. గత నెల రోజులు టమోటా ధరలు తగ్గిపోవడంతో రైతులు పండించిన టమోటాలను మార్కెట్‌కు తరలించకుండా పొలాల్లోనే పశువులకు మేతగా వదిలేస్తున్నారు. అంతే కాకుండా నర్సరీలలో టమోటా పైరును అడిగే వారు కరవయ్యారని నర్సరీ యాజమానులు పేర్కొంటున్నారు. టమోటా ధరలు తగ్గిపోవడంతో రైతులకు కూలీ, బాడుగ ధర కూడా రావడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు.
రైతులు ఎక్కువ శాతం టమోటా పంటను సాగు చేశారని, ప్రస్తుతం టమోటాకు ధరలు లేకపోవడంతో టమోటా పైరును అడగడం లేదని పలువురు నర్సరీ యాజమానులు అంటున్నారు. ఆదివారం వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్‌లో 30కిలోల బాక్సు ధర రూ.45లు పలికాయి. ప్రభుత్వం టమోటాలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోండి

* గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభలో జడ్పి చైర్మన్ పిలుపు
చిత్తూరు, నవంబర్ 20: ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ సూచించారు. ఆదివారం స్థానిక సిఆర్ రెడ్డి కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పి చైర్‌పర్సన్ గీర్వాణి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన వికాస కేంద్రాలని, గ్రంథాలయాల్లోని పుస్తకాలను పఠనం చేస్తే తప్పకుండా విజ్ఞానం లభిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాలకూ గ్రంథాలయాలను విస్తరింపజేసేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మన్ తుమ్మల కన్నయ్యనాయుడు మాట్లాడుతూ జిల్లాలోని గ్రంథాలయాలకు సొంత భవనాలను ఏర్పాటు చేయడంతో పాటు, ఆధునిక వసతులు కల్పిస్తామని తెలిపారు. గ్రేడ్ - 1 గ్రంథాలయాల్లో ఇంటర్నెట్, డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. సంచార గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, గ్రంథాలయాలను ప్రజలకు చేరువ చేసే దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. టిడిపి నాయకులు వైవి రాజేశ్వరి, చంద్రప్రకాష్, డిపిఒ ప్రభాకర్‌రావు తదితరులు ప్రసంగించారు. అనంతరం గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లోని విజేతలకు ప్రశంసాపత్రాలు, మెమొంటోలను అందజేశారు. చివరిగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రమ, డిప్యూటీ లైబ్రేరియన్ లావణ్య, గ్రంథాలయ సంస్థ సభ్యుడు అబ్బూరి తాతయ్య, గ్రంథాలయ అభివృధ్ది కమిటి సభ్యులు, జిల్లా రచయితల సంఘం సభ్యులు పాఠకులు, తదితరులు పాల్గొన్నారు.
‘బాలల హక్కులను పరిరక్షించాలి’

తిరుపతి, నవంబర్ 20: బాలలు బాల్యంలో అనుభవించాల్సిన జీవించే హక్కును, అభివృద్ధి చెందే హక్కు, రక్షణ హక్కు, భాగస్వామ్య హక్కును కోల్పోతున్నారని దీనిని కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సివుందని ప్రభుత్వ బాలికల వసతి గృహం సూపరింటెండెంట్ బి.నందగోపాల్ అన్నారు. మంగళంలోని ప్రభుత్వ బాలుర సంస్కరణల సంక్షేమ వసతి గృహంలో ఆదివారం గ్రాసం-బాలతేజస్సు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాల ముగింపు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల పట్ల వివక్షతలు,హింసలు, బాలల హక్కుల ఉల్లంఘన అనేక రూపాలుగా జరుగుతోందని అన్నారు. ఈ ఉల్లంఘనల నుంచి బాలల సంరక్షణ చేపట్టడానికి సంస్థలు, ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పారు. సి డబ్ల్యుసి చైర్‌పర్సన్ రామకృష్ణ మాట్లాడుతూ బాలల్లో దాగిఉన్న సృజనాత్మకతను, వ్యక్తిగత నైపుణ్యాన్ని వెలికి తీయడం, బాలలను వారి తల్లితండ్రుల దగ్గర చేర్చడానికి బాలతేజస్సు నిరంతరం కృషి చేస్తుందని వివరించారు. ఈ సందర్భంగా కబడ్డీ, చెస్, పరుగుపందెం పోటీల్లో విజేతలైన బాలలకు బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో బాలుర వసతి గృహం సూపరింటెండెంట్ మహాలక్ష్మి, ప్రత్యేక గృహం సూపరింటెండెంట్ పాల్, ఆర్ ఐ పి రామమనోహర్, సి డబ్ల్యుసి సభ్యులు ఎన్.దొరస్వామి, జి.గంగయ్య, ఇండియన్ అకాడమీ డైరెక్టర్ హరిల్, ఎస్‌ఎస్‌ఎస్ సంస్థ కో ఆర్డినేటర్ పి.అమర్‌నాథ్, గ్రాసం బాలతేజస్సు కో ఆర్డినేటర్ రేణుక,బాలతేజస్సు సిబ్బంది టి.నీరజా, శైలజ, నరసింహులు, ధనంజయ తదితరులు పాల్గొన్నారు.

లైంగికంగా వేధిస్తున్నాడు
* రేణిగుంట ఎస్‌బిఐ క్లర్క్‌పై మహిళ అటెండర్ ఫిర్యాదు
రేణిగుంట, నవంబర్ 20: తనను లైంగికంగా వేధిస్తున్నాడని, తనకు ప్రాణభయం ఉందంటూ రేణిగుంట ఎస్‌బిఐలో అటెండర్‌గా పనిచేస్తున్న రేవతి అనే మహిళ ఆదివారం రేణిగుంట ఎస్ ఐ మధుసూధన్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. ఆమె కథనం మేరకు రేవతి గత నాలుగు సంవత్సరాలుగా రేణిగుంట ఎస్ బి ఐ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తోంది. కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేసుకుంటున్న ఆమెను నాలుగు నెలల క్రితం బదిలీపై వచ్చిన క్లర్క్ శ్రీనివాసులు తొలుత మానసికంగా వేధించేవాడు. కొద్ది రోజుల నుంచి లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

బాహుదాకాల్వలో అర్ధరాత్రి కట్టడాలను అడ్డుకున్న పోలీసులు
* మున్సిపల్ అధికారుల ఫిర్యాదుతో తొలగించిన వైనం
మదనపల్లె, నవంబర్ 20: మదనపల్లె పట్టణ నడిబొడ్డున టౌన్‌బ్యాంకు సర్కిల్‌లోని బాహుదాకాల్వలో శ్రీకృష్ణదేవరాయ విగ్రహం ఏర్పాటుకు అర్ధరాత్రి ఫిల్లర్లు వేస్తుండగా పోలీసులు అడ్డుకుని వాటిని జెసిబితో తొలగించారు. మదనపల్లె మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు పట్టణ నడిబొడ్డున ఎలాంటి విగ్రహాలు ప్రతిష్ఠించరాదని 2013లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని, ఎలాంటి అనుమతి లేకుండా గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి వేళల్లో బాహుదాకాల్వలో ఏకంగా ఫిల్లర్ నిర్మిస్తుండగా గమనించిన స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మున్సిపల్ కమిషనర్ విశ్వనాధ్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు అర్ధరాత్రి నిర్మిస్తున్న కట్టడాలను జెసిబితో తొలగించారు.
బెస్ట్ ఐఎంఎ అధ్యక్షురాలిగా డాక్టర్ కృష్ణప్రశాంతికి అవార్డు

తిరుపతి, నవంబర్ 20: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ అధ్యక్షురాలిగా ఇటు వైద్యుల హక్కుల పరిరక్షణలోనూ, అటు సామాజిక పరంగానూ విశేషంగా కృషిచేసి సేవలందించిన హర్షిత హాస్పిటల్ అధినేత, ప్రముఖ మదుమేహ నిపుణురాలు డాక్టర్ పెన్నా కృష్ణప్రశాంతికి బెస్ట్ అవార్డు లభించింది. ఆమెకు వ్యక్తిగత అవార్డే కాకుండా తిరుపతి శాఖ ద్వారా సెంట్రల్ వర్కింగ్ కౌనె్సల్ సదస్సును అద్భుతంగా నిర్వహించడం డాక్టర్లకు కుటుంబ ప్రయోజనాల పథకాలను అమలుచేయడంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు తిరుపతి ఐ ఎం ఎ శాఖకు కూడా ప్రత్యేక అవార్డు లభించింది. నవ్యాంధ్ర ప్రదేశ్‌లో తొలిసారిగా కోన సీమ ఐఎంఎ బ్రాంచ్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సంయుక్త ఆధ్వర్యంలో అమలాపురంలో ఈనెల 19,20 తారీఖుల్లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ ఎం ఎ ఆప్కాన్-2016కు కృష్ణప్రశాంతికి ఈ అవార్డు లభించింది. ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ రవికిరణ్ వర్మలు హాజరైన ఈ సదస్సులో ఆదివారం ఆమెకు అవార్డులు అందించారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే రాష్ట్రంలోనే ఐఎంఎ తిరుపతి శాఖకు తొలి అధ్యక్షురాలిగానే కాకుండా అవార్డు తెచ్చుకున్న ఏకైక మహిళ డాక్టర్ కృష్ణప్రశాంతి కావడం గమనార్హం. గత 2 దశాబ్దాలుగా ఐఎంఎకు తనవంతు సేవలందించిన డాక్టర్ కృష్ణప్రశాంతి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వైద్యులందరినీ సంఘటితం చేయడమే కాకుండా నిరంతర వైద్యవిద్య కార్యక్రమం నిర్వహించడంలో ఆమె తన ప్రతిభను చాటుకున్నారు. ఇక వైద్యులకు సమస్యలు ఎదురైనపుడు తక్షణం స్పందించి పరీక్షించడమే కాకుండా వైద్యులు పాటించాల్సిన నిబంధనలను ఎప్పటికపుడు గుర్తుచేయడంలో కూడా ఆమె ముక్కుసూటిగానే వ్యవహరించారనే చెప్పాలి. ఈ క్రమంలో ఆమె ఐ ఎం ఎం జాతీయ నాయకులైన అప్పారావు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి ఎస్ మూర్తి లాంటి నేతల ప్రశంసలు కూడా ఆమె పొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు వ్యక్తిగతంగా వచ్చినా, శాఖాపరంగా అవార్డు వచ్చినా వాటి వెనుక తిరుపతి శాఖ ఐ ఎం ఎ సభ్యులు సమిష్టి కృషి అని, ఇది వారి విజయం అన్నారు. తాను చేపట్టే కార్యక్రమాలకు తన సహచర డాక్టర్లు ఇచ్చిన ప్రోత్సాహాన్ని, సహకారాన్ని ఎన్నటికీ మరువలేనన్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఐ ఎం ఎ రాష్ట్ర, తిరుపతి శాఖ నాయకులుగా వ్యవహరించిన వారు ఎప్పటికపుడు తనకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం కూడా తన బాధ్యత నిర్వహించడంలో ఒక దిక్సూచిగా మారాయన్నది అక్షరసత్యం అన్నారు. కాగా ఆమె జాతీయ రాష్ట్ర ఐ ఎం ఎ నాయకులు చేతులమీదుగా అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐ ఎం ఎ రాష్ట్ర కార్యదర్శి ఎం ఎ రెహమాన్, నూతన అధ్యక్షులు గంగాధర్, రాష్ట్ర నాయకులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు, డాక్టర్ ఆనంద నాయుడు ఆమెను అభినందించారు. అవార్డు లభించినందుకు డాక్టర్ వాసుదేవనాయుడు, డాక్టర్ హరికుమార్‌రెడ్డి, డాక్టర్ పద్మనాభరెడ్డి, డాక్టర్ రామచంద్రరావు, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ రాజారెడ్డి, డాక్టర్ రాయప్పల రమేష్, డాక్టర్ ఆర్ముగం, డాక్టర్ హరినాథ్, డాక్టర్ ప్రేమానంద్, డాక్టర్ బలరాంరాజ్, డాక్టర్ ఆశాలత, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సుకుమార్, డాక్టర్ సురేష్‌లకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రెడ్డెమ్మకొండలో పెరిగిన భక్తుల రద్దీ
గుర్రంకొండ, నవంబర్ 20: మండల పరిధిలోని చెర్లోపల్లెలో వెలసిన రెడ్డమ్మకొండ ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో ఆలయం కిటకిటలాడింది. సంతానలక్ష్మిగా పూజలందుకుంటున్న రెడ్డమ్మకొండ ఆలయానికి జిల్లా నుండి కాక ఇతర జిల్లాల నుండి వేలాది మంది దంపతులు సంతానం కోసం వరపడటానికి వస్తుంటారు. ఆదివారం మహిళలు కోనేరులో మునిగి తడి బట్టలతో ఆమ్మవారి ముందర వరపడతారు. మూడు వారాలు అమ్మవారిని దర్శించుకుంటే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో సంతానం కలిగిన దంపతులు మొక్కుబడులు తీర్చుకోవడానికి ఆమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి బంగారు కానుకలు, పట్టుచీరలు, వెండి కానుకలు సమర్పించుకుంటారు. ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులు దర్శనానికి క్యూలైన్లలో ఇబ్బందులు పడ్డారు. ఆలయ సిబ్బంది చర్యలు తీసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.