చిత్తూరు

జిల్లా తమిళుల్లో విషాద ఛాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, డిసెంబర్ 6: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంతో జిల్లా తమిళుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. జయలలిత ఆరోగ్యం కుదుటపడుతుందని భావిస్తున్న తరుణంలో ఆమె మృత్యువాత పడడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. మంగళవారం కూడా జిల్లా నుంచి తమిళనాడుకు వెళ్లే బస్సులు దాదాపుగా నిలిచి పోయాయి. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల జయలలిత చిత్రపటాలను ఉంచి ఘనంగా నివాళులర్పించారు. పలు రాజకీయ పార్టీల నేతలు, అభిమానులు, పలు ప్రజాసంఘాలు కార్మిక ఉద్యోగ సంఘాలు ఆమె చిత్రపటాలకు పూల మాలలువేసి శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో అన్నాడిఎంకె పార్టీ కార్యాలయం వద్ద విషాదఛాయలు నెలకొన్నాయి. కార్యకర్తలు అమ్మ మరణాన్ని జీర్ణించుకోలేక బోరున విలపించారు. ఆంధ్రప్రదేశ్ అన్నాడిఎంకె రాష్ట్ర కార్యదర్శి బక్కర్ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు అమ్మను కడసారి చూసేందుకు చెన్నైకు తరిలి వెళ్లారు. చిత్తూరు జిల్లా తమిళనాడు సరహద్దులో ఉండడంతో ఇక్కడ తమిళప్రభావం ఎక్కువగాఉంది. ముఖ్యంగా చిత్తూరు, కుప్పం, నగరి, పుత్తూరు, నాగాలపురం, సత్యవేడు, ఎస్‌ఆర్ పురం, పలమనేరు తదితర ప్రాంతాల్లో తమిళ సంస్కృతి సంప్రదాయాలను అచరిస్తారు. జయలలిత మరణంతో ఈ ప్రాంతాల్లో కొంత ఆందోళనకర పరిస్థితి నెలకొంది. జయలలిత మరణించిందన్న సమాచారం అందడంతో తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. గుడిపాల, సత్యవేడు, నగరి, కుప్పం తదితర తమిళనాడు సరిహద్దుల వద్ద గట్టి నిఘా ఉంచారు. సరిహద్దు గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తు చర్యలు చేపట్టారు, రాష్ట్ర సరిహద్దు వెంబడి హైవే పెట్రోలింగ్ వాహనాలతో గస్తీ ముమ్మరం చేసారు. చిత్తూరు నుంచి తమిళనాడులోని కంచి , వేలూరు, తిరువణ్ణామలై తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ నిలిచి పోవడంతో ప్రమాణికులు ఇబ్బందులకు లోనయ్యారు. ఈ జిల్లా నుంచి తమిళనాడు వైపు వెళ్లే రైళ్ళ భద్రతకోసం ప్రత్యేకంగా సీఆర్‌పీఎఫ్ బలగాలను నియమించారు. చెన్నైలో జరుగుతున్న జయలలిత అంతిమ యాత్రను వీక్షించేందుకు పలుచోట్ల ప్రత్యేకంగా టివీలను ఏర్పాటు చేసారు. ఈ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో జనం గమికూడి జయలలితకు జిల్లాతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. చిత్తూరు జిల్లాలోని పలు తమిళనాడు బస్టాండులు ప్రయాణికలు లేక వెలవెల పోయాయి.

నగదురహిత లావాదేవీలు పెద్దఎత్తున చేపట్టేందుకు చర్యలు
* టిటిడి ఇఓ డాక్టర్ డి సాంబశివరావు
తిరుపతి, డిసెంబర్ 6: నగదురహిత లావాదేవీలను పెద్దఎత్తున చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామని టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం టిటిడి సీనియర్ అధికారులతో ఇఓ సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఇఓ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలకు సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ప్రాంతాల్లో అదనంగా స్వైపింగ్ యంత్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వర్షాకాలం కావడంతో తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో భక్తులకు వేడినీరు అందుబాటులో ఉంచాలని ఇఓ ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి వాహనాలను పార్క్‌చేసి భక్తులను ఇబ్బంది పెడుతున్న ప్రైవేటు వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో మరిన్ని ఆర్‌ఓ తాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సుపథం మార్గంలో దర్శనానికి వెళ్లే దాతల వివరాలను క్రమం తప్పకుండా నమోదు చేసుకొని డోనర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో అప్‌డేట్ చేయాలన్నారు. తిరుమలలో ప్రహరీ ఉద్యానవనాలను మరింత విస్తరించాలన్నారు. శ్రీవారిమెట్టు, అలిపిరి కాలినడక మార్గాల్లో పరిశుభ్రతకు సంబంధించి నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. దాతల విభాగం కార్యాలయంలో ట్రస్టులు, స్కీమ్‌కు సంబంధించిన తాజా వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశం అనంతరం రిసెప్షన్ విభాగం అధికారులతో ఇఓ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టిటిడి చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 రామచంద్రారెడ్డి, విఎస్‌వోలు రవీంద్రారెడ్డి, విమలాకుమారి, ట్రాన్స్‌పోర్ట్ జిఎం శేషారెడ్డి, ముఖ్య వైద్యాధికారి డాక్టర్ వికాస్, డిప్యూటీ ఇఓ కోదండరామారావు, హరీంద్రనాథ్, క్యాటరింగ్ అధికారి శాస్ర్తీ, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, ఎస్వీబీసీ సిఇఓ ఎవి నరసింహారావు, రిసెప్షన్ ఓఎస్‌డి లక్ష్మీనారాయణయాదవ్, ఇడిపి ఓఎస్‌డి బాలాజి ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.