చిత్తూరు

సర్వదర్శనం కాంప్లెక్స్‌కు నిర్మాణస్థల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 6: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో సర్వదర్శనం కాంప్లెక్స్ నిర్మాణం కోసం రెండు ప్రాంతాల్లో స్థలాలను మంగళవారం టిటిడి ఇఓ డాక్టర్ డి సాంబశివరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులు రూపొందించిన ప్లాన్‌ను ఇఓ పరిశీలించి పలు సూచనలు చేశారు. పర్వదినాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. నిపుణులను సంప్రదించి మరింత మెరుగ్గా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తరువాత దివ్యదర్శనం కాంప్లెక్స్‌ను ఇఓ పరిశీలించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. టీ, కాఫీ, తిరునామం, లగేజి భద్రపరచుకునే కౌంటర్లను ఇఓ పరిశీలించారు. ఇఓ వెంట టిటిడి చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 రామచంద్రారెడ్డి, ఇఇ-2 ప్రసాద్, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శర్మిష్ట, ఇతర అధికారులు ఉన్నారు.
‘బ్యాంకు లావాదేవీలు సక్రమంగా చేపట్టాలి’
వెదురుకుప్పం, డిసెంబర్ 6: మహిళా సంఘాలు బ్యాంకు లావాదేవీలను సక్రమంగా చేపట్టాలని ఐకెపి ఎపిఎం నరసింహులు సూచించారు. మంగళవారం ఐకెపి కార్యాలయంలో జరిగిన మహిళా సంఘాల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి సభ్యురాలు తప్పనిసరిగా బ్యాంకు ఖాతాకు ఆధార్‌నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ పథకాల పట్ల అవగాహన అవసరమన్నారు. గ్రామాల్లో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాల్లో మహిళా సంఘాలు పాల్గొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.
రేపు తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి అధ్యయన కమిటీ రాక
తిరుపతి, డిసెంబర్ 6: తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధికి అధ్యయన కమిటీ ఈ నెల 8వ తేదీ గురువారం తిరుపతిలో సమావేశం కానున్నట్లు జిల్లా కలెక్టర్ సిద్దార్థ్ జైన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిటీ చైర్మన్, సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, సభ్యులు ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ప్రభుత్వ సలహాదారు ప్రభాకర్, సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, పురావస్తుశాఖ సంచాలకులు రామకృష్ణారావు, సాంస్కృతిక శాఖ సంచాలకులు విజయభాస్కర్‌లతో అధ్యయన కమిటీ సమావేశం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వెనుక ఉన్న డిటిసి శిక్షణా కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు జరుగుతుందని అన్నారు. తెలుగు భాషాభివృద్ధి, అమలు, విభజన చట్టానికి సంబంధించి తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమి సంస్థల విభజన, విద్యారంగంలో తెలుగు బోధన, సాంకేతిక రంగంలో తెలుగు వినియోగం, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో తెలుగు వారి భాష అంశాలపైన, తెలుగు, సంస్కృతి అభివృద్ధి చేయడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రణాళికలు వంటి అంశాలపై చర్చ జరుగుతుందని అన్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలంటూకాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా
* పలు సంఘాలు మద్దతు

చిత్తూరు, డిసెంబర్ 6: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా కేంద్రమైన చిత్తూరులో కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. నగరంలోని ఎన్‌టిఆర్ విగ్రహం వద్ద వీరు తమ సమ్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు పలు ప్రజాసంఘాలు తమ మద్దతు తెలిపాయి, ఈసందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగుల సంఘ అధ్యక్షులు రెడ్డప్ప రెడ్డి మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాలకు విన్నవిస్తున్నా పట్టించుకునే నాథుడేలేరన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తాము కష్టపడుతున్నా తమ పట్ల పాలకులు వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సి ఉన్నా ఇది అమలుకు నోచుకోవడం లేన్నారు. వెంటనే తమన్యాయమైన సమ్యలు ప్రభుత్వం పరిష్కంచాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సంఘ కార్యదర్శి సురేంద్రనాయుడు మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 10వ పిఆర్‌సిని అమలు చేయాలని, కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవును కల్పించాలని , పారా మెడికల్ రెండవ పోస్టులను వెంటనే రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో సిపిఏం నేత చైతన్య పలుప్రజాసంఘాలు నేతలు పలువురు కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.