చిత్తూరు

గోవిందనామ స్మరణతో మారుమోగిన శేషాచల గిరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 1: నూతన ఆంగ్ల సంవత్సరం 2017కు స్వాగతం పలుకుతూ శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల్లో ఆధ్యాత్మిక చింతన వెల్లువయ్యాలా అడుగడుగునా తిరుమల భక్తులకు కలియుగ వైకుంఠంగా దర్శనమిచ్చింది. ఆదివారం జనవరి 1, నూతన సంవత్సరం కావడంతో దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు పోటెత్తాయి. కాలినడకన, ఆర్టీసి బస్సుల్లో, సొంత వాహనాల్లో వచ్చిన భక్తులకు శ్రీనివాసుడు కొలువైవున్న తిరుమల ప్రత్యేక కళాకాంతులు, పుష్ప సోయగాలతో స్వాగతం పలికిందనే చెప్పాలి. ఆలయం ముందు భాగాన ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన శ్రీవారి ఫ్లెక్సీ, అరటి బోదలు, మామిడి తోరణాలు, బంతిపూల మాలలు ప్రత్యేక అలంకరణగా నిలిచాయి. ఆలయం ముందు బాగానికి వెళ్లగానే తెలియని ఆనందాన్ని భక్తులు అనుభవిస్తున్నారు. వైకుంఠవాసుడే శ్రీనివాసుడిగా కొలువైవున్న తిరుమల్లో నూతన సంవత్సరంనాడు అడుగుపెట్టడంతో తమ జన్మధన్యమైనట్లుగా భక్తులు భావిస్తారు. అదే సమయంలో ఆలయ అలంకరణలోను, భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలోను, టిటిడి అధికారులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ భక్తుల ప్రశంసలను అందుకునేలా చేసింది. ఇక ఆలయంలోకి అడుగుపెట్టినవారికి ఆలయం నుంచి వెలుపలికి రావాలంటే మనస్కరించని రీతిలో ఆలయంలో పుష్పాలంకరణ చేశారు. వివిధ రకాల, వివిధ ప్రాంతాలకు చెందిన పుష్పాలు ఇక్కడే విరబూశాయా అన్నంతంగా భక్తుల కళ్ళకు నయనాందకరంగా కనిపించాయి. పుష్పాల నుంచి వెలువడుతున్న విచిత్రమైన పుష్పగంధ సువాసనలు అందరిని మత్తెకిస్తుంటే భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ శ్రీవారి ఆలయ వైభవాన్ని తిలకిస్తూ అప్పటి వరకు క్యూలేన్లలో వేచి ఉన్న శ్రమను పోగొట్టుకునేలా చేసింది. పగటిపూట కన్నా రాత్రిపూట విద్యుత్ దీపకాంతుల నడుమ శ్రీవారి ఆలయం అద్భుతమైన కాంతులు విరజిమ్ముతూ భక్తులను కట్టిపడేసింది. శ్రీవారి ఆలయం వెలుపల,లోపల చేసిన ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ చూసిన భక్తులు ఆశ్చర్యపోయేలా తీర్చిదిద్దారు. శ్రీవారి ఆలయం ఆంతా వివిధ రకాల విద్యుత్ దీపకాంతులు ప్రవహిస్తున్నాయా అన్నంతగా తీర్చిదిద్దిన తీరు భక్తుల్లో మానసిక ప్రశాంతతను పెంచింది. టిటిడి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఇ ఒ సాంబశివరావు, జె ఇ ఓ శ్రీనివాసరాజులు గత కొద్ది రోజులుగా శ్రమించి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తీసుకున్న తీసుకున్న చర్యల పట్ల సామాన్య భక్తులు, వి ఐ పిలను సైతం ఆశ్చపరచింది.

వేద వర్శిటీ విద్యార్థి బలాల్‌నాథ్ కులకర్ణికి జాతీయ స్థాయి స్వర్ణపతకం

తిరుపతి, జనవరి 1: రాష్ట్రీయ సంస్కృతి సంస్థానం న్యూధిల్లీ ఆధ్వర్యంలో డిసెంబర్ 26 నుంచి 31వరకు జరిగిన త్రిపుర రాష్ట్రం, అగర్తల, ఏకలవ్య పరిసరంనందు జరిగిన అఖిలభారతీయ శాస్ర్తి పోటీల్లో ఏపి ప్రతినిధిగా పాల్గొన్న వేదవిశ్వ విద్యాలయ మీమాంస విభాగం విద్యార్థి బలాల్‌నాథ్ కులకర్ణికి బంగారు పతకం లభించింది. మీమాంస పోటీల్లో కులకర్ణి అత్యుత్తమ ప్రతిభకనబరచడంతో స్వర్ణపతకం లభించిందని మీమాంస విభాగం అధ్యక్షలు డాక్కర్ టి. ఉమేష్‌భట్ తెలిపారు. కులకర్ణి నిరంతర సాధనకు తగిన ఫలితం లభించిందని అన్నారు. ఈసందర్భంగా విసి ఆచార్య దేవనాథన్ విద్యార్థిని అభినందించారు.
ఎప్పుడూ ఆనందంగా ఉండటమే నూతన సంవత్సరం ధ్యేయం
* మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
శ్రీ కాళహస్తి, జనవరి 1: అందరిలో ఆనందంగా ఉండటమే నూతన సంవత్సరం ధ్యేయం అని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ కాళహస్తి మండలం ఊరందూరులోని స్వగృహంలో ఉండిన మంత్రిని టిడిపి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల వారు ఆనందంగా ఉంటేనే నూతన సంవత్సరంగా ఉంటుందని తెలిపారు. అందరూ ఆనందంగా ఉండటం కోసమే రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నామని తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ కాళహస్తీశ్వరాలయం ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడింది. స్వామి,అమ్మవార్లను దర్శించుకోవడానికి, రాహు-కేతు పూజలు చేయించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో, వివిధ రకాల విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు బూంది, పులిహోర ప్రసాదాలను పంపిణీ చేశారు. అదేవిధంగా అనుబంధ ఆలయాలైన ప్రసన్న వరదరాజస్వామి, ముత్యాలమ్మ, బంగారమ్మ ఆలయాల్లో కూడా రాత్రి వరకు భక్తులు ఆలయం సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు కేక్ కట్‌చేసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఫరీద్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా దేవస్థానం ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ కోలా ఆనంద్ కూడా నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పార్టీల నాయకులు, ఇతరులకు శుభాకాంక్షలు తెలిపారు.