చిత్తూరు

రిలయన్స్ సంస్థకు మోదీ ప్రభుత్వం బానిస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జనవరి 7 : ప్రధాని నరేంద్రమోడి ఆధ్వర్యంలోని కేంద్రప్రభుత్వం పూర్తిగా రిలయన్స్ సంస్థ అధినేతకు బానిసలా మారిందని ఏఐసిసి సభ్యుడు, కర్నాటక రాష్ట్ర మాజీ ఎంపి, చిత్తూరు, వై ఎస్ ఆర్ కడప జిల్లాల కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు నారాయణస్వామి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని నిరశిస్తూ ఆలిండియా కాంగ్రెస్ కమిటి ( ఏఐసిసి ) పిలుపు మేరకు పిసిసి, డిసిసి నాయకులు, సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శనివారం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తొలుత కలెక్టరేట్ ఎదుట ఉన్న మొదటి గేటు ఎదుట నిల్చొని కేంద్రప్రభుత్వం, ప్రధాని మోది, రిజర్వ్‌బ్యాంకు గవర్నర్ ఉర్జిత్‌పటేల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే కొంత మంది పార్టీ కార్యకర్తలు ఎండిపోయిన వరి పైరును చేతపట్టుకుని ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు కేంద్రప్రభుత్వం అనారోగ్యం పాలైందంటూ కేంద్రప్రభుత్వాన్ని స్ట్రెచ్చర్‌పై పడుకోబెట్టి వినూత్న తరహాలో నిరశన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ నోట్ట రద్దు చేపట్టి దాదాపు రెండు మాసాలు కావస్తున్నా ఇప్పటికి ప్రజలకు చిన్న నోట్ల కష్టాలు తీరలేదన్నారు. ఆర్థిక సంవత్సరంలో పెద్ద నోట్లను రద్దు చేయడంతో రైతులు, కూలీలు, కార్మికులు పెద్ద ఎత్తున నష్టపోయారని ఆరోపించారు. ముఖ్యంగా రైతులు పంటలను వేసుకునేందుకు పెట్టుబడికి తీవ్ర ఇబ్బందులు పడ్డారని, తద్వారా పెద్ద మొత్తంలో పంట నష్టపోయారని దుయ్యబట్టారు. మోది అర్థం పర్థం లేని నిర్ణయం కారణంగా ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మంది తమ ఉద్యోగాలు వదులుకుని వీధుల పాలయ్యారని ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ కమిటి ( డిసిసి ) అధ్యక్షులు వంటేరు వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మోది నిర్ణయంతో ముఖ్యంగా ప్రముఖ ఎల్ అండ్ టి లాంటి ప్రముఖ కంపెనీలోనే 14 వేల మంది ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా పేద, బడుగు, బలహీన వర్గాల వారు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్విస్ బ్యాంకులోని నల్లధనాన్ని వెలికితీసి పేదల జన్‌ధన్ ఖాతాల్లో జమ చేస్తామని బీరాలు పలికిన మోది, నోట్ల రద్దు అంశం విఫలం కావడంతో ఏమి చేయాలో పాలుపోక ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ కాలం గడుపుతున్నారని ఆరోపించారు. నోట్ల రద్దు కారణంగా ఎంత నల్లధనాన్ని వెలికితీశారు, నోట్ల కోసం బ్యాంకులు, ఏటిఎంల ముందు నిల్చొని ఎంత మంది మరణించారు, మరణించిన వారిలో ఎన్ని కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించారు. పంట నష్టం ఎదుర్కొన్న ఎంత మందికి పరిహారం చెల్లించారు అనే తమ పార్టీ ప్రశ్నలకు మోది, రిజర్వ్‌బ్యాంకు గవర్నర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశానికి వెన్నుముకలా ఉన్న రైతులకు వెంటనే రుణమాఫీ చేసి మరిన్ని రోజులు తమ కుటుంబాలతో కలిసి హాయిగా జీవించేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మోది తీరుకు నిరశనగా తమ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 9న స్థానిక గాంధీ విగ్రహం ఎదుట భిక్షాటన, సత్యాగ్రహ కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. రైతులను ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తూ మరోమారు కలెక్టరేట్ ఆవరణలోని ప్రధాన ద్వారం వద్ద కొంత సేపు నొల్చొని నిరశన తెలిపారు. అనంతరం డి ఆర్ ఓ విజయ్‌చందర్‌కు వినతిపత్రం సమర్పించి తమ డిమాండ్లను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి కలికిరి సుబ్రహ్మణ్యం, పిసిసి కార్యదర్శులు సిద్దారెడ్డి, పాటూరి పరదేశి, మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషా, పిసిసి ప్రతినిధి వెంకట నరసింహులు, జిల్లా ఉపాధ్యక్షులు భోజనపాటి రవీంద్రనాయుడు, చిత్తూరు నగర అధ్యక్షుడు టికారామ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విపి ఇందుమతి, తిరుపతి నగర అధ్యక్షురాలు సావిత్రి, పిసిసి కార్యదర్శి ప్రమీలమ్మ, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు అరుణ, భారతి, పార్టీ సీనియర్ నేతలు బత్తయ్యనాయుడు, పెనుబాల చంద్రశేఖర్, యూత్ నాయకులు కార్తీక్‌తో పాటు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

నవోదయ విద్యాలయంలో ప్రబలిన జ్వరాలు
*90మంది విద్యార్థులకు అస్వస్థత
*తల్లిదండ్రులకు సమాచారం - వెంట తీసుకెళ్లిన వైనం
*విద్యాలయంను సందర్శించిన సబ్‌కలెక్టర్, వైద్యబృందం
*నిర్వహకుల నిర్లక్ష్యంపై సబ్‌కలెక్టర్ హెచ్చరికలు
మదనపల్లె, జనవరి 7: మదనపల్లె సమీపంలోని వలసపల్లె జవహర్ నవోదయ విద్యాలయంలో విషజ్వరాలు ప్రబలాయి. నవోదయ విద్యాలయంలో 520మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారంరోజులుగా 150మంది విద్యార్థులకు జ్వరాలు ప్రబలగా వారికి తాత్కాలిక ఉపసమనంగా మందులు ఇచ్చి పేర్లు నమోదుచేసినట్లు పాఠశాల అధికారులే చెబుతున్నారు. ఇందులో 90మంది విద్యార్థుల పరిస్థితి విషమించడంతో వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి ఇళ్ళకు పంపించేశారు. మరికొంత మంది విద్యార్థులు సుదూరప్రాంతంకు చెందినవారు కావడంతో ఇళ్ళకు వెళ్ళలేక పాఠశాలలోనే తాత్కాలిక మందులతో ఉపసమనం పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మదనపల్లె సబ్‌కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం మదనపల్లె ప్రభుత్వాసుపత్రి వైద్యులు, సిటిఎం పిహెచ్‌సి వైద్యబృందంతో కలసి విద్యాలయాన్ని సందర్శించారు. కలుషితమైన తాగునీరు, వాతావరణ మార్పులు, దోమకాటుకు ఇలాంటి వైరల్ జ్వరాలు ఒకరికొకరికి సోకుతుందని, ఆరోగ్యసిబ్బందిని అందుబాటులో ఉంచుకుని సకాలంలో వైద్యసదుపాయాలు అందించాలని పాఠశాల నిర్వహకులకు సబ్‌కలెక్టర్ సూచించారు. ఇంతపెద్ద ఇన్స్‌స్టిట్యూషన్‌కు చిన్నపిల్లల వైద్య నిపుణులు, ఇద్దరు స్ట్ఫానర్సులు, ఒక టెక్నీషియన్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక పిహెచ్‌సి వైద్యాధికారి శివకుమార్ అభిప్రాయపడ్డారు.
పాఠశాల ఆవరణలో ఎక్కడవేసిన చెత్త అక్కడే నిల్వవుండిపోవడం, నిండిన సెప్టిక్‌ట్యాంకులు శుభ్రం చేయించకపోవడం, బయటనుంచి తెప్పించుకుంటున్న తాగునీటిని క్లోరినేషన్ చేయకపోవడం వంటి వాటితో ఇలాంటి వైరల్‌ఫీవర్‌లు సోకే ప్రమాదం ఉన్నాయని డాక్టర్ శివప్రసాద్ వివరించారు.
కొంతకాలంగా ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకులు, హాస్టల్ వార్డెన్‌లు ఇవేమి పట్టనట్లు వ్యవహరించడంతో విద్యార్థిని, విద్యార్థులకు జ్వరాలు మరింతగా ప్రబలుతున్నాయి. జవహర్ నవోదయ విద్యాలయాలో విపరీతమైన దోమలు, కలుషితమైన తాగునీరు, నాశిరకం భోజనంతో విద్యార్థులకు ప్రారంభదశలో నొప్పులు, కడుపులో తిప్పటం, నీరసంగా ఉండటం, తల తిరగటం వంటివాటితో శరీరమంతా వేడిగా ఉండటం, మరికొందరు నీరసంగా కిందపడిపోవడం వంటివి జరుగుతాయని ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కాచిచల్లార్చిన తాగునీరు విద్యార్థులకు అందించాలని, దోమతెరలు వాడకం అలువాటు చేయాలని వైద్యులు నవోదయ నిర్వహకులకు సూచించారు.