చిత్తూరు

సీమ రైతులకు తీరని అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జనవరి 19 : గత 63ఏళ్లుగా రాయలసీమ రైతులకు తీరని అన్యాయం జరుగుతూ వస్తోందని రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జ దశరథరామిరెడ్డి ఆరోపించారు. గురువారం నగరంలోని ఓ కళ్యాణ మండపంలో రాయలసీమ నీటి హక్కు సాధన సదస్సును నిర్వహించారు. రాయలసీమ సాగునీటి సాధన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో సమితి కన్వీనర్ దశరథరామిరెడ్డి మాట్లాడుతూ పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత 63 ఏళ్లుగా రాయలసీమ రైతులు సాగునీటికి పడరానిపాట్లు పడుతున్నారని వాపోయారు. రాయలసీమలను సస్యశ్యామలం చేస్తామని ప్రతి ఎన్నికల మ్యానిఫెస్టోలు విడుదలచేసి అధికారంలోకి వచ్చిన ఏ రాజకీయ పార్టీ కూడా రైతుల బాధలను పట్టించుకునన్న పాపాన పోలేదన్నారు. రాయలసీమలోని నికర మిగులు జలాలు ఉండే ఆరుప్రాజెక్టుల పరిధిలో దాదాపు 95 శాతం హెక్టార్ల భూములు ఉన్నాయన్నారు. అయితే వాటిలో కేవలం 13.42 శాతం ఎకరాలు మాత్రమే కాలువల ద్వారా సాగుకు నోచుకుంటున్నాయని, అదేవిధంగా 6.5 శాతం ఎకరాల భూమికి మాత్రమే ఇతర మార్గాల ద్వారా సాగునీరు అందుతోందన్నారు. మిగిలిన 75 శాతం భూములు సాగునీటికి నోచుకోకుండా బీళ్లు బారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నికర జలాలను రైతులు వినియోగించుకేనేలా చేయడంలో దారుణంగా విఫలమవుతున్న ప్రభుత్వాలు హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి భూములన్నింటికి సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని మరోసారి అన్నదాతలను మభ్యపెట్టే పనిలో విజయవంతం అవుతున్నారని ఆరోపించారు. 1.04 లక్షల ఎకరాల భూములకు సాగునీటిని అందించే లక్ష్యంగా పెట్టుకుని నిర్మిస్తున్న హంద్రీ-నీవా ప్రాజెక్టు పూర్తి చేసేందుకు దాదాపు రు15వేల కోట్లు అవసరం కాగా గత బడ్జెట్‌లో కేవలం రు 250 కోట్లు మాత్రమే మంజూరు చేశారని వివరించారు. అదేవిధంగా 1.03 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందించే లక్ష్యంగా నిర్మిస్తున్న గాలేరు-నగరి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలంటే రు 5250 కోట్లు అవసరం కాగా, గత బడ్జెట్‌లో కేవలం రు 170 కోట్లు మాత్రం కేటాయించారని ఆరోపించారు. భారీవ్యత్యాసంతో ప్రభుత్వం నిధులను విడుదల చేయడం చూస్తుంటే రానున్న 20 ఏళ్లలోనూ సంబంధిత రెండు ప్రాజెక్టులు పూర్తి చేయడం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర సలహాదారుడు జివి జయచంద్రచౌదరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల జన్మహక్కు అయిన కృష్ణ జలాలను ఇతర రాష్ట్రాల సాగునీటి అవసరాలకు పంచివేడం దారుణమన్నారు. కృష్ణ జలాల పంపిణి విషయంలో పాలకులు, అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా రాయలసీమలో హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులు పనులు పూర్తి అయినా, సంబంధిత ప్రాజెక్టులకు ఒక్క చుక్క నీరు కూడా వచ్చే అవకాశాలు లేవన్నారు. తమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతున్నా ఏ నాయకుడూ కృష్ణట్రిబ్యునల్‌ను ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులెవరికీ రాయలసీమ రైతుల గోడు పట్టడం లేదన్నారు. గత 63 సంవత్సరాలుగా పాలకులు ఇదే సంప్రదాయాలను పాటిస్తూ పరోక్షంగా సీమ రైతుల అభివృధ్ది నిరోధకులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే కుప్పంలో చెంబుడు నీళ్లు వదిలి హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులు పూర్తయినట్లు అధికార పార్టీ పాలకులు బీరాలు పలుకుతూ రైతులను ఏమార్చడం తగదన్నారు. నీటిపై హక్కులు లేకుంటే ప్రాజెక్టుల నిర్మించినా ఫలితం శూన్యమే అవుందన్నారు. వాస్తవాలను ఎంతోకాలం దాచలేరని, ప్రభుత్వ తీరును రాయలసీమలోని రైతులు, ప్రజలకు తెలియజెప్పేందుకు తమ రాయలసీమ సాగునీటి సాధన సమితి ద్వారా రానున్న రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల జిల్లాలోని రెండు ప్రాంతాల్లో విడతల వారీగా తమ సమితి ద్వారా పాదయాత్రలు చేస్తామన్నారు. అదే విధంగా రాయలసీమ రైతులందరిలో చైతన్యం కల్పించి మేనెల 21న కర్నూలు జిల్లాలోని ఓప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించి అధికార, ప్రతిపక్ష పార్టీలు, అధికారులకు హెచ్చరికలు పంపుతామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం సమితి పటిష్టతకు తీసుకోవాల్సిన అంశాలు, పాదయాత్రలకు సన్నాహాలు, కర్నూలులో నిర్వహించనున్న రాయలసీమ రైతు బహిరంగ సభ ఏర్పాట్లుపై కూలంఖశంగా చర్చించారు. ఈ సమావేశంలో రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ అరుణ్, రైతు సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షులు మాగాంటి గోపాల్‌రెడ్డి, సమాఖ్య ప్రతినిధులు హరిబాబుచౌదరి, శ్రీరాములురెడ్డి, జగన్నాధరెడ్డి, మాధవనాయుడు, సిద్దయ్యనాయుడు, శ్రీనివాసులునాయుడు, పొలకల చిట్టిరెడ్డి, జయరామనాయుడు తదిరులు పాల్గొన్నారు.
సినీ ఫక్కీలో బంగారు వ్యాపారి నగదు చోరీ
* చోరీ మొత్తం 13.50లక్షలు
* కేసు నమోదుకు ముందుకురాని పోలీసులు
* లబోదిబోమంటున్న బాధితుడు
రేణిగుంట, జనవరి 19: రేణిగుంట రైల్వే స్టేషన్‌లో కడపజిల్లాకు చెందిన బంగారు నగల వ్యాపారి నుంచి రూ.13లక్షల 50వేలు దోచుకెళ్లిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటనపై బాధితుడికి అండగా నిలవాల్సిన పోలీసులు ఈ కేసు తమ పరిధిలోకి రాదంటూ జిఆర్‌పిఎఫ్ పోలీసులు, రేణిగుంట పట్టణ పోలీసుల చెప్పడంతో బాధితుడు మరింతగా కుంగిపోతున్నాడు. వివరాల్లోకి వెడితే కడపకు చెందిన పెద్ద దర్గా వీధిలో నగల వ్యాపారం చేసుకుంటున్న అల్లాబక్ష్ చెన్నయ్‌లో నగలు కొనేందుకు తన బావమరిది అమీర్ బాషాకు రూ.13.50లక్షలు ఇచ్చాడు. అమీర్ బాషా నగదుతో చెన్నయ్‌కి వెళ్లేందుకు గురువారం తెల్లవారు జామున 3.20గంటలకు కడప రైల్వే స్టేషన్ నుంచి రామేశ్వరం- ఓక ఎక్స్‌ప్రెస్‌లో 5.20 గంటలకు రేణిగుంట రైల్వేస్టేషన్‌లోని రెండో నెంబర్ ప్లాట్‌ఫాం వద్దకు చేరుకున్నాడు. అక్కడ నుంచి 1వ నెంబర్ ప్లాట్‌ఫాంలోని యూనిట్ ట్రైన్ వద్దకు వచ్చాడు. ఈ సమయంలో ఖాకీ దుస్తులు ధరించిన సుమారు 30 సంవత్సరాలు వయస్సు ఉన్న ఇద్దరు యువకులు అమీర్‌బాషాను అడ్డుకున్నారు. తాము పోలీసులమని నమ్మించి తనిఖీ చేశారు. అతని వద్ద ఉన్న డబ్బును గుర్తించి ఎస్‌ఐ వద్దకు రమ్మని స్టేషన్ నుండి బయటకు తీసుకువచ్చారు. స్కూటర్‌లో తమ వెంట తీసుకుని వెళ్లి పాత చెక్‌పోస్టు వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద అతనిని బెదిరించి, కొట్టి రూ.13.50లక్షలతో పరారయ్యారు. కాగా బాధితుడు తన బావకు జరిగిన విషయం చెప్పడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారు. డబ్బులు చోరీ జరిగింది రైల్వే స్టేషన్ వెలుపల కాబట్టి తాము కేసుకట్టమని రైల్వే పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ సంఘటన జరిగింది రైల్వే స్టేషన్లో కనుక తాము కేసునమోదు చేయలేమని రేణిగుంట పోలీసులు తేల్చి చెప్పారు. ఒకవైపు పెద్ద ఎత్తున నగదు పోగొట్టుకుని బాధపడుతున్న తమను పోలీసులు కేసు నమోదు చేయకుండా ఇలా తిప్పించడం సరికాదంటూ బాధితుడు వాపోతున్నాడు. రైల్వే స్టేషన్‌లోని సిసి కెమెరాల్లో ఈ సంఘటన పూర్తిగా రికార్డయి ఉంటుందని పోలీసులు స్పందిస్తే వెంటనే నిందితులను అరెస్టు చేసే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.

బాకరాపేట ఘాట్‌లో బోల్తాపడ్డ ఆర్టీసి బస్సు
* 15మందికి గాయాలు-రుయాకు తరలింపు
* డ్రైవర్‌కు లోబిపితోనే ప్రమాదం
చంద్రగిరి, జనవరి 19: రాయచోటీ నుంచి పీలేరుకు వస్తున్న ఆర్టీసి బస్సు గురువారం బాకరాపేట ఘాట్‌రోడ్డులో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 60 మంది ప్రయాణీకుల్లో 15 మందికి గాయాలు కాగా వారిని చికిత్స కోసం రుయా ఆస్పత్రికి తరలించారు. బస్ కండెక్టర్ కథనం మేరకు రాయచోటి నుంచి బస్సు బయలుదేరిన తరువాత తనకు అనారోగ్యంగా ఉందని డ్రైవర్ చెప్పాడని అన్నారు. అక్కడే తననొప్పికి ట్యాబ్లెట్ కూడా వేసుకున్నారని, అయితే తిరుపతికి సమీపంలోకి వచ్చాక మళ్లీ తన అనారోగ్యం గురించి చెప్పాడని అన్నారు. ఈసందర్భంగా జండుబామ్‌ను రుద్దుకుని బయలు దేరగా బాకరాపేట సమీపంలో డ్రైవర్ మరింత తలనొప్పికి గురయ్యాడని ఈ క్రమంలోనే ముందు వెడుతున్న టాటామినీ వ్యాన్‌ను ఢీకొట్టి పక్కకు బోల్తాపడిందని చెప్పారు. ఈసమయంలో బస్సులో 60 మంది ప్రయాణీకులు ఉండగా ఇందులో 15 మంది వరకు గాయపడ్డారని బాధితులను రుయా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.
స్వైన్‌ఫ్లూ ప్రమాదకరమే..జాగ్రత్తలు తప్పనిసరి
* జయమ్మ పిల్లలకు స్వైన్‌ఫ్లూ వ్యాధి లేదు
* రుయా సూపరింటెండెంట్ డాక్టర్ సిద్దానాయక్ స్పష్టం
తిరుపతి, జనవరి 19: స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రమాదకరమేనని, జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండదని, అయినప్పటికి ముందు జాగ్రత్త చర్యగా పిల్లలకు, పెద్దలకు వేర్వేరుగా ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు రుయా సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్ తెలిపారు. గురువారం రుయా ఆస్పత్రిలోని స్వైన్ ఫ్లూ వార్డును ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన రోగులకు, సిబ్బందికి మాస్కులు అందించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం స్వైన్‌ఫ్లూతో జయమ్మ మృతి చెందగా ఆమె ఇద్దరు కుమార్తెలు కూడా జ్వరం, జలబుతో బాధపడుతుండగా వారికి సోమవారం స్వైన్‌ఫ్లూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. వారి నమూనాలను స్విమ్స్‌లో పరీక్షించాక వారికి స్వైన్‌ఫ్లూ లేదని తేలిందన్నారు. ప్రమాదకరమైన ఈవ్యాధి రాకుండా ఉండాలంటే వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. దానిని పాటిస్తే ఈ వ్యాధి గురించి భయపడాల్సిన పనిలేదని చెప్పారు. అలాగే రుయాలోని పిడియాట్రిక్ వార్డులో ప్రత్యేకంగా 10 బెడ్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే 195 నెంబర్ మాస్కులను, మందులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. వెంటనే అందించడానికి అవసరమైన చర్యలు అన్ని తీసుకున్నామని వివరించారు.

ఐఐటిలో మెరుగైన విద్యను అందిస్తాం

* డైరెక్టర్ సత్యనారాయణ వెల్లడి
రేణిగుంట, జనవరి 19: తిరుపతి ఐఐటిలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషిచేస్తామని నూతనంగా నియమితులైన డైరెక్టర్ సత్యనారాయణ వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం తిరుపతి రేణిగుంట రోడ్డులోని ఐఐటి కళాశాలలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమలలో కొలువై ఉన్నారన్నారు. ఈ పరిసర ప్రాంతాలు ఒక ఆధ్యాత్మిక దివ్యధామంగా విరాజిల్లుతున్నాయన్నారు. ఈనేపథ్యంలో తిరుపతిని ఒక విద్యాహబ్‌గా రూపొందించడానికి రాష్టమ్రుఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఆయన కృషి ఫలితంగా తిరుపతిలో ఐఐటి కళాశాల ఏర్పాటైందన్నారు. ఇది రాయలసీమ ప్రాంతంలోని విద్యార్థులకు ఒక వరం లాంటిందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవడం విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటుందన్నారు. ఐఐటి బోధనలో అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఫ్యాకల్టీని ఏర్పాటుచేస్తున్నామన్నారు. నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బోధనావిధానాలకు అనుసంధానం చేసి విద్యార్థులకు విద్యాబోధన చేస్తామని, 2017 జూలై కల్లా 600 పడకల వసతి గృహాలను నిర్మిస్తున్నామని అన్నారు. ఏర్పేడు వద్ద నిర్మిస్తున్న ఐఐటి అన్ని హంగులతో విద్యార్థినీ విద్యార్థులకు ఉపయోగపడేవిధంగా డిజైన్ చేయడం జరిగిందని తెలిపారు. తిరుపతి ఐఐటిలో గత ఏడాదికన్నా విద్యార్థినుల శాతం పెరిగిందన్నారు. ఈ ఏడాది ఐఐటిలో ఎంఎస్ (మాస్టర్ ఆఫ్ సైన్స్) ను ప్రవేశపెడుతున్నానని అన్నారు. ఇక తిరుపతిలో ఉన్న ఐఐటి కళాశాలలో ఏమాత్రం సిటీలలోని ఐఐటికి తీసిపోని విధంగా అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు కృష్ణయ్య, రాఘవేంద్ర, కిశోర్, నటరాజన్, దేష్‌ముఖ్, ఎ ఓ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

డయాలసిస్ నిర్వహణపై నెఫ్రోప్లెస్ సంస్థతో స్విమ్స్ ఒప్పందం

తిరుపతి, జనవరి 19: స్విమ్స్‌లో ఏర్పాటు చేసిన 100 పడకల డయాలసిస్ యూనిట్ నిర్వహణకు సంబంధించి ఆ రంగంలో విశేష అనుభవం కలిగిన నెఫ్రోప్లస్ సంస్థతో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టి.రవికుమార్ గురువారం ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశ చరిత్రలోనే వంద పడకలున్న డయాలసిస్ యూనిట్‌ను తిరుపతిలోని స్విమ్స్‌లో ఏర్పాటుచేసిన నూతన భవనాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించిన విషయం పాఠకులకు విదితమే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం కింద డయాలసిస్ యూనిట్ నిర్వహణ బాధ్యతలపై నెప్రోప్లస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఇది రోగులకు ఎంతో మేలుచేస్తుందని చెప్పారు. ఈ కేంద్రంలో ఒక్క రోజులో 300 మందికి కిడ్నీ వ్యాధి గ్రస్థులు డయాలసిస్ చేసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఒక మిలయన్‌కు 7,852 మంది కిడ్నీ వ్యాధి బారినపడుతున్నారన్నారు. అంతేకాకుండా వారికి అదనంగా 230 మంది కొత్త రోగులు కూడా చేరుతున్నారన్నారు. ఒక్క రాయలసీమ జిల్లాల్లో 15 మిలియన్ల జనాభాలో 12వేల మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. దేశ వ్యాప్తంగా లక్ష మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా ఉందన్నారు. ఈక్రమంలోనే నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాల ఆధ్వర్యంలో రాయలసీమ వాసుల అవసరాలను తీర్చాలన్న సంకల్పంతో ఈ నూతన భవానాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈవ్యాధి బారినపడటానికి బిపి, షుగర్ వ్యాధులు కీలకంగా మారుతున్నాయన్నారు. అందుకే కిడ్నీ వ్యాధులకు సంబందించి గ్రామస్థాయిలో కూడా అవగాహన కల్పించడానికి క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. త్వరలోనే స్విమ్స్, సొసైటీ ఆఫ్ కార్డియోవాస్కులర్, అల్ట్రా సౌండ్, బెస్ట్ ఇన్ యు ఎస్ ఏ తరపున డాక్టర్ నవీన్, సి.నందాలతో కూడా ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు. తద్వారా ఇరు సంస్థలకు పరిశోధకులను మార్పు చేసుకోవడమే కాకుండా వైద్య విద్యకు సంబందించి పత్రాలను, పరిశోధనలను, ప్రచురణలను మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ సదస్సులు నిర్వహించి స్విమ్స్ ద్వారా మెరుగైన వైద్యం అందించాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. వ్యాధులు సోకకుండా నివారించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమన్నారు. అనంతరం నెఫ్రోప్లెస్ సంస్థ వ్యవస్థాపక సి ఇ ఒ వి.కరన్ ఉప్పల్, డాక్టర్ ఆనంద్‌లు మాట్లాడుతూ డయాలసిస్‌కు సంబంధించి తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నామన్నారు.తద్వారా శిక్షణ పొందిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ఇందుకు సంబంధించి ఒక అభ్యర్థి నుంచి రూ.25వేలుఫీజు తీసుకోవడం జరుగుతుందని, వీటిలో కూడా స్విమ్స్‌కు భాగస్వామ్యం ఉంటుందన్నారు. స్విమ్స్‌పై ఎలాంటి భారం ఉండబోదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. స్విమ్స్‌లాంటి ఒక గొప్ప కార్పొరేట్ ఆస్పత్రిలో సేవాబావంతోనే ఈ పనులు చేపడుతున్నామన్నారు. ఈకార్యక్రమంలో పి ఆర్ డైరెక్టర్ డాక్టర్ వెంకటరామిరెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

రైతుల మేలుకోరే కస్టమ్ హియరింగ్ సెంటర్లు
* ఎస్వీ వ్యవసాయ విశ్వవిద్యాలయ విసి రాజశేఖర్ వెల్లడి

తిరుపతి, జనవరి 19: రైతులను అదుకునేందుకు, అధిక దిగుబడులను సాధించేందుకు అవసరమైన ఆధునిక వ్యవసాయ పరికరాలను వారికి అందుబాటులోకి తీసుకురానున్నామని ఇందు కోసం కస్టమ్ హియరింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయశాఖ ప్రధాన కార్యదర్శి, శ్రీవేంకటేశ్వర వ్యవసాయ విశ్వ విద్యాలయ చాన్సలర్ రాజశేఖర్ అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలు, ఇతర అంశాలపై చర్చించేందుకు దేశంలోని వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్తవ్రేత్తలు, అధికారులు, ఆదర్శరైతులతో గురువారం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ విశ్వ విద్యాలయంలో సమావేశం జరిగింది. ఈకార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్కోజిల్లాలో ఒక్కోరకమైన వాతావరణం, పంటలు, అనుసరించే విధానాలు ఉంటాయన్నారు. అయితే ప్రస్తుతం వ్యవసాయరంగంలో దిగుబడి 20శాతం మాత్రమే ఉందన్నారు. దీనిని 70శాతం పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సి ఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైతులకు అవసరమైన అధునాతన వ్యవయసాయ పరికరాలను వారికి అందుబాటులో ఉంచడం జరుగుతోందని అన్నారు. ఆయా పంటలకు అవసరమైన పరికరాలను రైతులు నామ మాత్రపు రుసుము చెల్లించి తీసుకెళ్లవచ్చన్నారు. తమ అవసరాలు తీరిన తరువాత తిరిగివాటిని కస్టమ్ సెంటర్‌కు తెచ్చివ్వాలన్నారు. దీని ద్వారా రైతులు కూలీల సమస్య తొలగిపోతుందని, పంటల దిగుబడి పెరుగుతుందని, నాణ్యతతో కూడిన దిగుబడులు వస్తాయన్నారు. దీని ద్వారా రైతు ఆదాయం పెరిగి జీవన విధానం మారుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ మిశ్ర, డాక్టర్ టి.సి.ఎం.నాయుడు, డాక్టర్ టి.వి.సత్యనారాయణ, ప్రొఫెసర్ గజేంద్ర సింగ్ పాల్గొన్నారు.
ఘనంగా త్రైమాసిక మెట్లోత్సవ శోభాయాత్ర
తిరుపతి, జనవరి 19: శ్రీవారి త్రైమాసిక మెట్లోవాత్సవానికి సంబంధించి గురువారం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం నుంచి మూడోసత్రం వరకు శోభయాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బెంగుళూరు రాఘవేంద్ర స్వామి పీఠాధిపతి సువిద్యేంద్ర తీర్థస్వామి హాజరై అనుగ్రహ బాషణం చేశారు. శ్రీవారి మెట్లోత్సవం మోక్షప్రధాయిని అన్నారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా శ్రీవారిని దర్శించుకోవాలన్నారు. టిటిడి ఇ ఓ సాంబశివరావు మాట్లాడుతూ భజన మండళ్ల సభ్యులు సనాతన ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. ఈకార్యక్రమంలో టిటిడి పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, దాస సాహిత్యప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు పాల్గొని సువిద్యేంద్రతీర్థస్వామిని ఘనంగా సన్మానించారు.