చిత్తూరు

జిల్లాలో పరుగు పెట్టనున్న పారిశ్రామిక ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జనవరి 31: రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లాలో పలు పరిశ్రమలు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో సుమారు 13 వేల కోట్లతో సుమారు వంద పరిశ్రమలు ఏర్పాటుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. దీని కారణంగా రానున్న రోజుల్లో 90 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇటు తమిళనాడు, అటు కర్నాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఈ జిల్లా ఉంటడంతో వ్యాపార కార్యక్రమాలకు అనువుగా ఉండుందన్న ఉద్దేశంతో పలు కంపెనీలు ఈ దిశగా ఆసక్తి చూపాయి. దీంతో జిల్లా పారిశ్రామికంగా మరో అడుగు ముందుకు వేసే అవకాశం దక్కింది. ఇటీవల విశాఖపట్నం లో జరిగిన భాగస్వామ్య సదస్సులో పలు కంపెనీలు చిత్తూరు జిల్లాలో పలు పరిశ్రమల స్థాపనకు ఒప్పందం కుదుర్చు కొన్నాయి. ఇవి ఆచరణ రూపం దాల్చితే సుమారు 90 వేల మందికి ప్రత్యక్షంగాను మరో కొన్ని వందల మందకి పరోక్షంగాను ఉపాధి ఆవకాశాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలోని శ్రీసిటి పారిశ్రామిక వాడ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచి, వేలాదిమందికి ఉపాధి ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వంతో కుదుర్చు కొన్న ఒప్పందంతో జిల్లాలో చిత్తూరు, మదనపల్లి, తిరుపతి పరిసర ప్రాంతాల్లో పలు సంస్థలు తమ పరిశ్రమలను నెలకొల్పడానికి సన్నద్దం అయ్యాయి. ఈ పరిశ్రమల స్థాపన కోసం భూమలు గుర్తింపుకోసం అధికార యంత్రాగం సన్నద్దవౌతుంది.ప్రధానంగా మైనింగ్ , ఆహార శుద్ది, ఇతర రంగాలకు చెందిన పలు సంస్థలు జిల్లాలో కంపెనీలు ఏర్పాటుకు అంగీకారాన్ని తెలిపాయి. అలాగే విద్యా రంగంలోను జిల్లాకు తగిన ప్రాధాన్యత దక్కింది. చెన్నైకి చెందిన వేల్ టెక్ వర్సీటీ శ్రీకాళ హస్తివద్ద అంతర్జాతీయ స్థాయి వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటకు ప్రభుత్వంతో ఒప్పదం కుదుర్చు కొంది. జిల్లాలో రవాణా , లభ్యమయ్యే వనరులను సద్వినియోగం చేసుకొనే దిశగా పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అనేకసంవత్సరాలుగా మరుగున పడిన కుప్పం బంగారు శుద్ధి పరిశ్రమకు తిరిగి మోక్షం లభించింది. ఆస్ట్రేలియన్ ఇండియా రిసోర్స్ కంపెనీ కుప్పంలో బంగారు శుద్ధి పరిశ్రమలకు ఒప్పదం కుదుర్చు కొంది. ఈ జిల్లా ఆధ్యాత్మికంగాను, పర్యాటక పరంగా ప్రత్యేకతను చాటు కొంటున్న తరుణంలో ఈ దిశగాను పలు ప్రాజెక్టులు స్థాపనకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. తాజాగా శ్రీసిటిలో ఫైబర్ గ్రిడ్ ఉత్పత్తుల పరిశ్రమ స్థాపనకు డాట్ సన్ కంపెనీ సుమారు వంద కోట్లతో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొంది. ఆధ్యాత్మిక నగరంగా పేరొందిన తిరుపతితో నిత్యం భక్తుల తాకిటి ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఇక్కడ మహా హోటల్స్ గ్రూప్ పలు హోటళ్లు నిర్మించడానికి ముందుకు వచ్చింది. కోడల్ కార్పొరేషన్ కంపెనీ సుమారు 50 కోట్లతోపర్యాటక ప్రాజెక్టుతో పాటు ఇతర పార్కులు నెలకొల్పే దిశగా అడుగులు వేస్తుంది. పడమర ప్రాంతాల్లో పింగాణి పరిశ్రమ స్థాపనకు శ్రీనందాన్ గ్రానైట్ సంస్థ రంగంలోకి దిగింది. మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో మైనింగ్ కార్యక్రమాలు నిర్వహణ కోసం పలు సంస్థలు ముందుకు వచ్చాయి. తిరుపతిలో సుమరు పదికి పైగా సంస్థలు ఐటి, పర్యాటక, హోటళ్లు నిర్మాణానికి ఆసక్తి చూపాయి. ముఖ్యంగా శ్రీసిటిలోనే సుమారు ఇరవైకి పైగా కంపెనీలు సుమరు 700కోట్లతో పలు పరిశ్రమలు స్థాపనకు ముందుకు రావడం జరిగింది. జిల్లా లో మామిడి, టమోటో పంటలకు ప్రసిద్ధిగా ఉన్న తరుణంలో పలు ఆహార శుద్ది పరిశ్రమలు ఇక్కడ యూనిట్లు స్థాపనకు ముందుకు వచ్చినట్లు సమాచారం. జిల్లాలో పలు రకాల కంపెనీలు వందల సంఖ్యలో పరిశ్రమల స్థాపనకు కోసం ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చు కొన్నాయి. ఇవి అన్ని సక్రమంగా తమ కార్యాక్రమాలను నిర్వహిస్తే జిల్లా పారిశ్రామిక వాడగా ప్రత్యేకతను చాటు కోనున్నది. దీని వల్ల రానున్న రోజుల్లో కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే ఉన్న సమస్యలను అధిగమించి త్వరగా జిల్లా పారిశ్రామిక వాడగా ఎదగాలంటే అధికారులు క్షేత్ర స్థాయిలో అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంది. విశాఖ పట్నంలో ఇటీవల ప్రభుత్వం కుదుర్చు కొన్న ఒప్పందాలతో అన్ని కంపెనీలు తమ కార్యక్రమాలను ప్రారంభిస్తే జిల్లా రూపు రేఖలు మారిపోవడం ఖాయం. వీటి వల్ల తరుచూ కరవు కాటకాలతో అల్లాడి పోతున్న జిల్లావాసులకు పలు రకాలుగా ఉపాధి దక్కే అవకాశాలు మొండుగా ఉండే అవకాశం ఉంది.

వైభవంగా కలశ స్థాపన
* శ్రీకాళహస్తీశ్వరాలయ గాలి గోపురానికి నేడు కుంభాభిషేకం
శ్రీకాళహస్తి, జనవరి 31: శ్రీకాళహస్తిలో తిరిగి నిర్మించిన గాలిగోపురం కలశస్థాపన కార్యక్రమం మంగళవారం వైభవంగా జరిగింది. సోమవారం సాయంత్రం అంకురార్పణతో కుంభాభిషేకం కార్యక్రమం ప్రారంభం కావడం తెలిసిందే. కలశస్థాపనలో భాగంగా మంగళవారం ఉదయం గాలిగోపురం వద్ద వేద పండితులు హోమం నిర్వహించారు. ఆ తరువాత కలశాలకు పూజలు నిర్వహించి గోపురంపై స్థాపన చేశారు. మంగళవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కంచికామకోటి పీఠం ఉత్తరాధికారి విజయేంద్రసరస్వతి, దేవస్థానం ట్రస్టుబోర్డు ఛైర్మన్ గురవయ్యనాయుడు, బోర్డు సభ్యులు, ఇఓ భ్రమరాంబ పాల్గొన్నారు. బుధవారం కుంభాభిషేకం జరుగనుంది.

విద్యా రంగంలో ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు
* ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం ధ్వజం
తిరుపతి, జనవరి 31: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అభివృద్ధి పేరుతో ఒంటెద్దు పోకడలను అనుసరిస్తూ భ్రష్టుపట్టిస్తోందని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం మండిపడ్డారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఉద్యమానికి తన సంఘీభావాన్ని తెలిపారు. మంత్రి గంటా శ్రీనివాసరావు విదేశాల్లో పర్యటిస్తూ విద్యారంగాన్ని పరిరక్షిస్తామని, బలోపేతం చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర విద్యాశాఖ కనీసం ఎమ్మెల్సీలతోగాని, ఉపాధ్యాయ సంఘాలతోకాని సంప్రదించకుండానే ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. దీంతో విద్యారంగం అనేక సమస్యలతో సతమతమవుతోందని తెలిపారు. రానున్న శాసన మండలి సమావేశాల్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ప్యాప్టో రాష్ట్ర ప్రతినిధి గాజుల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి దశలవారీ ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. విద్యారంగ పరిరక్షణ పేరుతో ప్రభుత్వం అసంబద్ద జీఓలను జారీ చేస్తోందని తెలిపారు. ఆదర్శపాఠశాలలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదని మండిపడ్డారు. విద్యారంగం ముగుస్తున్న సమయంలో ఉపాధ్యాయుల సర్థుబాటు చర్య దారుణమని అన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియంను రద్దుచేసి ఆంగ్ల భాష బోధనను ప్రవేశ పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోందని విమర్శించారు. ప్యాప్టో జిల్లా నాయకులు ఎస్.వెంకటముని, ముత్యాలరెడ్డిలు మాట్లాడుతూ వెంటనే నూతన పెన్షన్ విధానాన్ని, ఉపాధ్యాయుల సర్ధుబాటు చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 10 నెలల పిఆర్సీని, రెండు విడతల డిఏను మంజూరు చేయాలన్నారు. ఈకార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు కె.్ధనంజయనాయుడు, జనార్థన్ రెడ్డి, విశ్వనాథం, మునిరామిరెడ్డి, రేణుకాదేవి, మునికృష్ణమనాయుడు, హరిబాబు, చిన్నస్వామి, నిర్మల, రామచంద్రయ్య, జగన్నాధం, మునేంద్రబాబు, మోహన్, మునిరామయ్య, రుక్మాంగధ, నాగేశ్వర నాయుడు, చంద్రశేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.