చిత్తూరు

నేడు కన్నప్ప ధ్వజారోహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, ఫిబ్రవరి 18: దక్షిణ కైలాసమైన శ్రీ కాళహస్తి క్షేత్రంలో ఆదివారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అంకురార్పణగా ఆదివారం మధ్యాహ్నం భక్తకన్నప్ప ధ్వజారోహణం జరుగనుంది. భక్తుడైన కన్నప్పకు మొదటి పూజ జరిగిన తరువాత పరమశివుడికి ధ్వజారోహణం జరగడం ఆనవాయితీగా ఉంది. కన్నప్ప ధ్వజారోహణం కోసం దేవస్థానం సిబ్బంది ఏర్పాట్లుచేస్తున్నారు. కొండపై ఉన్న కన్నప్ప ఆలయాన్ని తీర్చిదిద్దారు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను ఓడించడానికి అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సుచేశాడు. ఈ సందర్భంగా అర్జునుడ్ని పరీక్షించడానికి పరమశివుడు బోయవాడి వేషంలో వచ్చి పందిని వేటాడాడు. అర్జునుడు తపస్సు చేసుకుంటున్న ప్రాంతానికి పంది రాగా అర్జునుడు కూడా బాణం వేశాడు. ఇద్దరి బాణాలకు వరాహం చనిపోయింది. ఎవరుచంపారనే విషయమై ఇద్దరి మధ్య వాదన పెరిగి పరస్పరం యుద్ధానికి దిగారు. అర్జునుడు ఎన్ని బాణాలు వేసినా బోయవాణ్ణి ఏమీ చేయలేకపోయాడు. చివరకు పరమేశ్వరుడు ప్రసన్నుడై పాశుపతాశ్రాన్ని వరంగా ఇచ్చాడు. అయితే జరిగిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా మరుసటి జన్మలో అర్జునుడు బోయవాడైన తిన్నడుగా జన్మించాడు. శ్రీ కాళహస్తి సమీపంలోని ఉడుమోరు అనే గ్రామంలో నాథనాథుడు, తందే అనే బోయ దంపతులకు తిన్నడు జన్మించాడు. అడవి జంతువులను వేటాడటం నేర్చుకున్నారు. ఒకరోజు వేటాడుతూ అడవిలో ఉన్న శివలింగాన్ని చూసి పూర్వజన్మ గుర్తుకు వచ్చి శివలింగానికి పూజలుచేశాడు. శివుడు తిన్నడుని పరీక్షించడానికి కంటిలో రక్తం కారుతున్నట్లు చేయగా తన కన్నును బాణంతోతీసి శివలింగానికి అమర్చాడు. రెండో కంటి కూడా రక్తం రాగా తన రెండో కన్నును బాణంతో తీయడానికి ప్రయత్నిస్తుండగా పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ముక్తిని ప్రసాదించారు. భగవంతుడికే కన్నును దానం చేశాడు కాబట్టి కన్నప్ప అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. అంతేకాకుండా మొదటి పూజ కన్నప్పకు జరిగిన తరువాత స్వామికి పూజ జరగడం ఆనవాయితీగా ఉంది. బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణ సందర్భంగా ఆదివారం కన్నప్ప ధ్వజారోహణం జరుగనుంది.

సేవకు మరో రూపం నవజీవన్
* టిటిడి చైర్మన్ చదలవాడ
తిరుపతి, ఫిబ్రవరి 18: సేవకు మరో రూపం నవజీవన్ ఆస్పత్రని టిటిడి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, సంస్కృత విద్యాపీఠం విసి మురళీధర్ శర్మ, టిడిపి ఎన్ టి ఆర్ వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి అన్నారు. గత 20 సంవత్సరాలుగా అంధులు, వృద్ధులు, వికలాంగులు, అనాథలకు అందిస్తున్న సేవలను గుర్తించి ఇంటర్నేషనల్ పీస్ అండ్ ఫ్రెండ్‌షిప్ సొసైటీ నవజీవన్ నిర్వహకులు ధర్మాచార్యకు భారతజ్యోతి అవార్డును ఇటీవల రవీంధ్రభారతిలో అందించి సత్కరించారు. ఈ సందర్బంగా టిటిడి ఛైర్మన్ చదలవాడ శనివారం తిరుచానూరు రోడ్డులోని నవజీవన్ శరణాగతి వృద్దాశ్రమంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ధర్మాచార్య సేవలను కొనియాడారు. నవజీవన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ఎంతోమందికి ఉచితంగా శస్తచ్రికిత్సలు చేసి కంటి చూపు అందించిన సంస్థ అన్నారు. ముఖ్యంగా నవజీవన్ ఆస్పత్రికి వస్తున్న రోగుల పట్ట వారు చూపుతున్న ప్రేమ అందిస్తున్న సేవలు నిరుపమానమైనవన్నారు. కాగా సేవ పురస్కార్ అందుకున్న సాంబశివరావును, సేవరత్న అందుకున్న వెంకటరత్నను, ఇందిరా పురస్కార్ అందుకున్న శ్రీనివాస్‌ను కూడా వారు ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో విద్యాపీఠం విసి మహదేవన్, ఆడిటర్ వరదరాజన్, నవజీవన్ మేనేజర్ శ్రీనివాసన్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.