చిత్తూరు

తిరుమలలో భక్తులను మోసం చేసిన దళారీ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 20: కర్ణాటకకు చెందిన ఇద్దరు శ్రీవారి భక్తులకు రూ.1000 విలువచేసే రెండు ఎల్-2 టికెట్లను రూ.11,400కు విక్రయించిన మోసం చేయడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాళహస్తికి చెందిన రవికిరణ్‌ను తిరుమల వన్‌టౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కర్ణాటకకు చెందిన కోదండపాణి అనే భక్తుడితో రవికిరణ్ మరో వ్యక్తి ద్వారా పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు. ఈక్రమంలో వి ఐ పి దర్శనం చేయిస్తానని రూ.11,400 తన బ్యాంకులో వేయాలని తెలిపాడు. ఈ మేరకు భక్తులు కిరణ్ పంపిణ అకౌంట్‌లో నగదును జమచేశారు. సోమవారం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. వారికి వి ఐ పి దర్శనం టికెట్లను కిరణ్ అందించాడు. దర్శనానంతరం ఆలయం ముందుకు వచ్చిన వీరు ఒక్కో టికెట్‌పై రూ.500 ఉండటంతో తాము మోసపోయామని గుర్తించారు. వెంటనే టిటిడి ఏ వి ఎస్ ఓ కు ఫిర్యాదు చేశారు. ఆయన తిరుమల వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. భక్తుల నుంచి ఆధారాలు సేకరించిన పోలీసులు రవికిరణ్‌ను అరెస్టు చేశారు. కాగా రవికిరణ్ ఈ టికెట్లను ఎవరి పేరుమీద తీసుకున్నాడన్నదానిపై విచారణ చేపట్టారు.

లైసెన్స్‌లేని మెడికల్ షాపు సీజ్
నాగలాపురం, ఫిబ్రవరి 20: మండలంలో గత కొంతకాలంగా లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ షాపును సోమవారం తిరుపతి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కీర్తన, మదనపల్లి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ హనుమాన్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి మెడికల్ షాపును లైసెన్స్ లేకుండా వెంకటేశ్వర్లు నిర్వహించడమే కాకుండా కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. వీటిని స్వాధీనం చేసుకుని మెడికల్ షాపును సీజ్ చేసినట్లు చెప్పారు.

నాగలాపురంలో చోరీ
నాగలాపురం, ఫిబ్రవరి 20 : మండల కేంద్రం నాగలాపురంలోని సాయినగర్‌లో సోమవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఎస్‌ఐ మునస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంజుల అనే మహిళ తన ఇంటికి తాళం వేసి పశువులను మేతకు తీసుకెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చే సరికి ఇంటి బీగాలు పగుల గొట్టి బీరువాలోని మూడు సవర్లు బంగారు, 300 గ్రాముల వెండి పట్టీలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.