చిత్తూరు

శ్రీవారి దర్శనం ఆత్మ సంతృప్తినిచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 20: తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనం ఆత్మ సంతృప్తినిచ్చిందని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుమలకు వచ్చిన గవర్నర్ సోమవారం ఉదయం తిరుమలేశుని దర్శించుకున్నారు. ఆయనకు టిటిడి ఇవో సాంబశివరావు, జెఇవో శ్రీనివాసరాజులు దర్శన ఏర్పాట్లు చేశారు. క్షేత్ర సాంప్రదాయాన్ని అనుసరించి ముందుగా శ్రీ వరాహస్వామిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి హుండీలో ముడుపులు చెల్లించి, ధ్వజస్థంభానికి నమస్కరించుకుని రంగనాయక మండపానికి చేరుకున్నారు. వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా, ఇ ఒ వారికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. అనంతరం గవర్నర్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కోనేటి రాయుడి దర్శనం ఆత్మ సంతృప్తిని ఇచ్చిందని వెల్లడించారు. ఈ నూతన సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందంగా, సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని ప్రార్థించి న్నట్లు చెప్పారు.

నేడు తెలంగాణ సిఎం కెసిఆర్ రాక

తిరుపతి, ఫిబ్రవరి 20: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు మంగళవారం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకోనున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే స్వామివారికి రూ.5 కోట్లు విలువచేసే బంగారు సాలిగ్రామ హారం, కంఠాభరణాలను ప్రభుత్వ నిధులతో చేయిస్తానని తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ ప్రకటించిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవడం, ఆ తరువాత ఎన్నికలు జరిగి కెసిఆర్ అధికార పగ్గాలు చేపట్టి మూడేళ్లు పూర్తికావస్తోంది. ఈ నేపథ్యంలో అనేక పర్యాయాలు ఆయన తిరుమలకు వస్తారని ప్రచారం సాగినా పలు కారణాలతో ఆయన పర్యటన వాయిదాపడుతూ వచ్చింది. చివరికి గత నెల్లో కూడా కెసిఆర్ తిరుమలకు వస్తారని జరిగిన ప్రచారం కూడా తెలిసిందే. అయితే ఎట్టకేలకు కెసిఆర్ రెండు రోజుల తిరుమల పర్యటన మంగళవారం ఖరారైంది. మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయననేరుగా కారులో తిరుమలకు బయలుదేరి వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేసి బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా ఆయన తన వెంట తీసుకువచ్చిన రూ.మూడు కోట్ల 70 లక్షల వ్యయంతో 14.200 కేజీల బరువు కలిగిన సాలిగ్రామ హారం, కోటి 20 లక్షలతో 5 కేజీల బంగారుతో తయారుచేసిన కంఠహారాన్ని ఆయన స్వామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఈ ఆభరణాలను తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని కీర్తిలాల్ బంగారు ఆభరణాల తయారు సంస్థలో ప్రత్యేకంగా తయారు చేశారు. ఇందుకు సంబంధించి టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది. కెసిఆర్ తన మొక్కు తీర్చుకున్న తరువాత ఉదయం 9.50 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి 10.30 గంటలకు తిరుచానూరులో జరగనున్న తెలంగాణ సివిల్ సప్లై చైర్మన్ సుదర్శన్‌రెడ్డి వివాహానికి హాజరవుతారు. 11 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా అమ్మవారికి వజ్రం పొదిగిన బంగారు ముక్కపుడకను సమర్పించుకుంటారు. 12.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. ఆయన వెంట కుమారుడు, మంత్రి కెటిఆర్, మంత్రులు ఈటెల, పద్మారావు, ఐకె రెడ్డి, అల్లుడు, మంత్రి హరీష్‌రావు, కూతురు, ఎంపి కవిత తదితరులు రానున్నారు.