చిత్తూరు

ఎట్టకేలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల తుది జాబితా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఫిబ్రవరి 20: చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది. జిల్లాల వారిగా ఈ జాబితాను మంగళవారం అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే, ఇందుకుగాను జనవరిలో ఈఓటర్ల జాబితాను అధికారులు తయారుచేసి విడుదల చేసారు. ఇందులో భారీగా బోగస్ ఓట్లు ఉన్నాయిని కొందరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు, హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు నామినేషన్ల పర్వం పూర్తయ్యేలోగా ఏలాంటి తప్పిదాలు లేని ఓటర్ల జాబితాను సిద్దం చేసి సమర్పించాలని ఆదేశించింది. దీంతో ఈ మూడు జిల్లాకు చెందిన అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టారు. ఓటర్ల దరఖాస్తులతో పాటు జత చేసిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి బోగస్ ఓటర్లను తొలగించారు. ఇందుకోసం అధికార యంత్రాగం కసరత్తు చేసింది. దీంతో ఆదివారం వరకు వడపోత కార్యక్రమం కొనసాగింది. ఎట్టకేలకు తుది జాబితాను తయారు చేసి ఎన్నికల సంఘానికి సమర్పించారు. అయితే ఈ ఓటర్ల జాబితా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి నందుకు ఈ జిల్లాకు చెందిన 40 మంది మండల విద్యాశాఖాధికారులకు , మరో 10 మంది తాహశీల్దార్లకు షోకాజ్ నోటీసులుజారీ చేసారు. ఎన్నికల ఓటర్ల జాబితాను జిల్లా వారిగా అధికారులు విడుదల చేయడానికి చర్యలు చేపట్టారు.

29కి చేరిన ఎమ్మెల్సీ నామినేషన్లు
* పట్ట్భద్రులకు 20, టీచర్లకు 9 నామినేషన్లు దాఖలు
* టీచర్ల టిడిపి అభ్యర్థిగా వాసుదేవనాయుడు నామినేషన్ దాఖలు
* ముగిసిన నామినేషన్ల గడువు

చిత్తూరు, ఫిబ్రవరి 20: చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం పట్ట్భద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారంతో నామినేషన్ పర్వం ముగిసింది. మొత్తం 29మంది అభ్యర్థులు తమ నామినేషన్‌ను దాఖలు చేశారు. ఇందులో ఉపాధ్యాయ స్థానానికి 9మంది, పట్ట్భద్రుల స్థానానికి 20మంది చొప్పున నామినేషన్లు వేయడం జరిగింది. చివరి రోజు అయిన సోమవారం 9మంది నామినేషన్లు వేసారు. ఇందులో ముగ్గురు ఉపాధ్యాయ స్థానానికి, ఆరుగురు పట్ట్భద్రుల స్థానాలకు ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వజియాబేగం ఎదుట నామినేషన్ సమర్పించారు. సోమవారం ఉపాధ్యాయుల స్థానానికి టిడిపి అభ్యర్థిగా మదనపల్లె ఉప విద్యాశాఖాధికారి వాసుదేవనాయుడు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే టీచర్ స్థానానికి ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఎం రామిరెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన ఎన్ రామయ్య నామినేషన్‌లు దాఖలు చేశారు. పట్ట్భద్రుల స్థానానికి ప్రకాశం జిల్లా కనిగిరి మండలంకు చెందిన కె నారాయణరెడ్డి, ఇదే జిల్లాకు చెందిన వి సోమిరెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన ఎస్‌కె కరీమూల్లా, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఉప్పురాజేష్‌రాయల్ చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన కె అమరేంద్ర, చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన చంద్రమోహన్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 11మంది చొప్పున ప్రకాశం, చిత్తూరు జిల్లా వాసులు నామినేషన్ దాఖలు చేయగా ఏడుగురు నెల్లూరు జిల్లా వాసులు ఉన్నారు. మంగళవారం ఈనామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు.