చిత్తూరు

స్థానిక ఎమ్మెల్సీకి నోటిఫికేషన్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఫిబ్రవరి 21: జిల్లా స్థానికి సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిలక నోటిఫ్ కేషను విడుదలైంది. మంగళవారం ఈ ఎన్నిలక రిట్నరింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ గిరిషా నోటిఫికేషన్ ను విడుదల చేసారు. తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు, ఈసందర్భంగా జెసి మాట్లాడుతూ ఈ ఎన్నికలను వచ్చేనెల 17న నిర్వహించడం జరుగుతుందన్నారు. నామినేషన్లను ఈనెల 28వరకు స్వీకరించడం జరుగుతందని, వచ్చెనెల ఒకటవ తేదిన నామినేషన్ల పరిశీలన, రెండు , మూడు తేదిల్లో ఉపసంహరణ పక్రియ కొనసాగుతుందన్నారు. అభ్యర్థులు జిల్లాకలెక్టర్ కార్యాలయంలోనే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటలకు వరకు నామినేసన్లను స్వీకరించడం జరగుతుందన్నారు. నామినేషన్‌వేసే అభ్యర్థులు డిపాజిట్‌గా పదివేల రూపాలను జమచేయాల్సి ఉంటుందని. ఎస్సీ ఎస్టీలైతే ఐదువేలను చెల్లించాలని తెలిపారు. నామినేషన్ దాఖలుచేసే వారిని ఈఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న పదిమంది ప్రతిపాదించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ఎన్నికలను జిల్లాలోనే మూడు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిర్వహించడం జరగుతుందన్నారు. ఇందులో జడ్పిటీసిలు, ఎంపిటిసీలు, కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారన్నారు. ఈమూడు డివిజన్ పరిధిలోను ఓటర్లు పొలింగ్ రోజున వారి పరిధిలోని డివిజన్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో 1168 మంది ఓటర్లుగా గుర్తించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 65 మంది జడ్పిటీసిలు , 851 ఎంపిటీసిలు, 48 మంది కార్పొరేటర్లు, 164 కౌన్సిలర్లు ఉన్నట్లు తెలిపారు. ఈ ఎన్నిలకు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.

చిన్నారిపై అత్యాచారం
* పోలీసుల అదుపులో నిందితుడు
నాగలాపురం, ఫిబ్రవరి 21: చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెళ్లూరు గ్రామానికి చెందిన వేలు కుమారుడు అరుల్ (20) నాగలాపురం ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో మొదటి సంవత్సరం ఇంటర్ చదువుతున్నాడు. ఇతను ఓ చిన్నారి (6)ను ఈ నెల 14వ తేదీన చాక్లెట్ ఇచ్చి తన ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారికి రక్తస్రావం కావడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే తల్లిదండ్రులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా విషయం తెలుసుకన్న నిందితుడు పరారయ్యాడు. దీనిపై 20వ తేదీన రాత్రి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు తమిళనాడు చెన్నైలో దాక్కున్న అరుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందలేదని, స్థానికుల సమాచారంతో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే నిందితుడిని అరెస్ట్ చేస్తామని ఎస్‌ఐ తెలిపారు. ఇలా చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
తల్లిదండ్రుల ఆశయాలను పిల్లలు నెరవేర్చాలి
* గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ రవీంద్రనాథ్
సత్యవేడు, ఫిబ్రవరి 21: తల్లిదండ్రుల ఆశయాలను పిల్లలు నెరవేర్చాలని గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్టినేటర్ రవీంధ్రనాథ్ అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన వీడ్కోలు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని చదువుకోవాలన్నారు. రానున్న పబ్లిక్ పరీక్షల్లో అందరూ బాగా పరీక్షలు రాసి తల్లిదండ్రులకే కాకుండా కళాశాలకు కూడా రాష్టస్థ్రాయిలో మంచిపేరు తీసుకురావాలన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ సుమిత్రదేవి మాట్లాడుతూ విద్యార్థులు పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని బాగా చదువుకోవాలన్నారు. అదేవిధంగా మునుపటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం పెంచాలన్నారు. అనంతరం విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని సరస్వతీ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నాగరాజు, ఎంఇఓ రవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
‘జిల్లాలో డెంగ్యూ నివారణకు రేపిడ్ యాక్షన్ బృందాలు’
తిరుపతి, ఫిబ్రవరి 21: చిత్తూరు జిల్లాలో డెంగ్యూ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ఈ వ్యాధి నివారణకు రేపిడ్ యాక్షన్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాంతీయ వైద్య, అరోగ్య సంచాలకులు డాక్టర్ దశరధరామయ్య, మలేరియా సహాయ సంచాలకులు రామనాథం, డిఎం ఓ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో డెంగ్యూ వ్యాధి నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అత్యవసర సమావేశం జరిగింది. నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి ఉషకుమారి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, సబ్ యూనిట్ ఆఫీసర్లు, హెల్త్ ఎక్జికేటర్లు, మంగళం పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ కాజల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపిడ్ యాక్షన్ బృందాలు నగరంలోని ప్రతి వార్డును సందర్శించాలని స్పష్టం చేశారు. డెంగ్యూపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఫాగింగ్, స్ప్రెయింగ్ వంటి నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా స్థానిక కపిలతీర్థం రోడ్డు, హరేరామ హరేక్రిష్ణ రోడ్డులోని పాఠశాల విద్యార్థులకు హెల్త్ ఎగ్జికేటర్‌లు ఎం రాళపతి, కిరణకుమార్, రాజేశ్వరి, కామరాజులు, డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ అవగాహన కల్పించారు.
పాడిపేట గృహ నిర్మాణాలు తనిఖీ చేసిన కమిషనర్
తిరుపతి, ఫిబ్రవరి 21: తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని పాడిపేట వద్ద జరుగుతున్న గృహ నిర్మాణం పనులను నగరపాలక సంస్థ కమిషనర్ వి వినయ్‌చంద్ మంగళవారం తనిఖీ చేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ ఇంజినీర్లు చంద్రశేఖర్, జయభారత్‌రెడ్డి తదితరులున్నారు.

‘శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు’
సత్యవేడు, ఫిబ్రవరి 21: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సత్యవేడు ఆర్టీసీ డిపో నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సురేష్‌బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కైలాసకోనకు రెండు, అవంతికోనకు 6, సదాశివకోనకు 16 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆయన అన్నారు. ఈ బస్సులు ఈ నెల 23, 24, 25వ తేదీల్లో అందుబాటులో ఉంటాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

తిరుపతిలో అభివృద్ధిపనులపై ప్రిన్సిపల్ సెక్రటరీ సమీక్ష
తిరుపతి, ఫిబ్రవరి 21: తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఏపి రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాలవల్వన్ సమీక్షించారు. విజయవాడలోని మున్సిపల్ పరిపాలనాభవనం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిషనర్ వినయ్‌చంద్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా నగరంలోని అర్హులైన పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణం గురించి అడిగి తెలుసుకున్నారు. వీధి శునకాల బెడదపై కూడా ఆయన సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీతోపాటు డిఎం కన్నబాబు పాల్గొనగా, తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉప కమిషనర్ కె భాగ్యలక్ష్మి, కార్యదర్శి, ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు.