చిత్తూరు

గుర్తింపుకార్డులో ఫొటో స్పష్టత లేక గ్రూప్ 2 పరీక్ష రాయలేకపోయిన విద్యార్థిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 26: గ్రూప్ 2 పరీక్ష రాసి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనుకున్న ఆమె నిర్లక్ష్యమో, దురదృష్టమో కాని గుర్తింపు కార్డుపై ఫొటో స్పష్టంగా లేకపోవడంతో అధికారులు అనుమతించని కారణంగా పరీక్ష రాయలేకపోయింది. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ అధికారుల కాళ్లు పట్టుకుని బతిమాలిన
సంఘటన అందరినీ కలచివేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాళహస్తి ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన రజిత గ్రూప్ 2 పరీక్ష రాయడానికి తనకు కేటాయించిన శ్రీ పద్మావతి మహిళ జూనియర్ కళాశాల వద్దకు అరగంట ముందే చేరుకుంది. ఉదయం 10గంటలకు పరీక్ష ప్రారంభం కావడానికి ముందు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. ఈసమయంలో ఆమె వద్ద ఉన్న హాల్‌టికెట్, ఆధార్ గుర్తింపు కార్డును అధికారులు పరిశీలించారు. ఆధార్‌కార్డులో రజిత ఫోటో సరిగా కనిపించక పోవడంతో పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో రజిత కనీళ్లు పెట్టుకుంటూ తన ఆధార్‌కార్డు నెంబర్ ఆధారంగా ఆన్‌లైన్లో పరిశీలించాలని కోరింది. తనకు ఈ అవకాశం కోల్పోతే భవిష్యత్తు ఉండదని కళాశాల ప్రిన్సిపాల్ కాళ్లను పట్టుకుని అభ్యర్థించింది. అయితే నిబంధనలు పాటించడం తప్ప ఏమి చేయలేమంటూ తేల్చి చెప్పేశారు. అదే సమయంలో పోలీసులు సైతం నిర్దయగా అక్కడ నుంచి వెళ్లిపోవాలని గద్దించి చెప్పడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడ నుంచి వెనుతిరిగింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి మద్దతుదారులను గెలిపించండి
* మంత్రులు నారాయణ, గంటా పిలుపు

చిత్తూరు, ఫిబ్రవరి 26: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల విజయానికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో పిఆర్‌టియు ఉపాధ్యాయ కార్యవర్గ సమావేశం జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షుడు గిరిప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ఛాలెంజ్‌గా తీసుకుందన్నారు. ఈ ఎన్నికల్లో విధిగా టిడిపి బలపరుస్తున్న అభ్యర్ధులు విజయం సాధించేందుకు పార్టీ శ్రేణులు, ఉపాధ్యాయ సంఘాలు కృషి చేయాలన్నారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది టిడిపి ప్రభుత్వమేనని తెలిపారు. ముఖ్యంగా ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది, బదిలీల్లో కౌన్సిలింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది కూడా టిడిపి ప్రభుత్వమేనని తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఉద్యోగులకు పిఆర్‌సితో పాటు పదవీవిరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచిన ఘనత కూడా టిడిపికే దక్కిందన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తున్న టిడిపికి ఈ ఎన్నికల్లో అండగా నిలవాలన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీలు ఉద్యోగుల సంక్షేమానికి చేసింది శూన్యమేనన్నారు. ప్రస్తుతం వీరిపట్ల నేడు ఉద్యోగ ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీ శ్రేణులు, ఉపాధ్యాయ సంఘాలు ఓటర్లను చైతన్యవంతులు చేసి టిడిపి మద్దతుదారులు విజయం సాధించేవిధంగా కృషి చేయాలన్నారు. ఎన్నికలకు వ్యవధి తక్కువగా ఉన్న నేపథ్యంలో సమయం వృధా చేయకుండా పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఓటర్లను ఆకర్షించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాస్, టిడిపి బలపరుస్తున్న అభ్యర్థి వాసుదేవనాయుడు, పిఆర్‌టియు నేత శ్రీనివాసరాజు, తెలుగుదేశం నేతలు దొరబాబు, నాని, బద్రినారాయణ, ఎన్‌జివో సంఘ నేత కృష్ణమనాయుడు, ఉపాధ్యాయ సంఘాల నేతలు రజనిబాబు, రవి, గుణశేఖర్ రెడ్డి, మధుసూదన్, ప్రకాష్‌రెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాబూ! అందరినీ ఎక్కువ కాలం మోసం చేయలేరు
* భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరిక

తిరుపతి, ఫిబ్రవరి 26: కొందరిని కొంతకాలమే మోసం చేయవచ్చని అయితే సి ఎం చంద్రబాబు నాయుడు అందరినీ ఎంతోకాలం తన మాయ మాటలతో మోసం చేయవచ్చని భావిస్తున్నారని అయితే అది సాధ్యం కాదని వైకాపా రాష్ట్ర నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. కాపు సంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్షకు మద్దతుగా తిరుపతిలోని నాలుకాళ్ల మండపం వద్ద బలిజ సేవాసమితి ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్షను నిర్వహించారు. కాపు సంఘం రాష్ట్ర నాయకుడు పోకల అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షకు మద్దతు పలికిన భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా బాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. అయితే తాను అన్నీ చేసినట్లు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే మూడేళ్లు గడిచిపోయాయని అయితే ఇప్పటి వరకు బలిజ, కాపులను బిసి జాబితాలో చేరుస్తానని ఇచ్చిన హామీ ఒక కొలిక్కికూడా రాలేదన్నారు. తమ మాయమాటలతో బలిజ, కాపుల ఓట్లు దండుకున్న బాబు నిజస్వరూపం త్వరలోనే బయటపడతుందని ఆ రోజు ఆయన ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. కాపు రాష్ట్ర నాయకుడు పోకల అశోక్‌కుమార్ మాట్లాడుతూ సి ఎం చంద్రబాబు నాయుడు కేవలం అధికారం హస్తగతం చేసుకునేందుకే బలిజ, కాపులను బిసి జాబితాలో చేరుస్తానని హామీ ఇచ్చారని ఆరోపించారు. ఇందుకోసం మంజునాథ కమిషన్ వేసి గతేడాది డిసెంబర్‌లోగా నివేధిక తెప్పించుకుని బిసి జాబితాలో చేరుస్తానని చెప్పినా ఇప్పటి వరకు ఆపని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అసలు మంజునాథ కమీషన్ ఎప్పుడు నివేధిక ఇస్తుందో, తాను బలిజలకు ఇచ్చిన హామీని ఎప్పటిలోగా నెరవేరుస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాకాకుండా తన ఐదేళ్ల పదవీకాలం పూర్తయ్యాక తిరిగి వచ్చే ఎన్నికల్లో తిరిగి ఈ హామీని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తారా అనే విషయం కూడా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాపు కార్పొరేషన్ ద్వారా ఇప్పటి వరకు ఎంత మందికి లబ్ది చేకూర్చారో బాబు ప్రకటించాలన్నారు. ఒక్క తిరుపతిలోనే 200 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటే కనీసం 20 మందికి కూడా రుణాలు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. ఇలా ఒకరిద్దరికి రుణాలిచ్చి వెయ్యికోట్లు ఇచ్చానని చెప్పుకోవడం సరికాదని అన్నారు. వెంటనే బలిజ, కాపులను బిసి జాబితాలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. అంత వరకుతమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో బలిజ సంఘ నాయకులు ముద్రనారాయణ, కిషోర్, లక్ష్మీపతి రాయల్, కృష్ణమూర్తిరాయల్, నాగరాజు, లలితాదేవి, లక్ష్మీకాంతమ్మ, శివ, సంపత్ పాల్గొన్నారు.
తప్పిపోయిన బాలికను తల్లి ఒడి చేర్చిన పోలీసులు

తిరుపతి, ఫిబ్రవరి 26: ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళకుండా రోడ్లపై తిరుగుతూ ఏడుస్తున్న బాలికను ఈస్ట్‌పోలీసులు ఆదివారం ఆమె తల్లి వద్దకుచేర్చారు. ఇందులో సమాజిక మాద్యం కీలక పాత్ర పోషించడం గమనార్హం. స్థానికుల కథనం మేరకు స్థానిక వినాయక స్కూల్లో 3వ తరగతి చదువుతున్న రాణి తన ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ తరువాత ఇంటికి వెళ్లలేకపోయింది. అయితే తన కుమార్తె తప్పిపోయిన విషయాన్ని రమణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి విషయాన్ని సమాజిక మాద్యంలో ఉంచారు. కాగా ఆదివారం స్థానిక రాయల్ చెరువు రోడ్డులో దయనీయ స్థితిలో ఉన్న రాణిని గుర్తించిన స్థానికులు ఆవిషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను తిరిగి అమ్మ ఒడికి చేర్చారు. కాగా తాముసైతం సామాజిక మాధ్యమాల్లోని బాలిక ఫోటోను చూసి గుర్తించామని చెప్పారు.
ఆదర్శ పాఠశాలగా తయారుచేస్తాం
* పథకం సిద్ధం చేయండి
* మంత్రి గోపాలకృష్ణారెడ్డి
శ్రీ కాళహస్తి, ఫిబ్రవరి 26: 50ఏళ్ల క్రితం 10వ తరగతి చదివిన వారికి కలుసుకోవడం ఆనందంగా, ఆశ్చర్యంగా ఉందని రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం తన స్వగ్రామమైన శ్రీ కాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోజరిగిన స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత పాఠశాల కోసం ఇప్పటి వరకు 5 ఎకరాల స్థలం ఉందని, అవసరమైతే మరో 5 ఎకరాలు కేటాయిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న కార్యాలయ భవనం శిథిలం అయిపోయిందని, కొత్త్భవనాన్ని నిర్మించాలన్నారు. అంతేకాకుండా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వేదికను కూడా ఏర్పాటుచేసుకోవాలన్నారు. ఇందుకోసం పథకాలను సిద్ధంచేస్తే నిధులు మంజూరుచేయిస్తామన్నారు. ఇదే గ్రామానికి చెందిన బొజ్జల గంగసుబ్బరామరెడ్డి 1965లో ఎమ్మెల్యే అయిన తరువాత 66వ సంవత్సరంలో ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. 1967లో ఎస్‌ఎస్‌ఎల్‌సి చదివిన విద్యార్థినీ విద్యార్థులు, ఆ తరువాత చదివిన వారు ఉత్సవంలో పాల్గొన్నారు. 50 ఏళ్లక్రితం తీసుకున్న ఫోటోను చూస్తూ పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన ప్రసాదరావు, రంగనాథం, ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పలువురు పాల్గొన్నారు.

మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి బీజం వేసిన ఎన్టీఆర్
* స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్
* పలు అంశాలపై మహిళా విశ్వ విద్యాలయంతో ఒప్పందాలు
తిరుపతి, ఫిబ్రవరి 26: మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ సిమ్స్‌తోపాటు, మహిళా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటుచేసి ఆనాడే బీజాలు వేశారని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టి.ఎస్.రవికుమార్, శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయ విసి ఆచార్య దుర్గ్భావానీ అన్నారు. స్విమ్స్ 24వ వార్షికోత్సవాన్ని ఆదివారం స్థానిక మహతి ఆడిటోరియంలో వారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ 1986లో స్విమ్స్ ఏర్పాటుకు భూమి పూజ చేశారని, 1993, ఫిబ్రవరి 26 ప్రారంభమై దినదినాభివృద్ధి చెంది నేటితో 24 సంవత్సరాలు పూర్తి చేసుకుందని అన్నారు. ఆరోగ్య పరిరక్షణ విధానాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు ఒక ప్రణాళికతో ముందుకు వెడుతున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే ఒక ఏటా సంస్థగా రూపొందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. స్విమ్స్‌కు అనుబంధంగా కార్డియాక్, క్యానె్సర్ అలైడ్, న్యూరో,రినాల్ సైనె్సస్‌లు, ట్రామ ఎనర్జీకేర్, ట్రాన్స్‌ప్లాంటేషన్ రిజెనరేషన్ మెడిసిన్స్ అండ్ జియోట్రిక్స్‌ను టిటిడి సహకారంతో నెలకొల్పతున్నట్లు వెల్లడించారు. ఇందులో బాగంగా శ్రీ పద్మావతి మహిళ విశ్వ విద్యాలయంతో విద్య, పరిశోధన రంగాల్లో అభివృద్ధిని సాధించాలన్న సంకల్పంతోపరస్పర ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్సలర్ దుర్గ్భావానీ మాట్లాడుతూ దివంగత ఎన్‌టిఆర్ ఏర్పాటు చేసిన ఈ రెండు సంస్థలు ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి చేరకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, విజ్ఞానాన్ని అందించడానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈసందర్భంగా విధి నిర్వహణలో ప్రతిభను చాటిన ఫ్యాకల్టీ డాక్టర్ డాక్టర్ అల్లాడిమోహన్, బిసిఎం ప్రసాద్‌ను బంగారు పతకాలతో సత్కరించి అభినందించారు. అలాగే స్విమ్స్ యూనివర్శిటీలో అకడమిక్ రంగంలో విశేషంగా రాణించిన విద్యార్థినీ విద్యార్థులకు జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు.
త్రిశూల స్నానంతో ముగిసిన కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, ఫిబ్రవరి 26: శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం త్రిశూల స్నానంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో బాగంగా ఉదయం 7 గంటలకు శ్రీ స్వామివారు నటరాజ స్వామిగా అలంకృతులై సూర్యప్రభ వాహనంపై కొలువుదీరారు. సర్వాలంకార భూషిడతుడైన స్వామిని ఆలయం ముందున్న నంది సర్కిల్ వరకు మాత్రమే ఊరేగించి తిరిగి ఆలయానికి వేంచేపు చేశారు. అనంతరం ఆలయ పుష్కరిణిలో ఉదయం 10.30గంటలకు త్రిశూల స్నానాన్ని శైవాగమోక్తంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈకార్యక్రమంలో నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పుణ్యసాన్నాలు ఆచరించారు. అనంతరం ఆలయంలో శివపార్వతులు, గణపతితో పాటు త్రిశూలానికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తెనె, కొబ్బరి నీళ్ళు, చందనం, కుంకుమ, విభూది తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. ఈకార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం 6 నుంచి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణ కార్యక్రమం జరిగింది. కాగా రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య రావణాసుర వాహన సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి సుబ్రమణ్యం, సహాయ కార్యనిర్వహణాధికారి శంకరరాజు, సూపరింటెండెంట్ ఓబుల్‌రెడ్డి, టెంపుల్ ఇన్స్‌పెక్టర్లు నారాయణ, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.