చిత్తూరు

వేదనారాయణస్వామి పాదాలను తాకిన సూర్య కిరణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగలాపురం, మార్చి 26: మండల కేంద్రంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు సూర్యాస్తమయంలో శ్రీ వేదనారాయణ స్వామి వారి పాదాలను సూర్యకిరణాలు తాకాయి. ఈ సందర్భంగా భక్తులు చేసిన గోవింద నామస్మరణలతో ఆలయం మారుమోగింది. సాయంత్రం 6గంటలకు స్వామివారి పాదాలను తాకే సూర్యకిరణాలను దర్శించుకునేందుకై మధ్యాహ్నం 2గంటల నుంచి భక్తులు ఆలయం వద్ద వేచి ఉండటం గమనార్హం. దాదాపు 5వేల మంది భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయింది. అధికారులు తీసుకున్న ముందస్తు జాగ్రత్తల కారణంగా ఎక్కడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఈనెల 24వ తేదీ నుంచి ఆలయంలో సూర్యపూజ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్న విషయం విధితమే. ఇందులో బాగంగా ఉదయం 7 నుంచి 7.30 గంటల వరకు లక్ష్మీనరసింహస్వామి వారికి తిరుమంజనం ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు ఉత్సవ మూర్తులకు అత్యంత వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు సీత, లక్ష్మణ సమేత కోదండరామ స్వామివారికి అత్యంత వైభంగా తెప్పొత్సవం నిర్వహించాక, 7.30 నుంచి 9.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్స్‌పెక్టర్ నందకుమార్, షరాబు ఉదయ్‌కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజ భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, మార్చి 26: స్థానిక బొమ్మగుంటలోని వీరభద్రస్వామి వారి ఆలయంలో ఆదివారం నుంచి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయానే్న స్వామివారికి అభిషేకం, తొలిపూజ కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం 6గంటలకు వీరభద్ర స్వామి వారి ఊరేగింపును కన్నుల పండుగగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, డప్పులు మోతలు, పిల్లంగట్లు, కోలాటాలు, వీరభద్రప్రభలు, గంగిరెద్దుల విన్యాసాలు వైభవంగా జరిగాయి. ఈకార్యక్రమంలో ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టిడిపి వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, టిడిపి నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

పన్నుల వసూళ్ల వేటను కొనసాగిస్తున్న నగరపాలక సంస్థ
తిరుపతి, మార్చి 26: నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వం తరపున అనేక సౌకర్యాలు పొందుతూ అందుకు చెల్లించాల్సిన పన్నుల చెల్లింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొంతమంది పట్ల నగరపాలక సంస్థ కొరడా ఝుళిపిస్తోంది. నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి మరింత పెరగాలంటే చట్టపరంగా పన్నులను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయడంలో కమిషనర్ వినయ్‌చంద్ ప్రత్యేక బాట పట్టారు. నోటీసులు బేఖాతర్ చేస్తున్న వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. మొండికేస్తే నగరపాలక సంస్థ ఇచ్చే సౌకర్యాలను కూడా వెనుకాడకుండా తొలగిస్తున్నారు. దీంతో మొండి బకాయిదారులు కూడా మరోదారి లేక పన్నుల చెల్లింపుపై దృష్టిసారిస్తున్నారు. అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉండటానికి ఆస్కారం లేకుండా ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటుచేసి వారిని పన్నుల వసూళ్లకు పురమాయిస్తున్నారు. ఈక్రమంలో 2016-17 ఆర్థిక సంవత్సరానికి భవన యజమానులు, వ్యాపారస్థులు, ఆస్తిపన్ను, నీటి పన్ను, యుడిఎస్‌చార్జీలు, ట్రేడ్ చార్జీలు, ప్రకటనల పన్నులను సకాలంలో చెల్లించాలని హెచ్చరిస్తున్నారు. ఈనెల 31వ తేదీలోపు ఈసేవ కేంద్రాల్లోకాని, నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఆన్‌లైన్ సెంటర్‌లోకాని ఉదయం 8 నుంచి రాత్రి 8గంటల వరకు పన్నులు వసూలు చేసేందుకు ఏర్పాటు చేశారు. ఈనెల 29వ తేదీ ఉగాది రోజులన సెలవుదినమైనా పన్నులు చెల్లించేందుకు ప్రజలకు తగిన ఏర్పాట్లు చేశారు. పన్నులు చెల్లించకపోతే స్థిరాస్తులను జప్తు చేయడమేకాకుండా సంస్థ కల్పించే వౌళిక సదుపాయాలను తొలగిస్తామని హెచ్చరించారు.