చిత్తూరు

21న తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 11: ప్రతి సంవత్సరం వైశాఖ బహుళదశమినాడు తిరుమల క్షేత్రంలో ఘనంగా నిర్వహించే సాలకట్ల హనుమజ్జయంతి వేడుకలు ఈ యేడాది ఈనెల 21న అత్యంత వైభవంగా జరుగనున్నాయి. శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి, శ్రీ వరాహస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ కోనేటిగట్టు ఆంజనేయస్వామివారికి కాలినడకబాటలో ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి వారికి హనుమజ్జయంతి నాడు విశేషంగా అభిషేక, అర్చన, నివేధనలు జరుపబడుతాయి. తిరుమలలోని జాపాలి తీర్థంలో కూడా హనుమజ్జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించబడుతోంది. ఆరోజు ఉదయం అభిషేకం, అర్చన, అలంకార, నివేధనలు జరుపబడతాయి. ఈ హనుమజ్జయంతినాటికి భక్తులు హనుమదీక్షతో తిరుమల చేరుకొని జాపాలి తీర్థంలో దీక్షను విరమిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొంటారు. కాగా మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి ఆరోజు సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు టిటిడి నిర్వహిస్తోంది. ఈనేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు టిటిడి భక్తుల సౌకర్యార్థం ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించింది. తిరుమలలోని స్థానికులు, భక్తులు తిరుమల నుంచి ఏడవమైలుకు తిరిగి తిరుమల చేరడానికి ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టిటిడి మనవి చేస్తున్నది.

గంగజాతరలో ఆకతాయిల అక్రమ వసూళ్లు

తిరుపతి, మే 11: తిరుపతి గంగజాతర వచ్చిందంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సంబరపడతారు. చాటింపు తరువాత రోజూ వేషాలు వేసుకుని అమ్మవారి ఆలయానికి చేరుకుని దర్శించుకోవడం ఆనవాయితీ. కేవలం తిరుపతికి చెందిన వారే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. అలాగే శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు సైతం అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే ఈ జాతర సందర్భంగా కొందరు నగరంలో అంబళ్ళు, మజ్జిగ, అన్నదానం చేస్తారు. ఈ పరిస్థితుల్లో కొందరు అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారు. కొందరు యువకులు మహిళల వేషం వేసుకుని దుకాణాల వద్ద, తోపుడు బండ్ల వద్ద బలవంతంగా డబ్బులు గుంజుతున్నారు. ఎవరైనా ఇవ్వడానికి నిరాకరిస్తే గంగజాతర సాకులో బూతులు తిడుతున్నారు. ఎంతోకొంత ఇస్తే తప్ప అక్కడ నుంచి కదలడంలేదు. అయితే మహిళ వేషధారులు ఈ సమయంలో కొంత శృతి మించి ప్రవర్తిస్తున్న తీరుపట్ల మహిళలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మద్యం సేవించిన వారు మరింత శృతి మించి వ్యవరిస్తుండటం అభ్యంతరకరంగా మారుతోంది. దీనిపై పోలీసులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు, భక్తులు కోరుతున్నారు.