చిత్తూరు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 23: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని టిటిడి సివి ఎస్వీ ఆకె రవికృష్ణ తెలిపారు. శనివారం ఆయన సెంట్రలైజ్డ్‌కమాండ్ కంట్రోల్ రూం నుంచి సిసి కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షించే విధానాన్ని ఆయన మీడియా ప్రథినిధులకు వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో 700 సిసి కెమెరాలు అమర్చామని, తమ సిబ్బంది ప్రతిరోజూ 24 గంటలపాటు సెంట్రలైజ్డ్‌కమాండ్ కంట్రోల్ రూం నుండి వాటిని పర్యవేక్షిస్తారని తెలిపారు. మాడ వీధులు, గొల్లమండపం,వాహన మండపం, గ్యాలరీలు తదితర ముఖ్యమైన ప్రాంతాల్లో ఉన్న 154 సిసి కెమెరాల ద్వారా పరిశీలిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటుచేశామన్నారు. భక్తులు టోల్ ఫ్రీ నెంబర్ 18004251111కు ఫోన్ చేస్తే తమ సిబ్బంది తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటారన్నారు. ఈకార్యక్రమంలో టిటిడి ఏజి ఓ రవీంద్రారెడ్డి, సెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రలోరూమ్ ఇన్‌చార్జ్ గిరిధర్, ఏవి ఎస్వో చిరంజీవి ఇతర అధికారులు పాల్గొన్నారు.

మోదీ ఆకర్షణ ఏపిలో బిజెపికి వరం

తిరుపతి, సెప్టెంబర్ 23: ప్రధాని మోదీ మూడున్నరేళ్లలో అమలుచేసిన 111 పథకాలు ప్రజాదరణ పొందాయని, ఏపిలో బిజెపి బలం పెరగడానికి మోదీ ఆకర్షణ ఎంతోవుందని ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో బిజెపిని మరింత పటిష్టం చేసే దిశగా జాతీయపార్టీ దృష్టి సారించిందన్నారు. దక్షిణాదిన ఉన్న 130 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బిజెపి బలహీనంగా ఉన్న విషయం గుర్తించి ప్రతి ఐదు నియోజకవర్గాలకు ఒక ఎంపికి కేటాయించడం జరిగిందన్నారు. వీరు ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా కృషిచేస్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బడుగు, బలహీన వర్గాల నుంచి ఎన్నడూలేని విధంగా సానుకూల స్పందన లభిస్తోందన్నారు. బడుగు, బలహీన వర్గాల నుంచి టిడిపి, వైకాపా, కాంగ్రెస్ పార్టీలకు సరైన నాయకత్వం లేకపోవడం తమకు కలిసివచ్చే అంశమన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాయలసీమ జిల్లాల్లో పర్యటించి పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేయబోతున్నారని తెలిపారు. ఈసమయంలోనే ఇతర పార్టీల నుంచి వచ్చే మంచి వారిని సైతం బిజెపిలోకి ఆహ్వానించనున్నట్లు సురేష్‌రెడ్డి వెల్లడించారు. కాగా, కేంద్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తనవిగా చెప్పుకునే పరిస్థితి ఉందన్నారు. నేడు కేంద్రప్రభుత్వ నిధులు, సంబంధం లేకుండా ఏపిలో ఒక్కపని కూడా జరగడంలేదని ఆయన అన్నారు. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి ప్రవేశపెట్టిన పథకాలను ఆయన వివరిస్తూ వీటిని కేంద్రప్రభుత్వ పథకాలుగానే కొనసాగించాలని, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటప్పుడు ప్రధాని మోదీ చిత్రం ఉండేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న చంద్రన్న బీమా పథకం ప్రధానమంత్రి చంద్రన్న బీమా పథకంగానే ఉండాలన్నారు. అదే సమయంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో, నీరు-చెట్టు పథకం అమలులో అనేక అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, దీనిని అరికట్టి, అక్రమార్కులను కఠినంగా శిక్షించాల్సిన అవసర ఉందని చెప్పారు. ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో కట్టడి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈవిలేఖరుల సమావేశంలో బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జల్లి మధుసూధన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరి, బిజెపి జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి గుండాల గోపినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.