చిత్తూరు

పారిశ్రామిక హబ్‌గా తూర్పు మండలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, అక్టోబర్ 13: జిల్లాలోని తూర్పు మండలాలను పారిశ్రామిక హబ్‌గా తయారుచేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి వెల్లడించారు. శుక్రవారం శ్రీకాళహస్తికి వచ్చిన ఆయన ఇటీవల మరణించిన మునిసిపల్ చైర్మన్ రాధారెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తరువాత టిడిపి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీకి హాజరయ్యారు. పట్టణంలోని భిక్షాల గాలిగోపురం వద్ద మహాత్మాగాంధీ, ఎన్‌టి రామారావు, రాధారెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని తూర్పు మండలాలు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, మరికొన్ని పరిశ్రమలు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. దీని వలన స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అన్ని వసతులు కల్పిస్తున్నదని, త్వరగా అనుమతులు మంజూరుచేస్తున్నదని చెప్పారు. ఇటీవల మరణించిన చైర్మన్ రాధారెడ్డి పట్టణ అభివృద్ధికి, తెలుగుదేశం పార్టీకి ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. ఆయన మరణం వలన పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. అనంతరం టిడిపి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు నాని, పార్టీ నాయకులు పార్థసారధి, సుధీర్‌రెడ్డి, శ్రీ్ధర్‌వర్మ, జై గోపాల్, మునిసిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మునిసిపల్ సమావేశంలో సంతాపం
పురపాలక సంఘం ఆధ్వర్యంలో చైర్మన్ రాధారెడ్డి సంతాపసభ కార్యక్రమం జరిగింది. వైస్ చైర్మన్ పార్థసారధి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు రాధారెడ్డి సేవలను కొనియాడారు. ఆయన మృతికి సంతాపం తెలియజేశారు.