చిత్తూరు

ఢాం... ఢాం...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి / మదనపల్లె, అక్టోబర్ 13: మరో ఐదురోజుల్లో దీపావళి పండుగను ఘనంగా జరుపుకోవాలని ప్రజలు ఉబలాటపడుతున్నారు. అదే సమయంలో టపాకాయలు విక్రయించి సొమ్ము చేసుకోవడానికి వ్యాపారులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో టపాకాయులు అమ్మే వ్యాపారులు తాము కొన్న టపాకాయలపై 25శాతం జిఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో విక్రయించే టపాకాయలపై కూడా 25శాతం జిఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. అదే జరిగితే రూ. 1000 టపాకాయలపై రూ. 500 జిఎస్టీని వ్యాపారులు వదిలించుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ దీపావళి పర్వదినాన టపాకాయాల వ్యాపారం చేయదలచుకున్న వ్యాపారులు తామీ వ్యాపారం చేయలేం బాబు అంటున్నారు. చిరు వ్యాపారులైతే తక్కువ లాభాలకు టపాకాయలను విక్రయిస్తుంటారు. తాజాగా ఏర్పడ్డ ఈ నిబంధనతో బడా వ్యాపారులు మాత్రమే టపాకాయల విక్రయాలు జరిపే పరిస్థితి ఉంది. అదే జరిగితే టపాకాయలు కొనే వినియోగదారుల జేబుల్లో జిఎస్టీ ఆటం బాంబు పడటం ఖాయం. ఇప్పటికే టపాకాయల ధరలు ఎలా ఉంటాయోనన్న సామాన్యుడికి ఈ జిఎస్టీ దెబ్బతో ఇంట్లో దీపాలు వెలిగించుకోవడం తప్ప టపాకాయలు కాల్చలేని పరిస్థితి తప్పదని తేలిపోయిందని పలువురు నిరాశకు గురవుతున్నారు. గతంలో జిల్లాలో 258 విక్రయ సెంటర్లుకు అనుమతి ఇవ్వగా, ఈ ఏడాది 270 సెంటర్లుకు అనుమతి తీసుకున్నారు. ఎక్కువగా తిరుపతిలో 47, చిత్తూరులో 37, మదనపల్లె 27, శ్రీకాళహస్తిలో 18, పుత్తూరులో 12, పీలేరులో 10, పుంగనూరులో 14, పలమనేరులో 10, కుప్పంలో 10 సెంటర్లులకే కాకుండ మండలకేంద్రాలలో అక్కడక్కడా విక్రయాలకు అనుమతి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాలలో అసోసియేషన్‌ల ద్వారా సిండికేట్ అయినట్లు తెలుస్తోంది. జిల్లాలో తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పలమనేరు, పుత్తూరు, శ్రీకాళహస్తి, నగరి, పీలేరు, కుప్పం, వాల్మీకిపురం, పుంగనూరు, ములకలచెరువు కేంద్రాలు ఐక్యమై అసోసియేట్ అయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. గత యేడాదితో పోలిస్తే వ్యాపారులు ఈయేడాది ఏకంగా 30శాతం వరకు ధరలు పెంచేశారు. ఉత్పత్తుల ధరకు ఇటీవల పెరిగిన పన్నులు, జిఎస్‌టి వంటివాటిని కలుపుకుని ధరలు విపరీతంగా పెరిగినట్లు చెబుతున్నారు. ఐదేళ్ళుగా ప్రతిఏటా వ్యాపారం జిల్లావ్యాప్తంగా రూ.30కోట్లుకు పైగా జరిగేవి. ఈ ఏడాది మదనపల్లి పట్టణంలో మాత్రం సుమారు రూ.5కోట్లుకు పైగా టపాకాయల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఈఏడు ధరలు బాగా పెంచుతూ ప్రత్యేక కాంతులతో వెదజల్లే కంపెనీ టపాకాయలను మార్కెట్‌లో వుంచారు. సాధారణంగా వ్యాపారులు లక్ష్మీ, కోకిల, డబుల్ సౌండ్, పారాచూట్, లేజర్ షో క్రాకర్స్, తౌజన్ వాలా, ఫైవ్ తౌజన్ వాలా, టెన్ తౌజన్ వాలా, స్క్రై రైడర్, స్ట్రీట్ టువల్ షాట్స్, బురుసులు, కాకరొత్తులు, వెన్నముద్దలు, చిన్నసైజు పటాసులు తదితరాలు మార్కెట్‌లో యధావిధిగా అందుబాటులో వుంచారు. అంతేకాకుండా అంత్యంత ఆధునీరకణంగా కాంతులు ఆకాశంలో వెదజెల్లే చైనాటపాకాయలు అందుబాటులో ఉంచారు.
జిల్లాలో టపాకాయల విక్రయాలపై అధికారులు అలెర్ట్
గత ఏడాది సంఘటనలను దృష్టిలో ఉంచుకుని జిల్లాకలెక్టర్ ప్రద్యుమ్న, జిల్లా ఎస్‌పి రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో అనుమతి లేని వారు విక్రయాలు జరిపినా, నిబంధనలకు అతిక్రమించి వ్యాపారులపై చర్యలు కఠినంగా తీసుకునేందుకు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈనెల 17 నుంచి 21వ తేది వరకు విక్రయాలు జరుపుకునేందుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. టపాకాయల విక్రయాల వద్ద అగ్నిమాపక వాహనం, 108, పోలీసులు, మండల రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తుండే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది.

రద్దయిన పెద్ద నోట్ల మార్పిడి కోసం కేంద్రాన్ని సంప్రదిస్తున్నాం
* విదేశీ కరెన్సీ మార్పిడికోసం ప్రత్యేక దృష్టి * టిటిడి ఇఓ ఎకె సింఘాల్ వెల్లడి

తిరుపతి, అక్టోబర్ 13: భక్తులు శ్రీవారి హుండీలో సమర్పించిన పెద్ద నోట్లకు సంబంధించి కేంద్రంతో నిరంతరం ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తున్నట్లు టిటిడి ఇఓ ఎకె సింఘాల్ వెల్లడించారు. శుక్రవారం పరకామణి సేవను మరింతగా మెరుగు పరిచేందుకు సమావేశమైన ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్లు రద్దై గడువు పూర్తయినా హుండీలో సమర్పించిన కానుకల ద్వారా రూ. 25 కోట్లు టిటిడి వద్ద నిల్వ ఉండిపోయాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ నోట్ల మార్పిడికి ఆర్బీఐతో సంబంధం లేదని, కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన విదేశీ భక్తులు హుండీల్లో సమర్పిస్తున్న విదేశీ నాణేలు, కరెన్సీ మార్పిడిపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. నాణేలకు సంబంధించి టన్నుల కొద్దీ టిటిడి వద్ద నిల్వ ఉందన్నారు. కొన్ని దేశాలకు సంబంధించిన నాణేలైతే 8 నుంచి 9 టన్నులు నిల్వ ఉందన్నారు. అయితే వీటిని తీసుకోవడానికి బ్యాంకులు కూడా ముందుకు రావడంలేదన్నారు. అందుకు సంబంధించి నాణేల బరువు ఎక్కువగా ఉండటం, రవాణా ఖర్చులు ఎక్కువగా ఉండటంతో కనీస విలువ కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. అయినా వాటిని ఎలా మార్పు చేయవచ్చో యోచిస్తున్నామన్నారు. ఇక డాలర్లు, యూరో రూపంలో ఉన్నవాటిని మార్చుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.