చిత్తూరు

లంచం ఇస్తే జైలట.. తీసుకున్న వారి అరెస్టుకు ప్రభుత్వ అనుమతి కావాలట..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 23: దేశంలో అవినీతిని రూపుమాపుతామంటున్న పాలకులు నేడు అవినీతిని రక్షించేలా చట్టాలు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని, ఇందులో భాగంగానే లంచం ఇచ్చేవారికి మూడు నుంచి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించడానికి చట్టం తీసుకువస్తూ, అదే చట్టంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వారిపై కేసులు పెట్టాలంటే మాత్రం ప్రభుత్వ అనుమతి తీసుకోవాలంటూ అవినీతి పరులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ ధ్వజమెత్తారు. సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై లోక్‌సత్తా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి నడం బిగిస్తుందన్నారు. ప్రజల నుంచి చెల్లిస్తున్న పన్నులను పాలకులు ఏం చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. ప్రజలు పన్నులు కడుతుంటే పాలకులు పెత్తనం చేస్తున్నారని తెలిపారు. కేంద్రానికి రాష్ట్రం నుంచి 21లక్షల 46వేల కోట్లు పన్నుల రూపంలో అందుతుంటే అందులో నుంచి రాష్ట్రానికి 10లక్షల 85కోట్లు తిరిగి వస్తోందన్నారు. ఈ డబ్బులు ఏమవుతున్నాయో, ఎలా ఖర్చు చేస్తున్నారో తెలియడంలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేసిన పోరాటం ఫలితంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు వస్తున్న పన్ను ఆదాయం ఈ స్థాయిలో ఉంటుందని ఆయన కూడా ఊహించి ఉండడన్నారు. రాష్ట్రప్రభుత్వానికి స్థానిక సంస్థలు చెల్లిస్తున్న పన్నుల్లో ఎంతో కొంత వాటాను తిరిగి ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే అభివృద్ధి ఆగకుండా సాగుతుందని చెప్పారు. నేడు ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం రూ.60వేలు ఖర్చు చేస్తోందని, అయితే అందుకు తగ్గ చదువులు విద్యార్థులకు అందడంలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు విద్యార్థుల చదువులకు పొంతన కుదరడంలేదని చెప్పారు. 8వ తరగతి చదువుతున్న వారిలో కనీసం చదవడంరాని వారు తీసివేతలు, భాగహారాలు చేయలేని వారి సంఖ్య భారీగానే ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం ఉన్నత చదువులు చదువుకుని సమాజంలోకి వస్తున్న లక్షలాది మంది యువకులకు సరైన ఉపాధి చూపించకపోతే జాతే ప్రమాదంలో పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే నేడు సర్వీసెస్ గ్యారెంటీ యాక్ట్‌ను తీసుకురావాల్సి ఉందన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో లోకసత్తాపార్టీ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల కన్వీనర్ బండారు రామ్మోహన్‌రావు, రాష్ట్ర కార్యదర్శి సుబ్రమణ్యం, నగర కార్యదర్శి బెల్లం కొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు.