చిత్తూరు

సిఎం సహాయ నిధి పేదలకు వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వి.కోట, అక్టోబర్ 23: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సిఎం సహాయనిధి ఓ వరమని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి అమరనాధ్‌రెడ్డి తెలిపారు. వి.కోట అంబేద్కర్ నగర్‌కు చెందిన తంగరాజ్ కుమార్తె సౌందర్య స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో తొమ్మిదోతరగతి చదువుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న బాలికకు చెన్నై అపోలో ఆసుపత్రిలో అప్పుచేసి వైద్యం చేయించారు. స్థానిక టిడిపి నేతల సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయించారు. మంత్రి అమరనాధ్‌రెడ్డి చొరవతో లక్ష రూపాయలు సహాయ నిధి నుంచి చెక్‌ను పలమనేరు మంత్రి తంగరాజ్‌కు అందించారు. ఈసందర్భంగా స్థానిక నేతలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ ఎఎంసి చైర్మన్ రామచంద్రనాయుడు, జడ్పిటిసి నాగవేణి తదితరులు పాల్గొన్నారు.

క్రీడలు స్నేహానికి, శాంతికి చిహ్నాలు
* ఎంపి వరప్రసాద్ వెల్లడి
బుచ్చినాయుడుకండ్రిగ, అక్టోబర్ 23: చదువులు, ఆటలు రెండింటిలోనూ ప్రతిభ చూపాలని, స్నేహానికి, శాంతికి చిహ్నాలు క్రీడలని తిరుపతి ఎంపి వరప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం చిత్తూరు జిల్లా పాఠశాలల క్రీడాసమైక్య ఆధ్వర్యంలో 63వ రాష్టస్థ్రాయి అండర్-14 బాలబాలికల ఖోఖో టోర్నీ ముగింపు పోటీలకు ఆయనతో పాటు సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలుర విభాగంలో ప్రకాశం జిల్లాపై చిత్తూరు జిల్లా, బాలికల విభాగంలో కడపజిల్లాపై ప్రకాశం జిల్లా జట్లు గెలుపొందాయి. గెలుపొందిన జట్లు మహారాష్టల్రో జరుగనున్న జాతీయ ఖోఖోపోటీలకు ఎంపికయ్యాయి. గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కన్నయ్యనాయుడు, బుచ్చినాయుడుకండ్రిగ మండల జడ్పిటిసి సముద్రాల సునీత సుధాకర్‌నాయుడు, తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు మావిళ్లపల్లి సుధాకర్‌నాయుడు, గ్రామసర్పంచ్ చెంచయ్య, ప్రధానోపాధ్యాయురాలు విజయకుమారి, ఉపాధ్యాయులతో పాటు టిడిపి నాయకులు మునెయ్యనాయుడు, విజయులునాయుడు, మహేంద్ర నాయుడు, రమేష్‌బాబు, మునిరాజా, గోపయ్య, పెంచులయ్య, ఈశ్వరయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఎసిబి వలలో అవినీతి అధికారి
* రూ.20వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇఇ
సత్యవేడు, అక్టోబర్ 23: లంచం.. మామూళ్లకు.. అలవాటు పడ్డ ఓ అవినీతి అధికారిని ఎసిబి అధికారులు సోమవారం పట్టుకున్నారు. నియోజకవర్గ హెడ్‌క్వార్టర్ అయిన సత్యవేడు గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం ఉప విభాగం కార్యాలయంలో ఎఇఇగా పనిచేస్తున్న ప్రేమ్‌కుమార్ రూ.20వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కాడు. తమకు ముందుగా అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరిపినట్లు తిరుపతి ఎసిబి డిఎస్పీ శంకర్‌రెడ్డి వెల్లడించారు. అనంతరం ఎసిబి డిఎస్పీ పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ మండల పరిధిలో ఉన్న రాజగోపాలపురం గ్రామంలో 2017 మే నెలలో ఏర్పడ్డ తాగునీటి కొరతను తీర్చేందుకు పక్కగ్రామాల నుంచి ట్రాక్టర్ ద్వారా ఆ గ్రామసర్పంచ్ గ్రామస్థులకు నీటి సరఫరా చేశారన్నారు. అందుకు సంబంధించిన బిల్లులు మంజూరుకు పలు ధపాలుగా ఎఇఇ వద్దకు వస్తే ఆయన లంచం అడిగారని, రాజగోపాలపురం సర్పంచ్ రాధిక భర్త రోశయ్య ఫిర్యాదు మేరకు దాడులు జరిపి కేసులు పెట్టామన్నారు. అవినీతి అధికారికి సంబంధించిన పూర్తిస్థాయి రికార్డులను పరిశీలిస్తున్నామన్నారు. ప్రజల కోసం పనిచేసే ఏ అధికారి అయినా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా ఎసిబి డిఎస్పీ ప్రజలను కోరారు. లంచం అడిగితే వెంటనే 9440446190, 9440446138 నెంబర్లకు ఫిర్యాదుచేయాలన్నారు. కాగా 2014లోజరిపిన ఎసిబి దాడుల్లో 8 కేసులకు శిక్షలు పడ్డాయని, 2015లో ఒక కేసుకు శిక్షపడగా 4 కేసులు ఫెయిల్ అయ్యాయన్నారు. అదేవిధంగా 2016లో 4 కేసులకు శిక్షలు పడగా 2 కేసులను కొట్టివేశారన్నారు. 2017లో 5 కేసులకు శిక్షలు పడగా 2 కేసులను కొట్టివేసినట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో ఇన్స్‌పెక్టర్లు చంద్రశేఖర్, విజయ్‌కుమార్, గిరిధర్, ప్రసాద్, ఎసిబి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి
పీలేరు, అక్టోబర్ 23: పీలేరు-కడప జాతీయ రహదారిలో పొంతలచెరువు ఘాట్ వద్ద సోమవారం రాత్రి ద్విచక్రవాహనం, కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎస్‌ఐ సుధాకర్ రెడ్డి కథనం మేరకు పీలేరుకి చెందిన తేజోనిధి నాయుడు(56), సోమిరెడ్డి (65)లు ద్విచక్ర వాహనంపై గారెంపల్లె నుంచి పీలేరుకు వస్తుండగా కడపకు వెడుతున్న కారు అతివేగంగా వీరిని ఢీకొనింది. ద్విచక్రవాహనంపై వెడుతున్న సోమిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ తేజోనిధి నాయుడిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. వీరి మృతదేహాలను పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇద్దరు రౌడీషీటర్ల హత్యకేసులో ఏడుగురు నిందితులు అరెస్టు
* పరారీలో మరో ఇద్దరు * రిమాండ్‌కు తరలింపు
మదనపల్లె, అక్టోబర్ 23: ఇద్దరు రౌడీషీటర్లను హతమార్చిన కేసులో ఏడుగురు నిందితులను అరెస్టుచేసినట్లు సోమవారం మదనపల్లె డిఎస్‌పి చిదానందరెడ్డి తెలిపారు. చిత్తూరుజిల్లా మదనపల్లె రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు హత్య కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తంబళ్ళపల్లె మండలం ఎర్రసానిపల్లె పంచాయతీ ఎర్రమద్దివారిపల్లెకు చెందిన జగదీశ్వర్‌రెడ్డి అలియాస్ జగ్గా 2010లో దండురవి హత్య కేసులో, 2015 అమ్మచెరువుమిట్టలో చేనేత కార్మికుడు అనంతరవి హత్య కేసులో, 2016 గుర్రంకొండలో జరిగిన సాంబశివ హత్య కేసులో ప్రధాన నిందితుడు. అమర్‌నాధ్ అలియాస్ ప్రదీప్ అలియాస్ అమర్ 2014లో పూల వెంకటాచలపతి హత్య కేసులో, 2016లో సాంబశివ హత్య కేసులో నిందితుడు. వీరిద్దరూ గతనెల 29న రాత్రి కురబలకోట మండలం పెద్దపల్లె సమీపంలోని మామిడి తోటలో హత్యకు గురయ్యారు. కాగా, ఈ కేసు విచారణలో భాగంగా అంగళ్ళులో జగ్గా కారు, శివారెడ్డికి చెందిన స్కార్పియో, జీపును, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని, శివారెడ్డి, అలియాస్ శివశంకర్‌రెడ్డి, సింహా అలియాస్ వెంకటరమణ, వెంకటేష్ అలియాస్ మహేష్, యోగానందరెడ్డి, మునిరాజ అలియాస్ పులి, రెడ్డిబాస్కర్, పూల వెంకటరమణను సోమవారం వేకువజామున అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టి అరెస్టు చేసినట్లు డిఎస్‌పి చిదానందరెడ్డి వెల్లడించారు. ఇంకా విచారణ జరుగుతోందని, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో సిఐ మురళీ, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, సునీల్‌కుమార్‌రెడ్డిలు ఉన్నారు.