చిత్తూరు

సీపీఐ నేతలు, కార్యకర్తల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 19: ప్రత్యేకహోదా సాధన సమితి పిలుపుమేరకు సోమవారం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించి శాసన సభల ముట్టడికి సిద్ధంగా ఉన్న సీపీఐ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లిల్లో దాదాపు 170మందిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెడితే ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని ఆరోపిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి సీపీఐ ఈనెల 20న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ముట్టడికి సిద్ధమైన నాయకులు, కార్యకర్తలపై దృష్టిసారించిన పోలీసులు ఆదివారం ఉదయం నుంచి వారిపై కనే్నసి ఉంచారు. రాత్రికి రైళ్లలో విజయవాడకు బయలు దేరాల్సి ఉండగా సాయంత్రం తిరుచానూరు పంచాయతీ, ఏబి బర్ధన్ కాలనీలో సమావేశం జరుగుతున్న సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి జిల్లా కార్యదర్శి రామానాయుడుతోపాటు ముఖ్య నాయకులందరినీ అరెస్టు చేశారు. మిగిలిన వారిని లక్ష్మీపురం కాలనీ వరకు నడిపించుకుంటూ తీసుకువచ్చి వాహనాల్లోకి ఎక్కించి ఈస్ట్‌పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా స్టేషన్ ముందు నిరసనకు దిగిన సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ తీరును, పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని అన్నారు. ఏపి భవిష్యత్తును బాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పోలీసులు అత్యుత్సాహంతో విద్యార్థులను సైతం అరెస్టు చేయడం దారుణమన్నారు. అరెస్టులకు తాము భయపడేదిలేదని స్పష్టం చేశారు. తిరుపతిలో అరెస్టు అయిన వారిలో సీపీఐ నాయకులు పెంచలయ్య, రాధాక్రిష్ణ, రత్నమ్మ, మంజుల, శివ బండి చలపతి, శశి, శివారెడ్డి, వెంకటేష్ తదితరులు ఉన్నారు.