చిత్తూరు

పెళ్లిళ్లకు తప్పని ‘జీఎస్‌టీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మధుర జ్ఞాపకానికి తప్పని పన్నుపోటు
* జిల్లా వ్యాప్తంగా వారం వ్యవధిలో ఆరువేలకు పైగా వివాహాలు
* 18 శాతం వడ్డింపులతో నిర్వాహకులపై రూ.5 కోట్ల అదనపు భారం
* అయినా వెనకడుగు వేయని పేద, మధ్యతరగతి కుటుంబాలు
మదనపల్లె, నవంబర్ 22: ప్రతి ఒక్కరి జీవితం మధురానుభూతిగా మిగిలిపోయే వివాహ వేడుకకు జీఎస్‌టీ భారంగా పరిణమించింది. ఎంత కష్టమైనా..ఎన్ని అప్పులైనా వివాహాన్ని ఉన్నంతలో ఎంతో ఆర్భాటంగా చేయాలని అందరూ భావిస్తారు. జీవితంలో అత్యంత కీలకమైన వివాహ ఘట్టాన్ని జీవితాంతం మధురస్మృతిగా గుర్తుండేలా వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించేలా ప్రతి ఒక్కరూ తాపత్రయపడతారు. సాధారణంగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు పెళ్లి చేస్తున్నారంటే ఎంతో కొంత అప్పు చేయక తప్పదు. నగదు రూపంలో కాకపోయినా వస్తువులు, ఇతర కొనుగోళ్లు, చెల్లింపులు..ఇలా ఏదో రూపంలో అప్పు చేయడమో, లేక అరువుకు తీసుకురావడమో చేస్తుంటారు. ఇలాంటి వివాహ వేడుకలకు జీఎస్‌టీ భారంగా మారింది. మార్గశిర మాసం ప్రారంభంలో ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయి. పెళ్లిళ్లకు 23, 24, 25వ తేదీలలో ముహూర్తాలు ఉండటంతో జిల్లా పరిధిలో సుమారు ఆరువేలకు పైగా వివాహాలు జరగబోతున్నాయి. ఈ ముహూర్తాలు గడిచిపోతే వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు లేకపోవడంతో పెళ్లి కుదిరిన వారు ఈ ముహూర్తాలలోనే చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ముహూర్తాలలో వివాహం చేసేందుకు వీలుగా చాలావరకు రెండునెలల క్రితమే ఫంక్షన్‌హాల్స్, కేటరింగ్, వివాహ తంతు నిర్వహించే పురోహితులను మాట్లాడుకున్నారు. అవసరమైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేయగా, వివాహ వేదిక అలంకరణకు డెకరేషన్, విందు భోజనానికి కేటరింగ్ నిర్వాహకులకు ఫొటోలు, వీడియోగ్రఫీకి ఇదివరకే ఆర్డర్లు ఇచ్చేశారు. ప్రస్తుతం వివాహం చేయాలంటే ఎంతలేదన్నా రూ.5 లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఖర్చుకావడం సర్వసాధారణం. పేదలైతే రూ.5 లక్షలు, మధ్యతరగతి ప్రజలైతే రూ.15లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. జీఎస్టీ ప్రభావంతో రూ.5 లక్షలు ఖర్చు చేసే వారిపై అదనంగా మరో లక్ష రూపాయల వరకు ఆర్థికంగా భారం పడుతుండగా, రూ.10 లక్షలు ఖర్చు చేసే వారిపై అదనంగా రూ.2 లక్షలు, రూ.15 లక్షలకు మించిచే అదనంగా రూ.3 లక్షలు భారం పడుతోంది. బంగారు ఆభరణాలపై 3శాతం జీఎస్‌టీ విధిస్తుండగా, శుభలేఖలపై 12శాతం జీఎస్‌టీ ఉంది. ఫంక్షన్‌హాల్స్, డెకరేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ తదితర వివాహ సేవలు 18శాతం జీఎస్‌టీ పరిధిలో ఉన్నాయి.

అశ్వ వాహనంపై లోకరక్షిణి విహారం
తిరుపతి, నవంబర్ 22: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఆఖరిదైన అశ్వవాహన సేవ బుధవారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు సాగింది. కల్కి అవతారంలో అమ్మ భక్తులను అనుగ్రహించింది. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణించారు. ఆలమేలుమంగ అన్ని కోర్కెలను తీర్చడంలో ఒకే ఒక ఉపాయంగా, సౌలభ్యంగా ఆర్ష వాఙ్మయం తెలియజేస్తోంది. పద్మావతీ శ్రీనివాసుల తొలి చూపు వేళ, ప్రణయవేళ సాక్షిగా అశ్వం నిలిచింది. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవాభాగ్యాన్ని పొందుతున్న భక్తులకు కలిదోషాలు ఉండవని భక్తుల నమ్మకం. అదేవిధంగా బుధవారం ఉదయం అమ్మవారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వాహన సేవల్లో పెద్దజీయర్, చిన్నజీయర్, టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జేఈఓ పోలా భాస్కర్, సీవీఎస్వో ఆకె రవికృష్ణ, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ మునిరత్నం రెడ్డి, వీజీఓ అశోక్‌కుమార్ గౌడ్, సహాయ కార్యనిర్వహణాధికారి రాధాకృష్ణ, ఏవీఎస్వో పార్థసారథి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బంగారు చీరలో అమ్మవారి దర్శనం
పంచమి తీర్థాన్ని పురస్కరించుకుని గురువారం అమ్మవారి మూల మూర్తికి అలంకరించే బంగారు చీరను బుధవారం ఉదయం అలంకరిచారు. బంగారు చీరలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అమితానందాన్ని పొందారు. గురువారం కూడా అమ్మవారు బంగారు చీరలో దర్శనమిస్తారు.

చెరకు రైతులు, కార్మికుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా?
* బకాయిలు చెల్లించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం
* నగరి ఎమ్మెల్యే రోజా హెచ్చరిక
రేణిగుంట, నవంబర్ 22: రాష్ట్రంలోని చెరకు రైతులు, కార్మికుల కష్టాలు పట్టీపట్టనట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, బకాయిలు వెంటనే చెల్లించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని నగరి ఎమ్మెల్యే రోజా హెచ్చరించారు. బుధవారం ఉదయం గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ వద్ద శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. ఇందుకు నిదర్శనం శ్రీసిటీ, మన్నవరం, అంతర్జాతీయ విమానాశ్రయమేనని చెప్పారు. వైఎస్‌ఆర్ పాలనలో జిల్లాలోని కో ఆపరేటివ్ చక్కెర కర్మాగారాలకు బకాయిలను మాఫీ చేసి రైతుల కష్టాలు తీర్చిన దేవుడని కొనియాడారు. నేడు ఎస్వీ చక్కెర కర్మాగారంలో రూ.13.50 కోట్లు రైతులకు బకారుూలున్నాయని, కార్మికులకు రూ. 7 కోట్లు జీతభత్యాలు చెల్లించాల్సి ఉందన్నారు. జిల్లా వాసియైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేలు చేయకుండా జిల్లాలోని ప్రాజెక్టులను గాలికి వదిలేశారని ఆరోపించారు. నేడు రైతు, కార్మిక వ్యతిరేకపాలన కొనసాగుతోందని ఆమె మండిపడ్డారు. ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీలో చెరకు క్రషింగ్ చేస్తే అప్పులు వస్తాయనుకుంటే, ప్రైవేట్ ఫ్యాక్టరీలో క్రషింగ్ చేస్తే లాభాలు ఎలా వస్తాయని ఆమె ప్రశ్నించారు. ప్రైవేట్ చక్కెర కర్మాగారాలకు ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని, ఇందులో భాగంగానే ప్రైవేట్ చక్కెర కర్మాగారాలు సిండికేట్‌గా ఏర్పడి ఎస్వీ చక్కెర ఫ్యాక్టరీని శాశ్వితంగా మూసివేయించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆమె ఆరోపించారు. ప్రభుత్వమే సంవత్సరానికి ఒకసారి ప్రభుత్వ, ప్రైవేట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి రైతుల దోపిడీకి అడ్డుకట్టవేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. అనంతరం బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం తిరిగే ప్రత్యేక విమానాల ఖర్చును మిగిలిస్తే రాష్ట్రంలోని చెరకు రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించవచ్చన్నారు. రాష్ట్రంలో ఏంచేశారని టిడిపి నాయకులు సన్మానాలు చేసుకుంటున్నారని ఆమె నిలదీశారు. ఎర్రచందనం అక్రమరవాణాలకు, డీకేటీ భూముల కబ్జాలకు, కార్పొరేట్ సంస్థలకు ఎర్రతివాచీ పరుస్తున్న ప్రభుత్వానికి సన్మానం చేయాలని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు తిరుమల రెడ్డి, అంజూరు శ్రీనివాస్, షిరాజ్ బాషా, యుగంధర్ రెడ్డి, హరినాథ రెడ్డి, చక్రపాణి రెడ్డి, ప్రభాకర్, మోహన్ నాయుడు, శ్రీకాంత్ రాయల్, ఆదినారాయణ రెడ్డి, సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరి తదితరులు పాల్గొన్నారు.

నేడు పంచమీ తీర్థంకు ఏర్పాట్లు పూర్తి
తిరుపతి, నవంబర్ 22: తిరుచానూరులో కొలువైవున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఈనెల 23వ తేదీ గురువారం ఉదయం 11.48 గంటలకు నిర్వహించే పంచమీ తీర్థానికి టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది. కార్తీక శుక్లపంచమినాడు పద్మసరోవరాన్ని సేవించడమే తిరుచానూరు పంచమిగా భక్తులు పేర్కొంటారు. ఆనాడే పద్మసరోవరం నుంచి అలమేలుమంగ ఆవిర్భవించి శ్రీనివాసునికి 6 పసన్నమై స్వామి తపస్సును ఫలింపజేసింది. అందుకే బ్రహ్మాది దేవతలు, ఎందరో మహర్షులు ఈ తీర్థాన్ని కొనియాడారు. పుష్కరణిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల సౌకర్యార్థం టిటిడి ప్రత్యేక చర్యలు తీసుకునింది. పంచమీతీర్థ ప్రభావం రోజంతా ఉంటుందని భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్యస్నానాలు ఆచరించాలని టిటిడి ఈఓ సింఘాల్ కోరారు. శుక్రవారం ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకు మూలవర్లకు అభిషేకం నిర్వహించిన అనంతరం ఉదయం 10.30 గంటలకు పద్మావతీ అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుంచి 7గంటల వరకు పుష్పయాగం వైభవంగా జరుగుతుంది. పుష్పయాగం కారణంగా ఆలంయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవలను టిటిడి రద్దు చేసింది.
ఏర్పాట్లను సమీక్షించిన జేఈఓ పోలా భాస్కర్
తిరుచానూరులోని ఆస్థాన మండపంలో జేఈఓ పోలా భాస్కర్ టిటిడి నిఘా, భద్రతా అధికారులు, పోలీసులతో పంచమీతీర్థం ఏర్పాట్లపై బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. పుష్కరణిలోకి భక్తులు ప్రవేశించడానికి 11 మార్గాలు, నిష్క్రమణకు 17 మార్గాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పోలీసులతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పుణ్యసాన్నాలకు వచ్చే భక్తులు పుష్కరణిలోనికి ప్రవేశించేటప్పుడు, బయటకు వెళ్లేటప్పుడు తొక్కిసలాటలకు తావులేకుండా సంయమనం పాటించాలన్నారు. ఉదయం 11.48 గంటలకు చక్రస్నాన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుందని, దీని ప్రభావం రోజంతా ఉంటుందని వెల్లడించారు. భక్తుల వాహనాల పార్కింగ్ కోసం తిరుచానూరు రోడ్డులోని శిల్పారామం, దీని ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం, మార్కెట్ యార్డు, పూడి రోడ్డులో స్థలాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగులు రెండు గంటల తరువాత పుష్కరణిలో స్నానాలు ఆచరించాలని జేఈఓ కోరారు. సీవీఎస్వో ఆకె రవికృష్ణ మాట్లాడుతూ పంచమి తీర్థానికి 300 మంది టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది, 100 స్కౌట్స్ అండ్ గైడ్స్, 500 మంది శ్రీవారి సేవకులను భక్తులకు సేవలు అందిస్తారన్నారు. ఎఎస్వీ స్వామి మాట్లాడుతూ 1500 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతాచర్యలు తీసుకున్నామని, తిరుచానూరులోకి వాహనాలు ప్రవేశించకుండా ట్రాఫిక్ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఈ సమావేశంలో ఎఎస్పీ మురళీకృష్ణ, డీఎస్పీ మునిరామయ్య, అదనపు సీవీఎస్వో శివకుమార్ రెడ్డి, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ మునిరత్నం రెడ్డి ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

సింగిల్ విండో ఎన్నికలపై సందిగ్ధం
ఆంద్రభూమి బ్యూరో
చిత్తూరు, నవంబర్ 22: జిల్లాలో సింగిల్ విండో ఎన్నికలపై సందిగ్ధం నెలకొంది. ఈ పాలక వర్గాల పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఇంతవరకు ఈ ఎన్నికలపై ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలను మరో కొద్దిరోజుల పాటు పొడిగిస్తారా, లేక ఎన్నికలు నిర్వహిస్తారన్న దానిపై నేటికీ స్పష్టత లేదు. దీంతో నేతల్లో ఆందోళన నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 76 సింగిల్ విండోలు ఉన్నాయి. అందులో 15 సంఘాలకు అనివార్య కారణాల వల్ల గతంలో ఎన్నికలు జరగలేదు. మిగిలిన 61 సంఘాలకు ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఈ ఎన్నికల వ్యవహారం రాష్టవ్య్రాప్తంగా చర్చనీయాశంగా మారింది. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించారని పలు పార్టీల నేతలు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వాస్తవంగా మూడునెలల ముందే సింగిల్‌విండో పాలక వర్గాల ఎన్నికలకు సంబంధించి సహకారశాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే వచ్చే నెలతో ఈ పాలక వర్గాలకు పదవీకాలం ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో అసలు ఎన్నికలు నిర్వహిస్తారా..లేక పాలకవర్గాలకు పదవీ కాలం పొడిగిస్తారా అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. అయితే ఈ వ్యవహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ఎన్నికల బరిలో నిలవాలని ఆకాంక్షతో ఉన్న నేతల్లో మాత్రం ఆందోళన నెలకొంది.

భక్తుడిని తొక్కిన శ్రీకాళహస్తీశ్వరాలయ గోవు
* చికిత్స పొందుతూ మృతి
శ్రీకాళహస్తి, నవంబర్ 22: శ్రీకాళహస్తీశ్వరాలయానికి చెందిన గోవు తొక్కడంతో గాయాలపాలైన భక్తుడు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం పుల్లూరు గ్రామానికి చెందిన శంకర్‌రెడ్డి (45) అనే భక్తుడు ఈ నెల 17వ తేదీ ఉదయం శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణంలో ఉన్న గోవుకు నమస్కారం చేసుకునేందుకు శంకర్‌రెడ్డి దాని కింద దూరి ఒక వైపు నుండి మరో వైపుకు వెళుతుండగా, బెదిరిన ఆవు తొక్కడంతో అతను గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు తిరుపతి రుయా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. శంకర్‌రెడ్డి పేగులు నలిగిపోయి ఉండటంతో రెండు రోజుల తర్వాత స్విమ్స్‌కు తరలించి శస్త్ర చికిత్స నిర్వహించారు. చికిత్స పొందుతూ శంకర్‌రెడ్డి మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతదేహాన్ని బుధవారం స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఆలయంలో ఆవు వల్ల ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి. ఈ ప్రమాదంపై దేవస్థానం అధికారులు, సిబ్బంది ఎటువంటి సమాచారం చెప్పడం లేదు.

నేడు టీడీపీలో చేరనున్న మాజీ సీఎం కిరణ్ సోదరుడు కిషోర్‌కుమార్ రెడ్డి
పీలేరు, నవంబర్ 22: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్‌కుమార్ రెడ్డి గురువారం పీలేరు నియోజకవర్గం నుంచి 500 వాహనాలతో బయలుదేరి విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోనున్నట్లు ఆయన అనుచరుడు కంభం భాస్కర్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం భాస్కర్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ గత 3 నెలలుగా పీలేరు నియోజకవర్గంలోని గుర్రంకొండ, కలికిరి, కలకడ, కేవీపల్లి, పీలేరు, వాల్మీకీపురం మండలాల్లో ప్రతీ గ్రామంలో కిషోర్‌కుమార్‌రెడ్డి విస్తృత సమావేశాలు, ఆత్మీయ సదస్సులు నిర్వహించిన అనంతరం ప్రజలు, నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకే తెలుగుదేశం పార్టీలో అధికారికంగా చేరుతున్నట్లు తెలిపారు. పీలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాలను అభివృద్ధి బాటలో నడిపిన నల్లారి కుటుంబం ప్రస్తుతం పీలేరు నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. గురువారం జరగబోయే వాహన ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని భాస్కర్‌రెడ్డి కోరారు.

న్యాయమూర్తి పీవీ సదానందమూర్తి మృతి
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, నవంబర్ 22: తిరుపతి న్యాయస్థానంలో సీనియర్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న పీవీ సదానంద మూర్తి బుధవారం మృతి చెందారు. ఎంతో మంచి న్యాయమూర్తిగా ఆయన అందరి మన్ననలు పొందారు. అయితే ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. కాగా సదానంద మూర్తి మృతిపట్ల న్యాయవిభాగానికి సంబంధించిన పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

తిరుపతిలో సినీనటి నమిత, వీరేంద్రచౌదరిల నిశ్చితార్థం
తిరుపతి, నవంబర్ 22: సినీ నటి నమిత, డైరెక్టర్ వీరేంద్ర చౌదరిల వివాహ నిశ్చితార్థ వేడుకలు తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో బుధవారం జరిగింది. నమిత, వీరేంద్ర చౌదరిల కుటుంబ సభ్యులు, ముఖ్యుల మధ్య వేడుకగా జరిగిన ఈ నిశ్చితార్థం గురించి బయటకు పొక్కడంతో ప్రజలు పెద్ద ఎత్తున హోటల్ వద్దకు చేరుకున్నారు. ఈనెల 24న స్థానిక ఇస్కాన్ మందిరంలో ఉదయం 5.30 గంటలకు వీరిరువురి వివాహం జరుగనుంది.