చిత్తూరు

ఐఐటీ, ఐసర్ ప్రహరీ పనులు నెలాఖరులోగా పూర్తిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏర్పేడు, ఫిబ్రవరి 16: ఐఐటీ, ఐసర్ ప్రహరీ గోడ పనులను ఈ నెలాఖరులోపల పూర్తిచేయాలని ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ ఇంజనీర్లను జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ఆదేశించారు. శుక్రవారం ఏర్పేడు మండల కేంద్రం సమీపంలో వెంకటగిరి జాతీయ రహదారిపై దాదాపు 500 ఎకరాల్లో నిర్మితమవుతున్న తిరుపతి ఐఐటీ శాశ్వత క్యాంపస్ భవనాలు, 7500 మీటర్ల ప్రహరీ నిర్మాణ పనులను, అదేవిధంగా సోమశిల, స్వర్ణముఖి కెనాల్ వద్ద నిర్మిస్తున్న ఐసర్ ప్రహరీ, శాశ్వత క్యాంపస్ భవనాల పనులను ఐఐటీ డైరెక్టర్, ఇతర అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణపు పనులు ఎలా జరుగుతున్నాయనే అంశంపై డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణతో కలిసి సమీక్షించారు. ఎండ వేడిమి తీవ్రంగా ఉన్నప్పటికీ కలెక్టర్ అధికారులతో కలిసి సుమారు 2కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి కొండ సమీపంలో నిర్మిస్తున్న 400 మీటర్ల ప్రహరీ పెండింగ్ పనులను పరిశీలించారు. ప్రభుత్వ జీఓ ప్రకారం ఐఐటీ నిర్మాణానికి 500 ఎకరాలు కేటాయించిన విషయం పాఠకులకు విధితమే. ఇప్పటి వరకు 530 ఎకరాల ప్రభుత్వ భూమిని మాత్రమే ఐఐటీకి కేటాయించారు. తక్కిన 30 ఎకరాల భూమిని ఎక్కడ కేటాయించాలనే విషయంపై జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న పరిశీలించారు. వెంటనే ఆ భూమిని కూడా ఐఐటీకి అందించాలని సబ్ కలెక్టర్ కీర్తిని, ఏర్పేడు తహశీల్దార్ శేషగిరిని ఆదేశించారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ 400 మీటర్ల ప్రహరీ గోడ నిర్మాణ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధ ప్రాతిపదికన నెలాఖరులోపల పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఐసర్ ప్రహరీగోడ ఫెన్సింగ్ పనులను కూడా వెంటనే ప్రారంభించాలని సూచించారు. నిధుల ఖర్చులకు సంబంధించిన వినియోగ ధృవీకరణ పత్రాన్ని కూడా ఐఐటీ అధికారులకు తక్షణం అందించాలని ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. ఆయన వెంట పీఆర్ ఎస్‌ఈ అమరనాధ్, ఏపీ విద్య, వైద్య వౌళిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ఈఈ నగేష్, ఆర్ అండ్ బి డీఈ, ఏర్పేడు తహశీల్దార్ శేషగిరి, ఇతర ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. ఇదిలా ఉండగా కలెక్టర్ ఐసర్, ఐఐటీ పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో పలమనేరు మండలం మోరం వద్ద ఓ ప్రైవేటు హేచరీస్‌లో భూగర్భ డ్రైనేజీ శుభ్రం చేస్తూ ఏడుగురు మరణించిన సమాచారం రావడంతో తక్షణం ఆయన సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు.