చిత్తూరు

వ్యవసాయరంగంలో నూతన ఆలోచనలు, పరిశోధనలు విస్తృతంగా సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 16: భారతదేశానికి వెనె్నముక వ్యవసాయరంగమని, ఈక్రమంలో రైతులు వ్యవసాయాన్ని భారంగా కాకుండా తక్కువ వ్యయంతో, ఎక్కువ దిగుబడిని సాధించేలా నేటి ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణలోకి తీసుకుని నూతన ఆలోచనలతో, పరిశోధనలు చేయాల్సిన బాధ్యత శాస్తవ్రేత్తలపైన, విద్యార్థులపైన ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తిరుపతి పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన ప్రారంభమైన 18వ అగ్రియూనిఫెస్టో వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా ముగిశాయి.దేశంలోని 52 పశు, వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయాలకు చెందిన 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కళలకు సంబంధించిన పోటీలను నిర్వహించారు. ఈ క్రమంలో విజేతలకు శుక్రవారం బహుమతులు ప్రదానం చేశారు. ఈసందర్భంగా జరిగిన సభకు మంత్రి సోమిరెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగించారు. భారతదేశంలో అత్యధికంగా వ్యవసాయరంగంపై ఆధారపడి జీవించే రైతులు ఉన్నారన్నారు. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ రంగానికి అగ్రతాంబూలం ఇస్తోందన్నారు. 2050 సంవత్సరానికి ప్రపంచ జనాభా 2బిలియన్లకు చేరుకుంటుందని ఈ క్రమంలో ఆహార ఉత్పత్తుల అవసరం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా భారతదేశ ప్రజల అవసరమైన ఆహార ఉత్పత్తులను గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. ఇందులో భాగంగా వ్యవసాయరంగంతోపాటు అనుబంధ రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. నేడు నెలకొని ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయరంగం రైతుకు ఆర్థిక భారాన్ని పెంచుతోందన్నారు. అలాకాకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తులు వచ్చేలా నూతన ఆలోచనలకు శాస్తవ్రేత్తలు, విద్యార్థులు పరిశోధనలు విస్తృతం చేయాలన్నారు. ప్రపంచంలోనే భారతదేశంలో ఉన్నంత యువ శక్తి, ప్రతిభా పాటవాలు మరేదేశానికి లేవన్నారు. ముఖ్యంగా 15 నుంచి 35 సంవత్సరాల్లోపున్న యువ శక్తి దేశంలో ఎక్కువగా ఉందన్నారు. అంటే మరో నాలుగు దశాబ్దాలు యువత ప్రతిభా పాటవాలు, శక్తి యుక్తులు ఎంతో అవసరమని చెప్పారు. అద్భుత భారతదేశ నిర్మాణానికి రానున్న కాలంలో యువతే రథసారధులు కావాలని పిలుపునిచ్చారు. తిరుపతిలో యూనిఫెస్ట్ జరగడం అభినందనీయమన్నారు. దేశంలోని భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలున్న విద్యార్థులు ఒక్క వేదికపైకి రావడం ముదావహమని అన్నారు. ఇందుకు తిరుపతి పుణ్యక్షేత్రం కేంద్రబింధువు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఐదు రోజులపాటు జరిగిన ఈ ఉత్సవాల్లో యువత నాటక, చిత్రలేఖనం ఇతర కళాప్రదర్శనల్లో చూపిన ప్రతిభా పాటవాలు అద్భుతమన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించడంతోపాటుగా వారిలో వ్యక్తిత్వ నిర్మాణంపైన కూడా విశ్వవిద్యాలయాలు దృష్టి సారించాల్సి ఉందన్నారు. నేడు వాటికన్ సిటీతో సమానంగా శ్రీవారి దర్శనాని భక్తులు వస్తున్నారని ఇక్కడ జాతీయ స్థాయి యువజనోత్సవాలు నిర్వహించడం శుభపరిణామమన్నారు. ఐసిఎఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పిఎస్ పాండే మాట్లాడుతూ చదువుతోపాటుగా సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వాములు కావడం వల్ల వారిలో వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పాఠ్యాంశాలతోపాటుగా వ్యక్తిత్వ వికాసం, సాప్ట్ స్కిల్స్ అభివృద్ధి చెందేవిధంగా ప్రణాళికలు రచించడం జరిగిందని అన్నారు. విద్యార్థులు విశ్వవిద్యాలయాల నుంచి వెలుపలికి వచ్చాక ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా సాంతంగా సంస్థను స్థాపించుకునేలా విద్యావిధానంలో మార్పులు చేయడం జరిగిందని వివరించారు. యువజనోత్సవాల్లోపాల్గొన్న విద్యార్థులు గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి తీపి గుర్తుగా భావించి ముందుకు సాగాలన్నారు. శ్రీవేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయ విసి డాక్టర్ వై.హరిబాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో అంతర్లీనంగావున్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు యువజనోత్సవాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. కేవలం చదువే కాకుండా ఇలాంటి ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమాల్లోను యువత పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. జయాపజయాలను దృష్టిలో పెట్టుకోకుండా విజయం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉండాలన్నారు. పాల్గొన్న వారంతా విజేతలేనని, తమ నైపుణ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి నిరంతరం కృషి చేస్తూనేవుండాలన్నారు. ఈనెల 26,27 తేదీల్లో వర్శిటీలో రాష్టస్థ్రాయి ఎన్‌ఎస్‌ఎస్ యూత్ ఫెస్టువల్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐసిఏఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పిఎస్ పాండే, వర్శిటీ స్టూడెంట్ ఆఫైర్స్ డీన్ డాక్టర్ కె.సర్జన్‌రావు, ఏడి డాక్టర్ నళినికుమారి, డాక్టర్ రాంబాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలకు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఒరిస్సాకు చెందిన ఒరిస్సా యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ టెక్నాలజీ ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకునింది. పంజాబ్‌కు చెందిన గురు అంగద్ దేవ్ వెటర్నరీ యూనివర్శిటీ ద్వితీయ స్థానంలోనిలిచింది. అత్యంత క్రమశిక్షణ కలిగిన విశ్వవిద్యాలయంగా అస్సాం అగ్రికల్చర్ యూనివర్శిటీ జోరాట్‌కు బహుమతి లభించింది. ఎస్వీవియూ విద్యార్థులు తొలిసారి గ్రూప్ డాన్స్‌లో ద్వితీయ స్థానంలో, డిబేట్‌లో తృతీయ స్థానంలో నిలిచారు. ఓఎస్‌ఏ డాక్టర్ రాంబాబు నాయక్ ఆధ్వర్యంలో శిక్షణపొందిన శ్రీవిద్య, శ్రీవాణి, హేమలత, తేజశ్విని, రేష్మ, శ్రావణి,సునీల్, రామకృష్ణన్‌రాజు, డిబేట్‌లో శివాణి, మహంతి శ్రీకర్‌లు విజయం సాధించారు.